నవంబర్ నెలలో 13% అమ్మకాలను కోల్పోయిన టాటా మోటార్స్
డిసెంబర్ 04, 2015 06:30 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
నవంబర్ నెలలో, వివిధ కారు కంపెనీల అమ్మకాలను వెలువరించాయి. దానిలో ముఖ్యంగా టాటా మోటార్స్ యొక్క అమ్మకాలను చూసినట్లైతే, 13 శాతం క్షీణించిన విషయాన్ని గమనించవచ్చు. నెలవారీ పోలికను చూసినట్లైతే, ఇదే నెలకు సంబంధించి అమ్మకాలను గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.
భారతీయ కారు తయారీదారుడు, గత ఏడాది 12,021 యూనిట్ల అమ్మకాలను చోటు చేసుకోగా, ఈ సంవత్సరం నవంబర్ నెలలో 10,517 యూనిట్ల అమ్మకాలను మాత్రమే చోటుచేసుకున్నాడు. ఈ 13% క్షీణత ప్రధానంగా ఎందువలన వచ్చించి అంటే, ఎస్యువి విభాగంలో ఉండే సఫారీ, సఫారీ స్టోర్మ్, ఏరియా, సుమో మరియు మోవస్ వంటి వాహనాల పనితీరు సరిగా లేకపోవడమే కారణం అని, సంస్థ తెలిపింది. పైన పేర్కొన్న కార్ల అమ్మకాలు మొత్తం కేవలం 1,345 యూనిట్లు మాత్రమే మరియు 22% అమ్మకాలు నష్టపోయాయి. మరోవైపు సంస్థ యొక్క సెడాన్ల ప్రభావం చేత, గత ఏడాది 5,920 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం నవంబర్ నెల ఇదే విభాగంలో 3,351 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సొంతం చేసుకుంది. దీని కారణంగా, సంస్థ అమ్మకాలలో 43% నష్టపోయింది.
హాచ్బాక్ లు, కంపెనీ కోసం కొన్ని మంచి వార్తలను తెచ్చిపెట్టింది. అది ఏమిటంటే, ఈ విభాగంలో అమ్మకాల పరంగా 33% పెరుగుదలను సొంతం చేసుకుంది. టాటా మోటార్స్, ఈ సంవత్సరం నవంబర్ లో 5,821 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకోగా, నవంబర్ 2014 లో 4,376 యూనిట్లను మాత్రమే విక్రయించింది. వార్షిక అమ్మకాల పరంగా, కంపెనీ ఈ ఏడాది నవంబర్ నాటికి 10 శాతం వృద్ధి ని చెందింది. అంతేకాకుండా, జికా వాహన ప్రారంభంతో, ఈ సంస్థ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆశిస్తున్నారు. 'మరింత శక్తివంతమైన' సఫారీ వాహనం, ఇటీవల విడుదలతో ఈ లక్ష్యాన్ని సాధించడంలో, బ్రాండ్ కు మరింత సహాయపడే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి