• English
  • Login / Register

టాటా సఫారి స్టోర్మ్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ 9.99 లక్షలు వద్ద విడుదల

టాటా సఫారి స్టార్మ్ కోసం raunak ద్వారా జూన్ 02, 2015 05:10 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2015 టాటా సఫారి స్టోర్మ్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు పాత దాని కంటే 10 PS పవర్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది అంటే, 150 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఒక కొత్త ప్రీమియం 6 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ తో పాటు కొత్త ల్యాండ్ రోవర్-ఎస్క్ గ్రిల్ తో వస్తుంది.

జైపూర్: టాటా మోటార్స్, సఫారి స్టోర్మ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను భారతదేశంలో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) 9.99 లక్షల వద్ద ప్రవేశపెట్టింది. 2015 సఫారీ స్టోర్మ్ ఎటువంటి ప్రధాన శైలీకృత మార్పులను కలిగి లేదు. దీనికి బదులుగా 2.2-లీటరు వరికార్ మోటార్ తో పాటు కొత్త లక్షణాలు మరియు సూక్ష్మ సర్దుబాటులతో భారతదేశం లో ప్రవేశపెట్టబడినది.  

ధరలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) టాటా సఫారి స్టోర్మ్ ఎల్ఎక్స్ ఫేస్లిఫ్ట్ - రు. 9,99,000 టాటా సఫారి స్టోర్మ్ ఈ ఎక్స్ ఫేస్లిఫ్ట్- రు. 11,60,499 టాటా సఫారి స్టోర్మ్ విఎక్స్ ఫేస్లిఫ్ట్ - రు. 13,02,000 టాటా సఫారి స్టోర్మ్ విఎక్స్ 4 × 4 ఫేస్లిఫ్ట్ - రు. 14,34,999

దీనిలో కొత్తగా వచ్చినవి ఏమిటంటే,

ఈ 2015 సఫారీ స్టోర్మ్ ఫేస్ల్లిఫ్ట్ వెర్షన్ కి ఒక కొత్త హనీకోంబ్డ్ గ్రిల్ తో పాటుగా ఏయిర్ డామ్స్ విస్తరించి ఉన్నాయి. ఇది చూడటానికి ఎలా కనిపిస్తుంది అంటే, టాటా సొంత వాహనం అయిన ల్యాండ్ రోవర్ బ్రాండ్ స్ఫూర్తి కనిపిస్తుంది, కాని నిజానికి, వారు ఇలా అంటున్నారు - ఈ వాహనం 'ప్రీమియం అంతర్జాతీయ శూవ్ బ్రాండ్ల స్ఫూర్తి! ఈ టాటా సఫారీ స్టోర్మ్ వాహనాలు 2.2 లీటర్ల విటిటి వరికార్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజెన్ దాదాపు పాత సఫారీ కంటే 10PS పవర్ ను అధికంగా విడుదల చేస్తుంది. అంటే, 4000 rpm వద్ద 150PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 1700 నుండి 2700 rpm వద్ద 320Nm గల అధిక టార్క్ విడుదల అవుతుంది. మరియు ఈ ఇంజెన్ ఇప్పుడు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంతాయి. ప్రస్తుతం ఈ వాహనాలు 2డబ్ల్యూడి మరియు 4డబ్ల్యూడి ఎంపికలతో అందుబాటులో ఉంది.   

ఈ 2015 టాటా సఫారీ స్టోర్మ్ లో క్లచ్ యొక్క వ్యాశార్ధం 260 మిల్లీమీటర్లు. ఈ ఇంజెన్ 0 కిలోమీటర్ల  నుండి 100 కిలోమీటర్ల  వేగాన్ని చేరడానికి 14 సెకన్ల సమయం పడుతుంది. అంతేకాకుండా పాత టాటా సఫారీ తో పోలిస్తే, 2015 టాటా సఫారీ స్టోర్మ్ అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 2015 టాటా సఫారీ స్టోర్మ్ ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం లీటర్ కు 14.1 కిలోమీటర్ల ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. కొత్త స్టోర్మ్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం కూడా పెరిగింది. ఇప్పుడు 2015 స్టోర్మ్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం  63 లీటర్లు.   

ఈ స్టోర్మ్ అంతర్భాగాల విషయానికి వస్తే, క్యాబిన్ అంతా నలుపు రంగులో, అనేక వెండి చేరికలతో పొందుపరచబడి ఉంటుంది. మరియు ఒక కొత్త మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ కొత్త టాటా సఫారీ స్టోర్మ్ లో హర్మాన్ తో తయారుచేయబడిన ఆడియో సిస్టమ్ తో పాటుగా ఒక LED డిస్ప్లే, 6 స్పీకర్ ను కలిగి ఉంటాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అయిన "విఎక్స్" వేరియంట్ లో ప్రామాణిక పార్కింగ్ సెన్సార్లు. వీటి డిస్ప్లే కనక్ట్ నెక్స్ట్ ఆడియో సిస్టమ్ లో ప్రదర్శింపబడుతుంది.

పిపిపిఎం (ప్రోగ్రామ్, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ), ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్, టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ గిరిశ్ వాఘ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ "భారతదేశం యొక్క మొదటి ఎస్యూవి-టాటా సఫారి, ఇది వినియోగదారులకు నిరంతరం విభిన్న అవసరాలకు అనువుగా క్యాటరింగ్ అందిస్తుంది, వారికి ఇది ఒక పెద్ద దానిలా ప్రేరణనిస్తూ, వారి కుటుంబానికి అడ్వెంచర్ లను కలిగిస్తుంది. ఈ న్యూ టాటా సఫారిని టాటా హోరిజోనెక్స్ట్ ఆధారంగా డిజైన్ చేశారు, ఇది మరింత ఆకర్షణీయంగా, డ్రైవింగ్ కి అనుసంధానంగా మరియు అధిక సామర్థ్యంతో కూడిన శక్తిని జోడించి ఇస్తుంది. ఈ కొత్త సఫారి స్టోర్మ్ ఇంటిగ్రేటెడ్ అనుసంధానత లక్షణాల యొక్క అతిధేయగా మరియు మరింత సంపూర్ణ వాహన అనుభవాన్నిస్తుంది. వెలుపల మరియు అంతర్గతంగా కొత్త డిజైన్ అంశాలతో తయారు చేయబడి, చైతన్యం కలిగి, సాహసం మరియు అగ్రెషన్ తో, ఉన్నతమైన రోడ్డు సమక్షంలో మీకు పూర్తిస్థాయి వాహన అనుభవాన్ని కలిగిస్తుందని అతను పేర్కొన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Safar i Storme

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience