టాటా మోటర్స్ వారు లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని యోచిస్తున్నారు
అక్టోబర్ 26, 2015 12:04 pm anonymous ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
టాటా మోటర్స్ వారు కైట్ హ్యాచ్‌బ్యాక్ ని ఈ పండుగ కాలం విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నారు. దీని కోసమై ప్రఖ్యాత ఫుట్ బాలర్ అయిన లియోనెల్ మెస్సీ గారిని నియమించ దలచారు. నివేదికల ప్రకారం ఈ కంపెనీ వారు ఆర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాడు అయిన ఒకరితో డీల్ కుదుర్చుకుని ఇప్పటికే స్పెయిన్ కి కొన్ని యూనిట్ల కైట్ లను యాడ్ షూటింగ్ కై ఎగుమతి చేయడం జరిగింది. మెస్సీ లాంటి ప్రముఖుల వలన ఈ వాహనం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు సంపాదిస్తుంది.
ఈ కైట్, జెస్ట్ మరియూ బోల్ట్ లాగానే విస్టా వేదికపై ఆధారితమైనా కానీ, ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ కి నూతన డిజైన్ రానుంది. దీనికి 1.0-లీటర్, 3-సిలిండర్ల డీజిల్ ఇంజిను తో పాటుగా 1.2-లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజిను కూడా ఉంటుంది. ఇవి కాకుండా, 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కాకుండా ఏఎంటీ యూనిట్ కూడా రావొచ్చు అని అంచనా.