11 వ న్యాడా ఆటో షోలో కొత్త స్ట్రోం ని బహిర్గతం చేసిన టాటా మోటార్స్

సెప్టెంబర్ 16, 2015 05:38 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ సరికొత్త స్టార్మ్ టాటా మోటార్స్ వారి ఇతర ఉత్పత్తులతో పాటుగా 11న నాడా ఆటో షో లో నేపాల్ లోని కాత్మండు లో ప్రదర్శితం చేశారు. ఈ కొత్త స్టార్మ్ కంపెనీ వారి ప్రకారంగా ఆఫ్-రోడింగ్ కి ప్రత్యేకంగా నేపాల్ పరిస్థితులకి అనుగుణంగా ఉంటుంది అని తెలిపారు. ఈ కారు నేపాల్ రూపాయల్లో, 42.25 లక్షల ధరకి LX వేరియంట్ ని మరియూ VX వేరియంట్ ని రూ. 56.85 లక్షలకి అందిస్తున్నరు. ఇదే కాకుండా, ఈ కొత్త స్టార్మ్ తో పాటుగా, టాటా మోటర్స్ వారు జెస్ట్ ని, నేపాల్ యొక్క మొదటి మల్టీ డ్రైవ్ హ్యాచ్ అయిన బోల్ట్ మరియూ ఎగ్జెటా ని కూడా అందిస్తున్నారు.

కస్టమర్లకి సహాయం చేసేందుకు గాను, టాటా వారు, కొత్త విన్నూత్న వేదిక ను ఈ ఆటో షో లో అందించారు. ఈ షో లో మూడు భాగాలు ఉన్నాయి, అవి మ్యూజిక్ బూత్, గేమింగ్ జోన్ మరియూ కస్టమర్ ఇంటరాక్షన్ సెక్షన్ లు ఉన్నాయి. ఇది కస్టమర్లకి మరిన్ని వివరాలు అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ మ్యూజిక్ బూతు వల్ల కస్టమర్లు టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ ని ఆనిందించే వీలు కలిగింది మరియూ బోల్ట్ ఇంకా జెస్ట్ లో ఇది ప్రత్యేకంగా హర్మాన్ ద్వారా చేయబడింది. ఈ గేమింగ్ జోన్ లో కస్టమర్లు రేసింగ్ గేంస్ ని టాటా వారి రెవట్రాన్ ఇంజును సామర్ధ్యం కలిగినట్టుగా పొందవచ్చును.

టాటా మోటార్స్ యొక్క ప్రాంతీయ హెడ్ మిస్టర్ సుజన్ రాయ్ మాట్లాడుతూ "న్యాడా తయారీదారులు రాబోయే వాహనాలతో పాటూ కొత్త మోడల్స్ ని ప్రదర్శించడానికి అలానే ఇతర మోడళ్ళతో పోల్చి చూసుకునేందుకు ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫార్మ్. ఈ షో టాటా మోటార్స్ బోల్ట్, జెస్ట్ మరియు కొత్త స్ట్రోం వంటి వాహనాలను తయారుచేయడానికి అవకాశం పొందినట్టు వాహనతయారీదారులకి వారి భవిష్యత్తు సాంకేతికత ప్రదర్శించేందుకు అవకాశం అందిస్తుంది. టాటా మోటార్స్ న్యాడా ఆటో షో 15 వద్ద కొత్త స్ట్రోం ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది మరియు వారు ఈ కొత్త ఆఫరింగ్ తో వినియోగదారులకు ఉత్తమ వాహనం అనుభవాన్ని అందించారు." అని తెలిపారు.

సిప్రది ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ మిస్టర్ శంభు దహల్ మాట్లాడుతూ"టాటా మోటార్స్ వారు నిజమైన ఎస్యువి కొత్త స్ట్రోం ని నేపాల్ లోని ఎదురుచూస్తున్న న్యాడా ఆటో షో లో పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. జెస్ట్ మరియు బోల్ట్ నేపాల్ లో ప్రారంభం అయిన తరువాత ఇది నేపాల్ లో ప్రారంభమయిన మూడవ హారిజన్ నెక్స్ట్ ఉత్పత్తి. ఇది ఖచ్చితంగా జస్ట్ మరియు బోల్ట్ లా మంచి స్పందనను పొందుతుంది. దీని డైనమిక్ మరియు ఉత్తేజకరమైన లైన్ అప్ వంటివి వినియోగదారులని ఆకర్షిస్తాయి." అని తెలిపారు.

11 వ ఎన్ఎడిఎ ఆటో షో టాటా లైనప్:

కొత్త స్ట్రోం:

టాటా కొత్త స్ట్రోం హారిజన్ నెక్స్ట్ వ్యూహం ఆధారంగా డ్రైవ్ నెక్స్ట్ & కనెక్ట్ నెక్స్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. కొత్త స్ట్రోం టాటా మోటర్స్ యొక్క 2.2లీటర్ వ్యారికోర్ ఇంజిన్ తో 150ps శక్తిని మరియు 320Nm టార్క్ ని అందిస్తూ 5-స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి 14 సెకెన్లలో 0 నుండి 100Km/h చేరుకోగలదు.

ఈ కారు హర్మాన్ ™ ఆధారిత కనెక్ట్ నెక్స్ట్ సమాచార వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఈ సమాచర వ్యవస్థ బ్లూటూత్ కనెక్టివిటీ, ఐపాడ్-ఇన్, యుఎస్బి-ఇన్ మరియు సిడి, ఎఎం-ఎఫ్ఎం ప్లేయర్ మరియు ఆరు స్పీకర్లతో పాటూ ఆక్స్-ఇన్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

4x4 వేరియంట్ ఇఎస్ఒఎఫ్ (ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ఫ్లై) టెక్నాలజీ లక్షణాన్ని కూడా కలిగి ఉంది. ఇది 14.1kmpl అధిక ఇంధన సామర్థ్యంతో పాటు 4x4 లేదా 4x2 మోడ్ కోసం అనుమతిస్తుంది. కొత్త స్ట్రోం 2 సంవత్సరాలు లేదా 75000km వారంటీ తో అందుబాటులో ఉంది.

టాటా బోల్ట్ :

బోల్ట్ టాటా కొత్త హారిజన్ నెక్స్ట్ వ్యూహాన్ని కలిగి ఉంది. ఇది వానిటైన్ రెడ్, సహజమైన వైట్, ప్లాటినం సిల్వర్, స్కై గ్రే మరియు డూన్ లేత గోధుమరంగు వంటి ఐదు పెయింట్ పథకాలలో అందుబాటులో ఉంది. అలానే ఈ బోల్ట్ ఎక్స్ఇ, ఎక్స్ఎం మరియు ఎక్స్ టి అను మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

జెస్ట్:

బోల్ట్ లానే జెస్ట్ కూడా ఈకో, సిటీ మరియు స్పోర్ట్ వంటి మూడు మల్టీ డ్రైవ్ రీతుల్లో అందుబాటులో ఉంది. ఈ సబ్-4 మీటర్ల సెడాన్ పెట్రోల్ లో ఎక్స్ఇ, ఎక్స్ఎం మరియు ఎక్స్ టి అను మూడు వేరియంట్లలో మరియు డీజిల్ లో ఎక్స్ఇ, ఎక్స్ఎం, ఎక్స్ఎంఎ(ఎ ఎంటి), ఎక్స్ టి మరియు ఎక్స్ టిఎ(ఎ ఎంటి) అను ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలానే ఇది బజ్ బ్లూ,వానిటైన్ రెడ్, స్కై గ్రే, డూన్ లేత గోధుమరంగు, ప్లాటినం సిల్వర్ మరియు సహజమైన వైట్ వంటి ఆరు పెయింట్ పథకాలలో అందుబాటులో ఉంది. ఈ కారు 5 అంగుళాల కనెక్ట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఆధునిక వాయిస్ కమాండ్ గుర్తింపు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ మరియు టచ్ స్క్రీన్ పైన ఉష్ణోగ్రత నియంత్రణలు వంటి లక్షణాలను కలిగి ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience