టాటా ఆల్ట్రోజ్ CNG సమీక్ష-5 కీలక అంశాలు
టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం tarun ద్వారా జూన్ 06, 2023 02:56 pm సవరించబడింది
- 43 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
CNG కారణంగా ఆల్ట్రోజ్‌లో ఉండే ముఖ్యమైన విషయాలలో రాజీ పడిందా? తెలుసుకుందాం
ఇటీవల మేము టాటా ఆల్ట్రోజ్ CNG వర్షన్ హ్యాచ్‌బ్యాక్‌ను డ్రైవ్ చేశాము, ఇది ఈ కారు తయారీదారు నుండి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక కలిగిన మూడవ మోడల్. ఈ సమీక్ష నుండి మేము తెలుసుకున్న ఐదు విషయాలు ఇవి:
పుష్కలమైన ఫీచర్‌లు
ఆల్ట్రోజ్ CNG, బేస్ వేరియెంట్ మరియు పూర్తి ఫీచర్‌లు కలిగి ఉన్న వేరియెంట్ؚల మధ్య ఎంపిక చేసుకోవచ్చు. టాప్-స్పెక్ XZ+ వేరియెంట్‌లో ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక లభిస్తుంది కాబట్టి, ప్రత్యేక ఫీచర్‌లు అన్నిటినీ మీరు పొందగలరు. దీనితో, ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ విభాగంలో అత్యధిక ఫీచర్‌లు కలిగిన CNG కారుగా నిలుస్తుంది.
ఈ హ్యాచ్‌బ్యాక్ CNG మోడల్‌లో అలాయ్ వీల్స్, మూడ్ లైటింగ్, లెదర్ సీట్‌లు, 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ AC, వైర్ؚలెస్ ఛార్జర్ؚ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. దృఢమైన 5-స్టార్-రేటింగ్ కలిగిన బాడీ షెల్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు వంటివి భద్రతను కవర్ చేస్తాయి.
అయితే, క్రూయిజ్ కంట్రోల్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి కొన్ని అవసరం లేని ఫీచర్‌లను CNG వేరియెంట్ నుండి తొలగించారు.
ఏ ఇతర CNG కారులో లేని బూట్ స్పేస్
ఆల్ట్రోజ్ CNGలోని ముఖ్యమైన అంశం ఉపయోగించగలిగిన బూట్ స్పేస్. ఒక భారీ 60-లీటర్‌ల ట్యాంక్‌కు బదులుగా, టాటా 30-లీటర్‌ల రెండు ట్యాంకుల డిజైన్‌ను వినియోగించింది, దీని వలన మరింత బూట్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాంకులను తెలివిగా బూట్ ఫ్లోర్ క్రింద అమర్చారు, తద్వారా కారు యజమానులు బూట్ స్పేస్ؚను వీకెండ్ ట్రిప్ؚల కోసం సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.
210 లీటర్‌లుగా క్లెయిమ్ చేస్తున్న బూట్ స్పేస్ గల CNG వెర్షన్, పెట్రోల్ వర్షన్‌తో పోలిస్తే 135 లీటర్‌ల బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఒక మీడియం-సైజ్ సూట్ؚకేస్ మరియు ఓవర్ؚనైట్ డఫీల్ బ్యాగ్ ఇందులో సులభంగా ఉంచవచ్చు, కానీ పార్సిల్ ట్రే ఉంటే వీటిని అడ్డంగా ఉంచాలి. CNG యజమానులు, సర్దుబాటు చేసుకోవాలి!
నగరాలలో నడపడానికి అనుకూలమైనది
ఆల్ట్రోజ్ పెట్రోల్ మెరుగైన పనితీరును అందించడం లేదు. టాప్ గేర్‌లలో కూడా యాక్సెలరేషన్ మందకొడిగా ఉంది. అయితే, నగరాలలో మరియు ట్రాఫిక్‌లోؚ నడపడానికి దీని పనితీరు సరిపోతుంది. CNGతో ప్రయోజనం ఏమిటంటే, డ్రైవబిలిటీలో ఎక్కువ రాజీ పడలేదు. ప్రయాణిస్తున్నప్పుడు పెట్రోల్ మరియు CNG మోడ్ؚల మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. CNGలో అదనపు గేర్ డౌన్ؚషిఫ్ట్ అవసరమయ్యే కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉండవచ్చు, కానీ మొత్తం మీద నగరాలలో దీన్ని నడపడం సులభం.
ఇది కూడా చదవండి: టాటా ఆల్ట్రోజ్ CNG సమీక్ష: యోగ్యమైనది!
ఆశించినదాని కంటే తక్కవ హైవే పనితీరు
నగరాలలో ఆల్ట్రోజ్ CNGలో ప్రయాణం సాఫీగా ఉన్నపటికి, దీని పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే CNG వేరియంట్ మూడు-అంకెల వేగాన్ని అందుకోవడంలో చాలా నెమ్మదిగా ఉంది. ఈ స్పీడ్‌లో నాలుగు మరియు ఐదువ ఇన్-గేర్ యాక్సెలరేషన్ చాలా నెమ్మదిగా ఉంది, అందువలన, తరచుగా గేర్ డౌన్ؚషిఫ్ట్ؚలు తప్పవు. వాలుగా ఉన్న రోడ్లపై నడపడానికి మంచి డ్రైవింగ్ నైపుణ్యం అవసరం, సరైన మూమెంటమ్ లేకపోతే, వెంటనే కార్ؚ గేర్‌ను డౌన్ؚషిఫ్ట్ చేయవలసి ఉంటుంది. సులభంగా ఉండటానికి పెట్రోల్ؚకు మారిపోతే మంచిదని చాలాసార్లు అనిపిస్తుంది. ఇవే ఇబ్బందులను మీరు ఆల్ట్రోజ్ పెట్రోల్ؚతో కూడా ఎదుర్కొంటారు.
హ్యాండ్లింగ్ మరియు రైడ్ؚలలో రాజీ లేదు
CNG కిట్ జోడింపు మరియు అదనపు అమరికలతొ ఆల్ట్రోజ్ హ్యాండ్లింగ్ మరియు రైడ్ నాణ్యతలో రాజీపడలేదు. అదనపు బరువు కోసం కారు తయారీదారు రేర్ సస్పెన్షన్ؚలో తేలకపాటి మార్పులు చేశారు. మూడు అంకెల వేగం వద్ద రైడ్ؚ అంతా సౌకర్యవంతగా లేకపోయినా, వివిధ ఉపరితలాలపై సౌకర్యంగానే ఉంది. హాండ్లింగ్ కూడా పదునుగా, చురుకుగా ఉంటుంది, ఇది ఈ హ్యాచ్ؚబ్యాక్ؚకు ప్లస్ పాయింట్.
ఇక్కడ మరింత చదవండి: ఆల్ట్రోజ్ ఆన్ؚరోడ్ ధర