టాటా మోటార్స్ BS6 డీజిల్ హారియర్, నెక్సాన్ & ఆల్ట్రోజ్ ను మార్చి 2020 నుండి డెలివర్ చేస్తుంది
టాటా ఆల్ట్రోస్ 2020-2023 కోసం dhruv attri ద్వారా ఫిబ్రవరి 22, 2020 02:19 pm ప్రచురించబడింది
- 64 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పెట్రోల్ తో నడిచే నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి
- BS6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో ఫేస్‌లిఫ్టెడ్ టాటా నెక్సాన్ మరియు 2020 హారియర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించబడ్డాయి.
- టాటా ఆల్ట్రోజ్ జనవరి 2020 లో BS6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో ప్రారంభించబడింది
- టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా BS6 ఫ్యుయల్ లభించే సమయానికి డీజిల్ డెలివరీలను చేస్తోంది.
- BS6 ఫ్యుయల్ ప్రస్తుతం ఢిల్లీ -NCR అంతటా మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ ఏడాది మూడు టాటా వాహనాలకు BS6-కంప్లైంట్ డీజిల్ ఇంజన్లు వచ్చాయి - జనవరి 22 న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఆల్ట్రోజ్ మరియు ఫిబ్రవరి 5 న ఆటో ఎక్స్‌పో 2020 లో హారియర్. అవి ప్రారంభించబడటానికి ముందే బుకింగ్ లు తెరిచి ఉండగా, వాటి డీజిల్ వెర్షన్ల డెలివరీలు కొంచెం ఆలస్యం అయ్యాయి. ఏదేమైనా, టాటా మోటార్స్ కార్‌దేఖో కు ఎవరైతే త్వరగా వాటిని బుక్ చేసుకుంటారో మార్చి 2020 నుండి తమ కార్లని త్వరగా డెలివరీ పొందగలరని ధృవీకరించింది. పెట్రోల్-పవర్ తో పనిచేసే BS6 టాటా నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ డెలివరీలు ఇప్పటికే జరుగుతున్నాయి, అయితే హారియర్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడడం లేదు.
BS6-కంప్లైంట్ ఫ్యుయల్ ఇప్పటివరకు ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే 2020 ఏప్రిల్ 1 న BS6 గడువుకు ముందే మార్చి 2020 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుంది. టాటా మోటార్స్ యొక్క ఈ చర్య అనేది మంచి పరిణామం అని చెప్పవచ్చు, ఎందుకంటే కొనుగోలుదారులు BS6 ఫ్యుయల్ సర్వత్రా ఉండే సమయానికి వాహనన్ని డెలివరీ పొందగలుగుతారు.
టాటా నెక్సాన్ మరియు ఆల్ట్రోజ్ ఒకే 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తాయి, అయితే వివిధ ట్యూన్‌లలో. నెక్సాన్ (110Ps / 260Nm) 6-స్పీడ్ MT మరియు AMT ఆప్షన్‌ను పొందుతుంది, అయితే ఆల్ట్రోజ్ (90Ps / 200Nm) కేవలం 5-స్పీడ్ MT తో వస్తుంది.
టాటా హారియర్ ఒక BS 6 అప్‌గ్రేడ్‌ను మాత్రమే కాకుండా పవర్ పెరుగుదలని కూడా చూసింది. దాని ఫియట్-సోర్స్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు BS4 యూనిట్ లో 140Ps లకు బదులుగా 170Ps ను అందిస్తుంది, అయితే టార్క్ 350Nm వద్ద అదే విధంగా ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో పాటు కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా అందుకుంటుంది.
డీజిల్ అమర్చిన ఆల్ట్రోజ్ ధర రూ .6.99 లక్షల నుంచి 9.34 లక్షల మధ్య ఉండగా, నెక్సాన్ రూ .8.45 లక్షల నుంచి రూ .12.10 లక్షల ధరని కలిగి ఉంది. పెద్ద హారియర్‌కు రూ. 13.69 లక్షల నుంచి రూ .20.25 లక్షల మధ్య ధరని కలిగి ఉంది.
మరింత చదవండి: ఆల్ట్రోజ్ ఆన్ రోడ్ ప్రైజ్
0 out of 0 found this helpful