• English
  • Login / Register

టాటా టియాగో వేరియంట్స్ వివరణ – ఏది మీరు కొనుగోలు చేసుకోవాలి?

టాటా టియాగో 2015-2019 కోసం khan mohd. ద్వారా మే 08, 2019 11:00 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Tiago

దాదాపు ఏడాదిన్నర తర్వాత, టియాగో టాటా మోటార్స్ ఎదురుచూస్తున్న ఒక వరం అని సురక్షితంగా చెప్పవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ అనేది మీ డబ్బుకి తగినంత విలువని అందిస్తుందని అన్న టైటిల్ ని తమ యొక్క కొనుగోలుదారుల నుండి సార్ధకం చేసుకుంది. టియాగో ధరలు రూ. 3.20 లక్షల నుంచి మొదలయ్యి రూ.5.65 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ వెళుతున్నాయి. ఈ టియాగో X- బాక్స్, XE, XM, XT మరియు XZ అను 5 వేరియంట్స్ లో అందించబడుతుంది. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ మరియు 1.05 లీటర్ రెవోటార్క్ డీజిల్ ద్వారా శక్తిని కలిగి ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాకుండా, టాటా టియాగోను AMT తో అందించబడుతుంది, కానీ అది ప్రత్యేఖంగా పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే మరియు XT మరియు XZA అను రెండు వేరియంట్లలో అందించబడుతుంది. టియాగో స్టాండర్డ్ గా ఏమిటి ఆఫర్ చేస్తుందో చూద్దాం:

టాటా టియాగో ముఖ్యమైన స్టాండర్డ్ లక్షణాలు

  •  టిల్ట్ సర్దుబాటుతో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
  • మల్టీ డ్రైవ్ మోడ్స్
  • 100 శాతం ఫ్లిప్ & ఫోల్డ్ వెనుక సీటు
  • శరీర రంగు బంపర్
  • డ్యుయల్ టోన్ ఇంటీరియర్ పథకం
  • విభజించబడిన DIS డిస్ప్లే 2.5- ఇంచ్ డ్రైవర్ సమాచార వ్యవస్థ
  • టాకోమీటర్

టాటా టియాగో రంగు ఎంపికలు

  •  సన్‌బరస్ట్  ఆరెంజ్
  • స్ట్రైకర్ బ్లూ
  • ప్లాటినం సిల్వర్
  • బెర్రీ రెడ్
  •  ఎక్స్‌ప్రెసో బ్రౌన్
  • పెరల్సెంట్ వైట్

అన్ని టియాగో వేరియంట్ల ధర జాబితా (అన్ని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు):

టియాగో వేరియంట్స్ పెట్రోల్                డీజిల్

టాటా టియాగో XB

రూ. 3.21 లక్షలు

రూ. 3.88 లక్షలు

టాటా టియాగో XE

రూ. 3.76 లక్షలు

రూ. 4.39 లక్షలు

టాటా టియాగో XE (O)

రూ. 3.94 లక్షలు

రూ. 4.57 లక్షలు

టాటా టియాగో XM

రూ. 4.07 లక్షలు

రూ. 4.80 లక్షలు

టాటా టియాగో XM (O)

రూ. 4.24 లక్షలు

రూ. 4.97 లక్షలు

టాటా టియాగో XT

రూ. 4.37 లక్షలు

రూ. 5.11 లక్షలు

టాటా టియాగో XTA

రూ. 4.74 లక్షలు

NA

టాటా టియాగో XT (O)

రూ. 4.54 లక్షలు

రూ. 5.28 లక్షలు

టాటా టియాగో XZ

రూ. 4.92 లక్షలు

రూ. 5.65 లక్షలు

టాటా టియాగో XZA

రూ. 5.26 లక్షలు

NA

Tata Tiago

టాటా టియాగో X

ధరలు: పెట్రోల్ - రూ. 3.21 లక్షలు | డీజిల్ - రూ .3.88 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ప్రారంభ ధరను దృష్టిలో ఉంచుకొని టాటా టియాగో XB లో AC ( బ్లోవర్ మాత్రమే అందుబాటులో ఉంది) ని తీసి వేయడం జరిగింది. అయితే, రెనాల్ట్ క్విడ్ వలె కాకుండా, ఇది పవర్ స్టీరింగ్ మరియు బాడీ-రంగు బంపర్లను పొందుతుంది. బేస్ వేరియంట్ రిమోట్ ఫ్యుయల్, టెయిల్‌గేట్ ఓపెనింగ్, 7 స్పీడ్ ముందు వైపర్స్, టింటెడ్ గ్లాస్, అంతర్గతంగా సర్దుబాటు వెలుపలి వెనుక వ్యూ మిర్రర్స్(ORVM) పైన పేర్కొన్న ప్రధాన ప్రామాణిక లక్షణాలే కాకుండా ఇవి కూడా అందించడం జరిగింది. ఇలాంటి చిన్న లక్షణాలతో XB ఖచ్చితంగా మీరు బడ్జెట్ లో ఉంటే గనుక మీరు దీనిని తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇది సరైన వేరియంట్ కాదు అని మేము భావిస్తున్నాము.

టాటా టియాగో XE / XE (O)

ధరలు:

పెట్రోల్ - రూ .3.76 లక్షలు | డీజిల్ - రూ 4.39 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

XB పైగా ధర వ్యత్యాసం: రూ.55,000

టియాగో XE బేస్ కన్నా కొంచెం మెరుగ్గా ఉంటుంది మరియు ఒక A.C రూపంలో ఒక అతి పెద్ద అధనపు లక్షణాన్ని కలిగి ఉంది. ఇది ముందు శక్తి అవుట్లెట్ మరియు హబ్ క్యాప్స్ అలాగే పొందుతుంది. అంతేకాకుండా, ఇది డ్రైవర్ సీట్ల ఎత్తు సర్దుబాటు, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్లు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ప్రీమియమ్ పూర్తి ఫాబ్రిక్ సీటు అప్హోల్స్టరీ మరియు ప్రీ టెన్షనర్లు & లోడ్ లిమిటర్స్ తో సీటు బెల్ట్ వంటి కీలకమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది అన్నిఅదనపు లక్షణాలను కలిగి ఉన్న ఆప్ష్నల్ ప్యాక్ కోసం మీరు ఎంచుకున్న ఒక మంచి కొనుగోలు.

టాటా టియాగో XM / XM (O)

Prices:

ధరలు: పెట్రోల్ - రూ .4.07 లక్షలు | డీజిల్ - రూ 4.80 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

XE పై ధర వ్యత్యాసం: రూ .31,000

మిడ్-వేరియంట్ గా ఉండటంతో, టియాగో XM సౌలభ్యం మరియు ఖర్చు మధ్య ఒక మంచి బ్యాలెన్స్ ని అందిస్తుంది మరియు స్టాక్ XE ట్రిమ్ పైన రూ. 31,000 అధనపు ఖర్చు ని కలిగి ఉంటుంది. అన్ని పవర్ విండోస్, థియేటర్ డిమ్మింగ్ తో ఇంటీరియర్ ల్యాంప్స్, కోట్ హుక్ తో కొలాప్సిబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ మరియు వెనుక పార్సెల్ షెల్ఫ్ వంటి  ముఖ్యమైన అదనపు లక్షణాలు క్యాబిన్ లో ఉన్నాయి. ఫ్లిప్ కీ రిమోట్ తో ఉన్న సెంట్రల్ లాక్ కూడా XM ట్రిమ్ నుండే ప్రారంభమవుతుంది.  భద్రత విషయంలో, స్పీడ్ డిపెండెంట్ ఆటో డోర్ లాక్స్ మరియు ఫాలో-మీ హెడ్‌ల్యాంప్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

దీనితో పాటు, XE వేరియంట్ లో జాబితా చేసిన అదే ఆప్ష్నల్ వాటిని మీరు 17,000 రూపాయల ఖర్చుతో దీనిలో కూడా ఎంచుకోవచ్చు.

 Tata Tiago AMT Transmission

టాటా టియాగో XT / XTA

ధరలు: పెట్రోల్ – రూ. 4.37 లక్షలు | డీజిల్ - రూ. 5.11 లక్షలు AMT – రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

XM పై ధర వ్యత్యాసం: రూ. 30,000

ఈ వేరియంట్ నుండి లగ్జరీ మొదలవుతుంది. టియాగో XT హార్మాన్ ద్వారా కనెక్ట్ నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, AM / FM, USB, AUX-IN, ఐప్యాడ్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, జూక్-కార్ యాప్ మరియు వినోద కిట్ లో స్పీడ్-డిపెండెంట్ వాల్యూం వంటి లక్షణాలను కలిగి ఉంది. సౌలభ్యం మరియు సౌకర్యం క్రింద ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM మరియు కో-డ్రైవర్ వైపు వానిటీ మిర్రర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. బాహ్య భాగాలు లో అధనంగా  పూర్తి చక్రాల కవర్లు, శరీర-రంగు వెలుపలి డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs. ప్రీమియం ఫుల్ ఫాబ్రిక్ సీటు అప్హోల్స్టరీ మరియు డ్రైవర్ సీట్బెల్ట్ రిమైండర్ (XT లో ప్రామాణికం) తప్ప,  అన్ని ఇతర లక్షణాలు XT ట్రిమ్ లో కూడా ఆప్షనల్ గానే ఉంటాయి. భద్రత విషయంలో, ఇది వెనుక పార్కింగ్ సెన్సార్లతో మరియు డే & నైట్ (లోపల రేర్‌వ్యూ మిర్రర్ ) IRVMతో వస్తుంది.  

టాటా టియాగో XT ఇటీవలే AMT ఆప్షన్ తో ప్రారంభించబడింది మరియు స్పోర్ట్స్ మోడ్ మరియు క్రీప్ ఫంక్షన్ (XZA లో కూడా అందుబాటులో ఉంది) మాన్యువల్ ట్రిమ్ లో సాధారణమైన వాటితో పాటూ  వీటిని కలిగి ఉంది.  

టాటా టియాగో XZ / XZA

ధరలు: పెట్రోల్ - రూ .4.92 లక్షలు | డీజిల్ - రూ 5.65 లక్షలు | AMT - రూ .5.26 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

XT పై ధర వ్యత్యాసం: రూ. 55,000 | AMT వ్యత్యాసం: రూపాయలు 47,000

Tata Tiago XZ Variant Interiors

టియాగో యొక్క పూర్తిగా లోడ్ చేసిన వెర్షన్ కూడా దాని అత్యధిక అమ్మకాల ట్రిమ్ గా ఉంది, ఇది ధరకు తగ్గ విలువని కూడా (ఖరీదు 55,000 కంటే ఎక్కువ) కలిగి ఉంటుంది. ఎవరైతే వారి యొక్క బడ్జెట్ ని అంత తక్కువ కాకుండా కొంచెం పెంచుదాం అనుకుంటారో వారు ఖచ్చితంగా దీనిని ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇవి అందించే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ ధరలో ఉండే ఏ కారు కూడా ఇన్ని లక్షణాలను అందించదు అని చెప్పవచ్చు. దీనిలో AMT ట్రాన్స్మిషన్ (పెట్రోల్ మాత్రమే) కూడా ఉంది, ఈ పైన చెప్పిన అంశాన్ని మరింత బలపరచడానికి ఈ లక్షణం ఉంది అని చెప్పవచ్చు.

టియాగో XZ స్టీరింగ్-మౌంట్ చేయబడిన నియంత్రణలు, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్లు, డ్రైవర్ సైడ్ విండోలో ఆటో-డౌన్, కూలెడ్ గ్లోవ్‌బాక్స్ మరియు బూట్ లాంప్ సౌలభ్యం కోసం జోడించబడ్డాయి. చూడగానే గుర్తించదగే లక్షణాలు అయిన అలాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ పైన క్రోమ్ గార్నిష్ మరియు LED టర్న్ ఇండికేటర్స్ తో ORVM వంటి వాటిని కలిగి ఉన్నాయి. లోపల భాగంలో మీరు బాడీ కలర్ ఎయిర్ వెంట్స్(సన్ బరస్ట్ ఆరెంజ్ మరియు బెర్రీ రెడ్ బాహ్య షేడ్స్ తో మాత్రమే), ఎయిర్ వెంట్స్ పైన క్రోమ్ ఫినిష్ మరియు LED ఇంధన & ఉష్ణోగ్రత గేజ్ వంటి వాటిని పొందుతారు.

ఇది భద్రతా విభాగంలో కూడా దీనిలో చాలా లక్షణాలు ఉన్నాయి, ఉదాహరణకు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, EBD తో ABS, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ప్రీ టెన్ష్నర్స్ మరియు లోడ్ లిమిటర్స్ తో సీట్‌బెల్ట్, వెనుక డీఫాగర్ మరియు వాష్ తో వెనుక స్మార్ట్ వైపర్ వంటి లక్షణాలు పొందుతుంది.

Tata Tiago

XB మరియు XE వేరియంట్స్ బేర్ బోన్స్ లా ఉంటాయి. దీనిలో పెద్ద తేడా ఏమిటంటే XE ట్రిమ్ లో ఒక A.C లభించడం. ఈ రెండు ట్రిం లు కూడా ఎవరైతే టైట్ బడ్జెట్ లో ఉండి స్టైలిష్ మరియు విశాలమైన హాచ్బాక్ కావాలి అనుకుంటారో వారికి ఇది బాగుంటుందని చెప్పవచ్చు. XM వేరియంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ మరియు స్పీడ్-ఆధారిత ఆటో డోర్ లాక్లు వంటి అత్యవసర లక్షణాలను పొందుతుంది మరియు మధ్య తరగతి వ్యక్తికి ఒక చక్కటి లక్షణాలతో లోడ్ చేయబడిన కారు కావాలనుకుంటారో వారికి ఇది బాగా సరిపోతుంది.

XT ట్రిం వైపు కి వెళితే దీనిలో అధనంగా హర్మాన్ పవర్ ఇంఫోటైన్మెంట్ సిష్టం, చాలా కనెక్టివిటీ ఆప్షన్లు ఉదాహరణకు జూక్ కార్ యాప్ వంటివి కలిగి ఉంది, దీని వలన ఎవరైతే కారులో ప్రయాణించేటపుడు మ్యూజిక్ తో వెళ్దాం అనుకుంటారో వారికి ఇది బాగా నచ్చుతుంది. అదనంగా, ఇది ఒక AMT ట్రాన్స్మిషన్ ని కూడా కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, మేము ఎంపిక చేసిన వేరియంట్ ఏదైనా ఉంది అంటే అది టాటా టియాగో XZ / XZA వేరియంట్,ఇది సౌకర్యం మరియు భద్రత మధ్య బాలెన్స్ చేసుకుంటూ టాప్ లో నిలుస్తుంది. ఇది స్టీరింగ్-మౌంట్ నియంత్రణలు, ఆటో-డౌన్ డ్రైవర్ సైడ్ విండో, కూలెడ్ గ్లేవ్ బాక్స్ మరియు అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతేకాకుండా, ఇది డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, EBD తో ABS వంటి లక్షణాలు ఈ రోజుల్లో అన్ని కార్లలో తప్పనిసరిగా ఉండాల్సినవి.

ఇది ఎలా డ్రైవ్ చేస్తుందో తెలుసుకోవాలంటే? మా వివరణాత్మక టాటా టియాగో రివ్యూకు వెళ్ళి చూడండి.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Tia గో 2015-2019

1 వ్యాఖ్య
1
J
joe diaz
Jul 21, 2019, 7:33:50 PM

great article

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience