ముసుగు లేకుండా కనిపించిన టాటా పంచ్ CNG, త్వరలోనే విడుదల అవుతుందని అంచనా
టెస్ట్ వాహనం తెలుపు రంగులో కనిపించింది మరియు టెయిల్ గేట్‌పై ‘iCNG’ బ్యాడ్ؚతో కవర్ చేయబడింది.
-
పంచ్ CNGని టాటా మొదట ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది.
-
టెస్ట్ మోడల్‌లో స్పేర్ వీల్‌ను దిగువ భాగంలో అమర్చినట్లు రహస్య చిత్రాలలో చూడవచ్చు.
-
ఆల్ట్రోజ్ CNGలో ఉన్న అదే 73.5PS పవర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పంచ్ CNG పొందనుంది.
-
7-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు.
-
ఆల్ట్రోజ్ CNGలో ఉన్నట్లుగా టాటా దీన్ని స్ప్లిట్-ట్యాంక్ సిలిండర్ సెట్అప్‌తో అందిస్తుంది.
-
త్వరలోనే విడుదల అవుతుందని అంచనా, ఆల్ట్రోజ్ CNGలో చూసినట్లు, ఈ మాడెల్ CNG ధర కూడా సుమారు ఒక లక్ష రూపాయిలు అధికంగా ఉండవచ్చు.
ఆల్ట్రోజ్ CNGలో స్ప్లిట్-ట్యాంక్ సాంకేతికతను పరిచయం చేసిన తరువాత, ఇదే ఫార్ములాతో టాటా పంచ్ CNGని కూడా త్వరలో అందించనున్నారు. ఈ మైక్రో SUV ఖచ్చితంగా విడుదల అవుతుంది అని కప్పబడకుండా చేసిన ఇటీవల టెస్ట్‌లు రుజువు చేస్తున్నాయి. టాటా పంచ్ CNGని మొదట ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది.
తాజాగా వెల్లడయినవి
తాజా రహస్య చిత్రాలలో, పంచ్ؚను ఎటువంటి కవర్‌లు లేకుండా తెలుపు రంగులో చూడవచ్చు. ఇందులో ప్రధానంగా, టెయిల్ؚగేట్‌పై కనిపించిన ‘iCNG’ బ్యాడ్జ్ ఇది CNG వర్షన్ؚ అని నిర్ధారిస్తుంది. టెస్ట్ వాహనంలో స్పేర్ؚవీల్ దాని క్రింద వైపు ఉన్నట్లు కనిపిస్తుంది, దీనితో నిజంగానే టెస్ట్ చేస్తున్న వాహనం CNG వేరియెంట్ అని నిర్ధారణ అయ్యింది.
ఇది కూడా చదవండి: టాటా EV కొనుగోలుదారులలో దాదాపుగా నాలుగవ వంతు కొత్త కారు కొనుగోలు చేస్తున్నారు.
పవర్ؚట్రెయిన్ వివరాలు
టాటా ఆల్ట్రోజ్ CNGలో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పంచ్ CNGలో అందిస్తుంది, ఇది 73.5PS పవర్ మరియు 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది. కొత్త టాటా CNG మోడల్‌లలో ఉన్నట్లుగా పంచ్ CNGలో కూడా నేరుగా CNG మోడ్ؚలో స్టార్ట్ చేయగలిగే ఎంపికతో వస్తుంది.
ఫీచర్ హైలైట్‌లు
పంచ్ CNG 7-అంగుళాల టచ్ؚస్క్రీన్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ (ఈ మోడల్ కోసం కొత్త పరిచయం చేయబడింది), పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో AC, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. దీని భద్రత కిట్ؚలో బహుళ ఎయిర్ బ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉంటాయని అంచనా.
ఉపయోగించగలిగే బూట్ స్పేస్
పంచ్ CNG అతి పెద్ద USP ఉపయోగించగలిగిన బూట్ స్పేస్ కావచ్చు. ఇందులో డ్యూయల్ CNG సిలిండర్‌లను బూట్ ఫ్లోర్ క్రింద అమర్చారు. ఖచ్చితమైన బూట్ స్పేస్ గణాంకాలను టాటా ఇప్పటికీ వెల్లడించలేదు కానీ ఒక చిన్న లగేజ్ బ్యాగ్ మరియు డఫల్ మరియు సాఫ్ట్ బ్యాగ్ؚల జతను ఉంచడానికి సరిపోతుంది అని భావిస్తున్నాము.
ఇది కూడా చదవండి: టాటా ఆల్ట్రోజ్ CNG సమీక్ష 5 ముఖ్యాంశాలు
ధర మరియు పోటీ
ఆల్ట్రోజ్ CNG విధంగానే, పంచ్ CNG ధరను ఈ కారు తయారీదారు దీని తోటి పెట్రోల్ వాహనం కంటే సుమారు ఒక లక్ష ఎక్కువగా నిర్ణయిస్తారని అంచనా. రాబోయే హ్యుందాయ్ ఎక్స్టర్ CNG వేరియెంట్ؚలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి : పంచ్ AMT