Tata Punch 2-సంవత్సరాల పునశ్చరణ: ఇప్పటివరకు జరిగిన ప్రయాణాన్ని పరిశీలిద్దాం

టాటా పంచ్ కోసం ansh ద్వారా అక్టోబర్ 19, 2023 02:58 pm ప్రచురించబడింది

  • 374 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

విడుదల అయినప్పటి నుండి టాటా పంచ్ ధరలు రూ.50,000 వరకు పెరిగాయి

Tata Punch: 2 Year Recap

18 అక్టోబర్ 2021 తేదీన, టాటా పంచ్ భారతదేశంలో మొదటి మైక్రో-SUVగా విడుదలైంది, హ్యాచ్ؚబ్యాక్ పరిమాణంలో SUV రూపంలో మరింత ఆకర్షణకు ప్రాప్యత ఉండేలా చేసింది. గ్లోబల్ NCAP పాత క్రాష్ టెస్ట్ؚలలో 5-స్టార్ؚల భద్రత రేటింగ్ؚతో బలమైన అబిప్రాయాన్ని కూడా ఏర్పర్చుకుంది, ఇంత చిన్న కారు దీన్ని సాధించడం ఇదే మొదటిసారి. రెండవ పుట్టినరోజును సంధర్భంగా టాటా పంచ్ విషయంలో గత సంవత్సర కాలంలో జరిగిన అన్నీ విషయాలను గుర్తు చేసుకుందాం.

ధర పెరుగుదల

Tata Punch

విడుదల సమయంలో, పంచ్ ధర రూ.5.49 లక్షలు నుండి రూ.9.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొన్ని సంవత్సరాలుగా, ఈ మైక్రో-SUV ధర 4 సార్లు పెరిగింది, గరిష్టంగా రూ.50,000 వరకు పెరిగింది. 

1.2-లీటర్ పెట్రోల్ మాన్యువల్   

వేరియెంట్లు

విడుదల ధర 

ప్రస్తుత ధర 

ప్యూర్

రూ. 5.49 లక్షలు

రూ. 6 లక్షలు

ప్యూర్ + రిథమ్ ప్యాక్

రూ. 5.85 లక్షలు

రూ. 6.35 లక్షలు

అడ్వెంచర్

రూ. 6.39 లక్షలు

రూ. 6.90 లక్షలు

అడ్వెంచర్ క్యామో

 

రూ. 7 లక్షలు

అడ్వెంచర్ + రిథమ్ ప్యాక్

రూ. 6.74 లక్షలు

రూ. 7.25 లక్షలు

అడ్వెంచర్ క్యామో + రిథమ్ ప్యాక్

 

రూ. 7.35 లక్షలు

అకాంప్లిష్డ్

రూ. 7.29 లక్షలు

రూ. 7.75 లక్షలు

అకాంప్లిష్డ్ క్యామో

 

రూ. 7.80 లక్షలు

అకాంప్లిష్డ్ + డాజిల్ ప్యాక్

రూ. 7.74 లక్షలు

రూ. 8.15 లక్షలు

అకాంప్లిష్డ్ క్యామో + డాజిల్ ప్యాక్

 

రూ. 8.18 లక్షలు

అకాంప్లిష్డ్ సన్ؚరూఫ్

 

రూ. 8.25 లక్షలు

అకాంప్లిష్డ్ సన్ؚరూఫ్ + డాజిల్ ప్యాక్

 

రూ. 8.65 లక్షలు

క్రియేటివ్ DT

రూ. 8.49 లక్షలు

రూ. 8.75 లక్షలు

క్రియేటివ్ DT సన్ؚరూఫ్

 

రూ. 9.20 లక్షలు

క్రియేటివ్ DT + I-RA ప్యాక్

రూ. 8.79 లక్షలు

 

క్రియేటివ్ DT ఫ్లాగ్ؚషిప్

 

రూ. 9.50 లక్షలు

1.2-లీటర్ పెట్రోల్ AMT

అడ్వెంచర్

రూ. 6.99 లక్షలు

రూ. 7.50 లక్షలు

అడ్వెంచర్ క్యామో

 

రూ. 7.60 లక్షలు

అడ్వెంచర్ + రిథమ్ ప్యాక్

రూ. 7.34 లక్షలు

రూ. 7.85 లక్షలు

అడ్వెంచర్ క్యామో + రిథమ్ ప్యాక్

 

రూ. 7.95 లక్షలు

అకాంప్లిష్డ్ 

రూ. 7.89 లక్షలు

రూ. 8.35 లక్షలు

అకాంప్లిష్డ్ క్యామో

 

రూ. 8.40 లక్షలు

అకాంప్లిష్డ్ + డాజిల్ ప్యాక్

రూ. 8.34 లక్షలు

రూ. 8.75 లక్షలు

అకాంప్లిష్డ్ క్యామో + డాజిల్ ప్యాక్

 

రూ. 8.78 లక్షలు

అకాంప్లిష్డ్ సన్ؚరూఫ్

 

రూ. 8.85 లక్షలు

అకాంప్లిష్డ్ సన్ؚరూఫ్ + డాజిల్ ప్యాక్

 

రూ. 9.25 లక్షలు

క్రియేటివ్ DT

రూ. 9.09 లక్షలు

రూ. 9.35 లక్షలు

క్రియేటివ్ DT సన్ؚరూఫ్

 

రూ. 9.80 లక్షలు

క్రియేటివ్ DT + I-RA ప్యాక్

రూ. 9.39 లక్షలు

 

క్రియేటివ్ ఫ్లాగ్ؚషిప్ DT

 

రూ. 10.10 లక్షలు

ఈ కాల వ్యవధిలో టాటా పంచ్ కొత్త వేరియెంట్ؚలను కొన్నిటిని జోడించింది, ఇది ధరల మార్పులు దారితీసింది. 

పవర్ؚట్రెయిన్ అప్ؚగ్రేడ్ؚలు – ఇప్పుడు CNGతో!

Tata Punch Engine

విడుదల సమయంలో, టాటా పంచ్ 86PS పవర్ మరియు 115NM టార్క్‌ను విడుదల చేసే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 5-స్పీడ్ AMTతో జోడించబడింది.

ఇది కూడా చదవండి: చూడండి: టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ؚలకు చేసిన అన్నీ మార్పులు పక్కపక్కనే చూడండి

ఇది మునపటి ఇంజన్‌ను పొందింది అయితే BS6.2 ఉద్గార నిబంధనల అమలు ద్వారా 88PS మరియు 115Nmగా రేట్ చేయబడి, పనితీరు మెరుగైంది. అంతేకాకుండా, క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం కూడా కొంత పెరిగింది.

Tata Punch CNG

ఫిబ్రవరి 2023లో ఆటో ఎక్స్ؚపో ప్రీ-ప్రొడక్షన్ ప్రదర్శన తరువాత, టాటా పంచ్ ప్రస్తుతం CNG వర్షన్ؚలో కూడా లభిస్తున్నది. ఇది ఆగస్ట్ؚలో విడుదలైంది మరియు ధరలు రూ.7.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉన్నాయి, దీనిలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ఉంది, ఫలితంగా మార్కెట్లో ఉన్న అనేక CNG వేరియెంట్ؚల విధంగా కాకుండా ఇందులో ఉపయోగించగలిగిన బూట్ స్పేస్ ఎక్కువగా ఉంది. 

ఇది కూడా చదవండి: భారతదేశంలో తయారుచేయబడి విక్రయిస్తున్న కార్‌లలో అత్యంత సురక్షితమైన కార్‌లుగా నిలిచిన టాటా హారియర్, టాటా సఫారీ

ఈ CNG పవర్ؚట్రెయిన్ మునపటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, 73.5PS పవర్ మరియు 103Nm తక్కువ అవుట్ؚపుట్ؚను కలిగి ఉంది, ఇది 5-స్పీడ్ؚల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే జోడించబడింది. 26.99km/kg ఇంధన సామర్ధ్యాన్ని టాటా క్లెయిమ్ చేస్తుంది. పంచ్ CNG 3 విస్తృత వేరియెంట్లలో అందించబడుతుంది – ప్యూర్, అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ ధరలు రూ.7.10 లక్షల నుండి రూ.9.68 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

ఫీచర్‌లలో మార్పు

Tata Punch Sunroof

విడుదల అయిన మొదటి సంవత్సరంలో పంచ్ కొన్ని కొత్త ఫీచర్ అప్ؚగ్రేడ్ؚలను పొందింది, గత 12 నెలలలో మరి కొన్నిటిని పొందింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడింపు వాయిస్ ఎనేబుల్డ్ సన్ؚరూఫ్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు ముందు ఆర్మ్ రెస్ట్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Tata Punch Cabin

7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, రేర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ؚలను టాటా పంచ్‌లో అందిస్తుంది. 

కొత్త శత్రువు ఎదురైంది

Tata Punch vs Hyundai Exter

విడుదల అయినప్పటి నుండి ఈ సంవత్సరం జూలై వరకు, టాటా పంచ్ؚకు ప్రత్యక్ష పోటీదారు లేదు, అయితే తరువాత హ్యుందాయ్ మైక్రో-SUV విభాగంలో రెండవ ఆఫరింగ్ؚగా ఎక్స్టర్‌ؚను విడుదల చేసింది. ఈ రెండు SUVలు ఒకే ధరలు, పరిమాణాలు మరియు బాక్సీ డిజైన్ లాంగ్వేజీలను కలిగి ఉన్నాయి, కానీ చాలా తేడాలు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్టర్, కొత్త ఆఫరింగ్ కాబట్టి, మరింత ఆధునిక ఆకర్షణను కలిగి ఉంది, అంతేకాకుండా మరిన్ని ప్రీమియం ఫీచర్‌లను అందిస్తుంది. అయితే, పంచ్ ఇప్పటికీ 5-స్టార్ؚల గ్లోబల్ NCAP భద్రత రేటింగ్ؚలను కలిగి ఉన్న వాహనంగా నిలిచింది.

విక్రయాల మైలురాయి!

Tata Punch 2 Lakh Milestone

మొదటి సంవత్సరం విక్రయాలలో 1 లక్ష యూనిట్‌ల మైలురాయిని చేరుకున్న తరువాత, 2వ సంవత్సరాన్ని పూర్తి అయ్యే ముందు, టాటా 2 లక్షల యూనిట్‌ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. SUV ఆకర్షణ మరియు చవకైన ధర కారణంగా పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. 

6-నెలల సగటుతో 12,000 యూనిట్‌ల విక్రయాలతో ఇప్పటికీ ప్రతి నెల భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్‌ల జాబితాలో పంచ్ తన స్థానాన్ని నిలుపుకుంటోంది. 

ఏవైనా అప్ؚడేట్ؚలు రాబోతున్నాయా?

Tata Tigor EV battery pack

టాటా ప్రస్తుతం పంచ్ EV తయారీపై పని చేస్తోంది, ఇది టిగోర్ EV మరియు నెక్సాన్ EVల మధ్య స్థానంలో నిలుస్తుంది. పంచ్ ఎలక్ట్రిక్ వర్షన్ అనేక సార్లు పరీక్షిత్తు కనిపించింది మరియు రెండు బ్యాటరీ ప్యాక్ؚలతో, 350km క్లెయిమ్ చేసిన పరిధితో రావచ్చు. టియాగో లేదా టిగోర్ؚల ఎలక్ట్రిక్ వర్షన్ؚలలో చేసిన మార్పులకు అనుగుణంగా EV-నిర్దిష్ట డిజైన్ మార్పులతో వస్తుంది. పంచ్ EV 2024లో లేదా అంతకంటే ముందుగా రావచ్చు.

కొత్త నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ؚకు సమానమైన ఆధునిక డిజైన్ లాంగ్వేజ్ؚతో, టాటా పంచ్ؚను కూడా నవీకరించవచ్చు. అయితే ఈ నవీకరించిన మైక్రో-SUV గురించిన వివరాలు అంతగా తెలియదు. అయినప్పటికీ, ఈ చిన్న SUVకి ఉన్న ప్రజాదరణను బట్టి రాబోయే కాలంలో భారీ నవీకరణలను చూడవచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: పంచ్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా పంచ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience