టాటా జికా లక్షణాలు మరియు నిర్దేశాలు బహిర్గతం

డిసెంబర్ 04, 2015 04:50 pm raunak ద్వారా ప్రచురించబడింది

జికా వాహనం 1.2L నేచురల్లీ ఆస్పిరేటెడ్ Revotron పెట్రోల్ మరియు 1.05L Revotorq టర్బో డీజిల్ అను కొత్త ఇంజిన్లతో వస్తుంది. టాటా మోటార్స్ దీని పైన చాలా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇది ట్రాఫిక్ వివరాలపై దృష్టి ఎక్కువగా సారిస్తుంది!

జైపూర్:

టాటా మోటార్స్ రాబోయే జికా హాచ్బాక్ యొక్క లక్షణాలు మరియు నిర్దేశాలను విడుదల చేసింది. ఈ హ్యాచ్ కొత్త 3-సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అధారితం చేయబడి ఉంటుంది మరియు విభాగంలో మొదటి లక్షణాలకు అతిధేయగా వస్తుంది. టాటా DesignNextడిజైన్ ఆధారంగా ఈ వాహనం పూనే, UK మరియు ఇటలీ ఆధారంగా టాటా డిజైన్ స్టూడియో నుండి రూపొందించబడుతుంది. టాటా జికా ఒక పోటీతత్వపు ధరతో రాబోతున్నది. టాటా జికా మనకి ఏమిటేమిటి అందిస్తుందో చూద్దాము.

నిర్దేశాలు:

ఇంజిన్లు:

1.2 లీటర్ Revotron - 3-సిలిండర్ MPFI - DOHC 4 వాల్వుస్ పర్ సిలిండర్
పవర్ - 85 PS @ 6000 rpm
టార్క్ - 114Nm @ 3500 rpm
1.05 లీటర్ Revotorq, 3-సిలిండర్, CRAIL - DOHC సిలిండరుకు 4 వాల్వుస్
పవర్ - 70 PS @ 4000 rpm
టార్క్ - 140Nm@ 1800-3000 rpm

కొలతలు:

పొడవు - 3746 mm
వెడల్పు - 1647 mm
ఎత్తు - 1535 mm
వీల్బేస్ - 2400 mm
కెర్బ్ బరువు - పెట్రోల్ - 1012 కిలోలు; డీజిల్ - 1080 కిలోలు
గ్రౌండ్ క్లియరెన్స్ - 170 mm
ఇంధన ట్యాంక్ కెపాసిటీ - 35 లీటర్లు (పెట్రోల్ మరియు డీజిల్)
టైర్ సైజ్ - 175/65 క్రాస్‌సెక్షన్ R14
బూట్ స్పేస్ - 240-లీటర్ల
22 క్యాబిన్ నిల్వ ఖాళీలు

డ్రైవింగ్ మోడ్లు:

జెస్ట్ మరియు బోల్ట్ లాగానే, టాటా జికా వాహనం సిటీ మరియు ఎకో అను బహుళ-డ్రైవ్ రీతులతో వస్తుంది. అలానే జెస్ట్ మరియు బోల్ట్ లా కాకుండా, జికా యొక్క కొత్త రెవొట్రోక్ డీజిల్ కూడా ఎకో మరియు సిటీ డ్రైవింగ్ మోడ్ లను కలిగి ఉంది.

ఫీచర్స్ మరియు భద్రత:

కనెక్ట్ నెక్స్ట్ సమాచార వినోద వ్యవస్థ- టాటా వారి కనెక్ట్ నెక్స్ట్ లైనప్ లో హర్మాన్ ద్వారా నడిచే ఒక కొత్త యూనిట్ తో వచ్చింది. ఈ వ్యవస్థ బ్లూటూత్ కనెక్టివిటీ, ట్యూనర్, USB, ఆక్స్-ఇన్ మరియు ఒక పెద్ద స్క్రీన్ డిస్ప్లే ని కలిగి ఉంది మరియు కొత్త సఫారీ మాదిరిగానే, ఈ వ్యవస్థ కూడా వెనుక పార్కింగ్ సెన్సార్లు నుండి ఇన్పుట్లను చూపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫోర్డ్ యొక్క సింక్రనైజింగ్ సమాచార వినోద వ్యవస్థ వలే టాటా యొక్క కనెక్ట్ నెక్స్ట్ ప్రస్తుతం నావిగేషన్ యాప్ మరియు జూక్ యాప్ రెండు అనువర్తనాలు తో స్మార్ట్ఫోన్ సమన్వయాన్ని అందిస్తుంది. ఈ వాహనం విభాగంలో మొదటి 8 స్పీకర్ వ్యవస్థ - 4 స్పీకర్లు మరియు 4 ట్విట్టర్లను పొంది ఉంది.

నావిగేషన్ యాప్: టాటా ప్రకారం, ఈ యాప్ స్మార్ట్ఫోన్ బ్లూటూత్ ద్వారా యూనిట్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు యాప్ సమాచార వినోద వ్యవస్థ పై నావిగేషన్ వంటుల వారీగా ప్రదర్శింపబడేలా చేస్తుంది. (ఆండ్రోయిడ్ మాత్రమే)

జూక్ కార్ యాప్: ఈ యాప్ ముబైల్ హాట్‌స్పాట్ వలన వచ్చిన నెట్వర్క్ ద్వారా కనెక్ట్ డివైజ్ నుండి ప్లే అవుతున్న పాటల మొత్తం జాబితాను మిగిలిన కనెక్ట్ డివైజ్ కి షేర్ చేసేందుకు సహాయపడతాయి.(ఉదాహరణకు Xender!). ఆశ్చర్యం ఇదంతా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు వారు ఎంచుకున్న పాటల జాబితాని వరుసగా సులభంగా పొందాలనుకుంటారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది! (ఆండ్రోయిడ్ మాత్రమే).

భద్రత - ఈ వాహనం ABS, EBD మరియు CSC (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) తో పాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని అందిస్తుంది.

AC వెంట్స్ ప్యాలెట్లు- జికా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ఎడమ మరియు కుడి వైపు Ac లోవర్స్ కి రంగు ప్యాలెట్లు తో (బాహ్య రంగు తోనే) వస్తుంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience