Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

విభాగంలో ఉత్తమ విక్రయాలతో రాబోతున్న టాటా జికా

డిసెంబర్ 08, 2015 06:11 pm raunak ద్వారా ప్రచురించబడింది

ఒక మంచి డిజైన్ + అనేక లక్షణాలతో లోడ్ చేయబడిన వాహనం / ఆడంబరమైన డిజైన్ + లక్షణాలతో లోడ్ అంశాలు = రాకెట్ వెగంతో ప్రారంభం!

జైపూర్: ప్రస్తుతం భారతదేశంలో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, క్రెటా, ఫోర్డ్ ఫిగో అస్పైర్, మారుతి సుజుకి బాలెనో వంటి వాహనాలతో పాటు ఈ వాహనం, రాబోతుంది. ఇప్పుడు మనం చాలా సంతోషించవలసిన అవసరం ఉంది ఎందుకంటే, టాటా సంస్థ వారు అనేక లక్షణాలతో మరియు అద్భుతమైన డిజైన్ తో కొత్త జికా వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ టాటా జికా వాహనం, ఈ విభాగంలో ఉండే చెవ్రోలెట్ బీట్, హ్యుందాయ్ ఐ10 అలాగే మారుతి సెలిరియో వంటి వాహనాలతో నెమ్మదిగా పోటీ పడుతుంది. ప్రస్తుతం ఈ మారుతి సెలిరియో వాహనం, నెలకు 60,00 నుండి 70,000 వాహనాలను విక్రయిస్తుంది. ఈ ప్యాకేజీ మొత్తన్ని పరిగణలోకి తీసుకున్నట్లైతే విభాగంలో ఉత్తమ అమ్మకాలతో రాబోయే అవకాశం ఉంది.

Tata Zica

డిజైన్ గురించి మాట్లాడటానికి వస్తే, బీట్ తో పాటు ఈ విభాగంలో ఉండే ఇతర వాహనాల కంటే అందంగా మరియు మరింత ఆడంబరముగా ఈ టాటా జికా కనిపిస్తుంది. ఈ బీట్ యొక్క అమ్మకాలు సరిగా లేకపోవడంతో దాని స్థానాన్ని, సవరించిన బీట్ తో భర్తీ చేయనుంది. మరోవైపు హ్యుందాయ్ ఐ10. ఈ వాహనం చాలా పురాతనమైనది మరియు ఈ వాహనం, నెలకు 20,000 కార్లను అమ్ముతుంది. ఈ సెలిరియో వాహనం, 2014 భారత ఆటో ఎక్స్పో సమయంలో ప్రారంభించబడింది మరియు ఈ విభాగంలో, ఏఎంటి వెర్షన్ (ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) తో వచ్చింది. అంతేకాకుండా దీని యొక్క డిజైన్ కూడా ఒక సాధారణ జేన్ ను కలిగి ఉంది. జికా కూడా, ఈ విభాగంలో ఉత్తమ క్యాబిన్ లతో పాటు వస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Tata Zica Cabin

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ జికా వాహనం అనేక లక్షణాలతో త్వరలో రాబోతుంది. సెలిరియో ను మినహాయిస్తే, ఈ విభాగంలో ఏ ఇతర వాహనం కూడా బ్లూటూత్ కనెక్టవిటీ తో రాదు. మరోవైపు జికా వాహనం, హార్మాన్ శక్తితో కూడిన కనెక్ట్ నెక్స్ట్ యూనిట్ తో అందించబడుతుంది. ఈ యూనిట్, ఈ విభాగంలో మొదటి సారిగా ఎనిమిది స్పీకర్లతో (నాలుగు స్పీకర్లు + నాలుగు ట్వీటర్లను) మరియు స్వర ఆదేశాలతో వస్తుంది. కనెక్టవిటీ పరంగా ఈ వాహనం, బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఆక్స్ ఇన్ మరియు యూఎస్బి వంటి కనెక్టవిటీలను కలిగి ఉంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను, ఈ యూనిట్ తో జత చేయవచ్చు మరియు వీటి ప్రదర్శన, టర్న్ బై టర్న్ నావిగేషన్ లో ప్రదర్శింపబడుతుంది. ఇక్కడితో ఈ అంశాలు పూర్తి అయినట్టు కాదు. మరోక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ వాహనం ప్రయాణ సమయంలో వివిధ పాటల ట్రాక్స్ ను వినుటకు, ప్రయాణికుడి యొక్క మొబైల్ ద్వారా మొబైల్ హాట్ స్పార్ట్ ను ఆన్ చేసి బ్లూటూత్ ఆడియో ను వినవచ్చు.

Tata Zica

భద్రత పరంగా చెప్పాలంటే, మిగిలిన రెండు వాహనాలను మినహాయిస్తే ఈ హ్యుందాయ్ ఐ10 వాహనం ఎటువంటి భద్రతా అంశాలు అందించబడటం లేదు. అదే మిగిలిన రెండు అయిన బీట్ మరియు సెలిరియో వాహనాల భద్రత గురించి మాట్లాడటానికి వస్తే, ముందు రెండు ఎయిర్బాగ్ల తో పాటు ఏబిఎస్ + ఈబిడి వంటి అంశాలు అందించబడతాయి. వీటన్నింటితో పాటు, ఈ జికా వాహనంలో సి ఎస్ సి (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఫంక్షన్ తో వస్తుంది.

టాటా జికా యొక్క మొదటి డ్రైవ్ వీడియో ను వీక్షించండి

టాటా జికా లక్షణాలు మరియు నిర్దేశాలు బహిర్గతం

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.7 - 9.81 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర