• English
  • Login / Register

కొత్త కలర్ ఎంపికలలో లభించనున్న Tata Tiago, Tiago NRG, Tigor

టాటా టియాగో కోసం shreyash ద్వారా జనవరి 29, 2024 07:17 pm సవరించబడింది

  • 216 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టియాగో మరియు టియాగో NRG నవీకరించిన బ్లూ మరియు గ్రీన్ కలర్ ను పొందగా, టిగోర్ కొత్త బ్రాంజ్ షేడ్ ను పొందుతుంది.Tata Tiago, Tiago NRG and Tigor New Colours

టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్లు త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతాయి మరియు టాటా ఇప్పటికే రూ.21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్స్ ప్రారంభించారు. CNG ఆటోమేటిక్ కంటే ముందే కంపెనీ టియాగో, టిగోర్ లలో కొత్త ఎక్స్టీరియర్ కలర్ ఎంపికలను చేర్చారు. ఇది కంపెనీ యొక్క పెట్రోల్ వేరియంట్లతో కూడా అందించబడుతుంది.

కొత్త రంగులను ఇక్కడ చూడండి:

టాటా టియాగో

టోర్నాడో బ్లూ (XT, XT CNG, XZO+, XZ+, మరియు XZ+ CNG వేరియంట్‌లతో అందుబాటులో ఉంది)

Tata Tiago Tornado Blue

టాటా టియాగోలో అరిజోనా బ్లూ కలర్ స్థానంలో కొత్త టోర్నడో బ్లూ ఎక్స్టీరియర్ షేడ్ ను ప్రవేశపెట్టారు. మునుపటి నీలం రంగుతో పోలిస్తే కొత్త షేడ్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. టాటా ఈ హ్యాచ్ బ్యాక్ కారు టాప్ మోడల్ XZ+ లో డ్యూయల్ టోన్ షేడ్ లో ఈ రంగును అందిస్తున్నారు.

టాటా టియాగో NRG

గ్రాస్‌ల్యాండ్ బీజ్ (XT NRG, XT NRG CNG, XZ NRG, మరియు XZ NRG CNG వేరియంట్‌లతో అందుబాటులో ఉంది)

Tata Tiago NRG Grassland Beige

గతంలో అందుబాటులో ఉన్న ఫారెస్ట్ గ్రీన్ కలర్ స్థానంలో, టియాగో NRG ఇప్పుడు కొత్త గ్రాస్ ల్యాండ్ బ్యాడ్జ్ ఎక్ట్సీరియర్ లైట్ షేడ్ లో అందించబడుతుంది, ఇది మోనోటోన్ మరియు డ్యూయల్-టోన్ ఎంపికలలో లభిస్తుంది.

టాటా టిగోర్

మెటియోర్ బ్రాంజ్ (XZ, XZ CNG, XZ+ మరియు XZ+ CNG వేరియంట్‌లతో అందుబాటులో ఉంది)

Tata Tigor Meteor Bronze

టాటా టిగోర్ కొత్త మెటియోర్ బ్రాంజ్ ఎక్స్టీరియర్ కలర్ ఎంపికతో లభిస్తుంది. ఈ ఎక్స్టీరియర్ లైట్ బ్రౌన్ షేడ్ లో ఉంటుంది, ఇది టిగోర్ కు ప్రత్యేక లుక్ ఇస్తుంది. అయితే ఇది సింగిల్ టోన్ స్కీమ్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫీచర్లు & భద్రత

టియాగో మరియు టిగోర్ రెండింటిలోనూ 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ AC మరియు 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ABSతో EB, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియంట్తో సిట్రోయెన్ eC3 మరిన్ని ఫీచర్లను పొందుతుంది

పవర్‌ట్రెయిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికలు

ఈ రెండు కార్లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (86 PS / 113 Nm) తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జతచేయబడ్డాయి. ఇదే ఇంజిన్ 73.5 PS మరియు 95 Nm తక్కువ అవుట్పుట్తో CNG వేరియంట్లలో కూడా అందించబడుతోంది, ఇప్పటివరకు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే అందుబాటులో ఉంది. టియాగో మరియు టిగోర్ యొక్క CNG వేరియంట్లు త్వరలో 5-స్పీడ్ AMT ట్రాన్స్మిషన్తో అందించబడతాయి, దీనితో అవి భారతదేశంలో మొదటి CNG ఆటోమేటిక్ కార్లు అవుతాయి.

టియాగో మరియు టిగోర్ యొక్క CNG వేరియంట్లు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో వస్తాయి, ఇది మంచి బూట్ స్పేస్ను అందిస్తుంది.

ధర శ్రేణి

టియాగో ధర రూ.5.60 లక్షల నుండి రూ.8.20 లక్షల మధ్య, టిగోర్ ధర రూ.6.30 లక్షల నుండి రూ.8.95 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. టియాగో మారుతి సెలెరియో, మారుతి వ్యాగన్ R మరియు సిట్రోయెన్ C3 లతో పోటీ పడుతుండగా, టిగోర్ మారుతి డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ ఆరా లతో పోటీపడుతుంది.

మరింత చదవండి: టాటా టియాగో AMT

was this article helpful ?

Write your Comment on Tata టియాగో

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience