ఆటో ఎక్స్‌పో 2020 లో టాటా 4 కొత్త మోడళ్లను ఆవిష్కరించనున్న ది
జనవరి 18, 2020 01:43 pm sonny ద్వారా ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతీయ కార్ల తయారీ సంస్థ కొత్త SUV లు, EV లను కూడా ప్రదర్శించనున్నారు
టాటా మోటార్స్ రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో బిజీగా ఉండనున్నది ఎందుకంటే దాని అప్‌డేటెడ్ ప్రొడక్ట్ లైనప్ నుండి నాలుగు గ్లోబల్ ఆవిష్కరణ లను అందించనున్నది. ప్రదర్శించే కార్లన్నిటికీ అప్‌డేట్ చేసిన BS 6 పవర్‌ట్రైన్‌లతో పాటు, టాటా ఎక్స్‌పోలో తన కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీని కూడా ప్రదర్శిస్తుంది. ప్రదర్శనలో ఉన్న కొన్ని కార్లు ఇప్పటికే ఉన్న టాటా మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ లు కావచ్చు. నాలుగు గ్లోబల్ ఆవిష్కరణలలో, మూడు SUV లు మరియు నాల్గవది ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఉన్నాయి. టాటా యొక్క రాబోయే మోడళ్లను నిశితంగా పరిశీలిద్దాం:
టాటా హారియర్ 2020
టాటా హారియర్ SUV ని పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్ట్ చేసిన కార్ టెక్ కోసం 8.8- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఎంబెడెడ్ ఇసిమ్ మరియు 18 ఇంచ్ పెద్ద అలాయ్స్ తో అప్‌డేట్ చేస్తుంది. కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో పాటు రాబోయే BS 6 నిబంధనలకు అనుగుణంగా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా ఇది అప్‌డేట్ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ హారియర్ కు కీలకమైన ముఖ్యాంశాలు అని చెప్పవచ్చు. ఇది MG హెక్టర్, కియా సెల్టోస్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటితో పోటీ పడుతుంది.
టాటా గ్రావిటాస్
గ్రావిటాస్ అనేది హారియర్ SUV యొక్క 7-సీట్ల వెర్షన్. ఇది 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన టాటా బజార్డ్ యొక్క ఇండియా-స్పెక్ వెర్షన్. ఇది బజార్డ్ మాదిరిగానే మూడవ వరుస యజమానులకు స్థలం కల్పించడానికి, పొడవైన రేర్ ఎండ్ ని కలిగి ఉంటుంది. గ్రావిటాస్ బజార్డ్ మాదిరిగానే లక్షణాలను అందిస్తుందని భావిస్తున్నారు, వెనుక సీటుకి వ్యక్తిగత బ్లోవర్ నియంత్రణలతో ఒక వైపు ఛార్జింగ్ పోర్టు ఉంటుంది.
8.8- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా మిగిలిన ఫీచర్ జాబితా హారియర్ మాదిరిగానే ఉంటుంది. ఇది హారియర్ వలె అదే BS 6-కంప్లైంట్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది, ఇది 170 Ps మరియు 350 Nm ను అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ తో జత చేయబడి ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఎంబెడెడ్ ఇసిమ్, పెద్ద చక్రాలు మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి 2020 హారియర్ నవీకరణలను గ్రావిటాస్ పొందవచ్చు. ఇది ఎక్స్పో లో ప్రారంభించబడే అవకాశం ఉంది, దీని యొక్క ధర సుమారు రూ .15 లక్షలు ఉంటుంది.
టాటా H2X ప్రీ-ప్రొడక్షన్ మోడల్
టాటా నుండి కొత్త మైక్రో-SUV అయిన H2X, ఎక్స్‌పోలో కంపెనీ షో-స్టాపర్ అవుతుంది. 2019 జెనీవా మోటార్ షోలో మొదట కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది, ఇది ఇప్పుడు ఫిబ్రవరి 2020 లో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో దాని ప్రీ-ప్రొడక్షన్ అవతార్‌లో ప్రదర్శించబడుతుంది. కొత్త మైక్రో-SUV 2020 రెండవ భాగంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, కాబట్టి ఎక్స్‌పో మోడల్ ఫైనల్ మోడల్ ఎలా ఉంటుందో అనే అంచనా ని ఇస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT ఎంపికతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇది విద్యుదీకరణకు సిద్ధంగా ఉన్న ఆల్ఫా ARC ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, H2X EV వెర్షన్‌ను కూడా పొందే అవకాశం ఉంది. H2X టాటా యొక్క కొత్త ఎంట్రీ-లెవల్ మోడల్ గా అవతరించింది, ఇది సబ్ -4m నెక్సాన్ కంటే చిన్నది.
టాటా ఆల్ట్రోజ్ EV ప్రొడక్షన్ మోడల్
టాటా ఆల్ట్రోజ్ EV ను 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు, కానీ ఇప్పుడు ప్రొడక్షన్ మోడల్ ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రవేశిస్తుంది. చూడడానికి ఇది జనవరి 22 న ప్రారంభించబోయే ఇండియా-స్పెక్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ తో సమానంగా కనిపిస్తుంది. ఇది తమ యొక్క పవర్‌ట్రెయిన్ ని నెక్సాన్ EV తో పంచుకుంటుంది, ఇది 300 కిలోమీటర్లకు పైగా క్లెయిమ్ రేంజ్ ని కలిగి ఉంటుంది. ఆల్ట్రోజ్ EV 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు, దీని ప్రారంభ ధర సుమారు రూ .15 లక్షలు వరకూ ఉంటుంది.
0 out of 0 found this helpful