• English
  • Login / Register

టాటా జికా ఆవిష్కరణ కంటే ముందుగా చిత్రాలు విడుదల

డిసెంబర్ 01, 2015 09:47 am arun ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • 7 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై:

ముందస్తుగా టాటా హాచ్ యొక్క తాజా చిత్రాలు ఒక మంచి లుక్ తో వెలువడ్డాయి. జికా వాహనం డిజైన్ పరంగా, దశాబ్ధాల క్రితం విడుదల అయిన పాత ఇండికా ను పోలి ఉంటుంది.

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, ఒక బారీ గ్రిల్ కు స్మోక్డ్ హెడ్ లైట్లు విలీనం చేయబడి ఉన్నాయి. ఈ టాటా జికా వాహనం యొక్క ముందరి భాగంలో అనేక క్రోం చేరికలు అందించబడ్డాయి. ఎక్కువ మొత్తంలో క్రోం చేరికలను, హెడ్ ల్యాంప్లు అలాగే ఫాగ్ ల్యాంప్స్ బయటి వైపున గమనించవచ్చు. ముందు బాగంలో ఉండే బంపర్ కు అలాగే బోనెట్ కు కొన్ని పవర్ బల్జ్లు అందించబడ్డాయి. దీని వలన ఈ వాహనానికి ఒక ఉగ్రమైన లుక్ అందించబడుతుంది.

ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ముందు క్వార్టర్ ప్యానల్ నుండి వెనుక టైల్ లైట్ల వరకు ఒక ప్రత్యేక షోల్డర్ లైన్ విలీనం చేయబడి ఉంటుంది. దీనిని మొదటిసారి చూసినప్పుడు హోండా బ్రియో లా కనిపిస్తోంది. సైడ్ ప్రొఫైల్ లో ఉండే డోర్లు మరియు పెద్ద విండోలను గమనించినట్లైతే, మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించే మరిన్ని అంశాలను ఈ వాహనం కలిగి ఉంది. అవి ఏమిటంటే, సన్నని సి పిల్లార్, నలుపు రంగు బి పిల్లార్ మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లకు సైడ్ టర్న్ సూచికలు వంటి అంశాలు టాటా జెస్ట్ మరియు బోల్ట్ ల నుండి తీసుకోబడ్డాయి.

ఈ వాహనం కలిగి ఉన్న అల్లాయ్ వీల్స్, వెనుక డిఫోగ్గర్ మరియు పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలను గమనించినట్లైతే, ఇది ఖచ్చితంగా అగ్ర శ్రేణి వేరియంట్ అని చెప్పవచ్చు. వెనుక భాగం విషయానికి వస్తే, నునుపుగా ఉండే టైల్ లైట్ క్లస్టర్లు అందించబడతాయి మరియు వీటిని ఫోర్డ్ ఫిగో వాహనంలో చూడవచ్చు. బూట్ మూత పొడవునా రెండు వ్యక్తీకరణ లైన్లను గమనించవచ్చు. వెనుక బంపర్ కు, నలుపు రంగు ఫినిషింగ్ ను కలిగిన నంబర్ ప్లేటు విలీనం చేయబడి ఉంటుంది. ఈ జికా వాహనం యొక్క వెనుక భాగంలో ఒక సమగ్ర స్పాయిలర్ బిగించబడి ఉంటుంది మరియు దీనికి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ విలీనం చేయబడి ఉంటుంది.  

ఈ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, ఈ జికా లోపలి భాగం అంతా నలుపు మరియు గోదుమ రంగు పథకం అందించబడుతుంది. డోర్ హ్యాండిల్స్ వంటి ప్రత్యేక స్థానాలలో ఎక్కువ మొత్తం లో క్రోం చేరికలను చూడవచ్చు. ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, నాలుగు స్పీకర్లను కలిగిన హార్మాన్ కార్డన్ వ్యవస్థ అందించబడుతుంది.

ఈ జికా వాహనం, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ముందుగా పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, ఈ వాహనం ఒక కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి అత్యధికంగా, 84 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 110 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనం 1.0 లీటర్ (ఈ ఇంజన్, ప్రస్తుతం ఉన్న ఇండికా 1.4 లీటర్ ఇంజన్ నుండి తీసుకోబడినది) ఇంజన్ తో జత చేయబడి అత్యధికంగా 67 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 140 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ జికా వాహనం, ఈ విభాగంలో ఉన్న అధిక బరువు కలిగిన మారుతి వ్యాగన్ ఆర్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ హాచ్బాక్ విభాగంలో టాటా లో ఈ జికా వాహనం ఒక ఉత్తమ డిజైన్ ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఈ వాహనం యొక్క ఆవిష్కరణ, ఒక వారం లోపల జరగనుంది మరియు వచ్చే ఏడాది ఈ వాహనం యొక్క విజయాన్ని షోరూం లలో చూడవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience