• English
  • Login / Register

టాటా మోటార్స్ యొక్క మాంజా మరియు విస్టా వాహనాలను నిలిపి వేయడంతో అందరి కళ్ళూ జైకా పైనే

డిసెంబర్ 10, 2015 09:25 am sumit ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టాటా మోటార్స్, అధికారికంగా మాంజా సెడాన్ మరియు విస్టా వాహనాల ఉత్పత్తి అమ్మకాలను నిలిపి వేసింది. ఈ కార్లు, కంపెనీ లైనప్ నుండి మరియు అధికారిక వెబ్సైట్ నుండి తొలగించబడ్డాయి. కొంత కాలం నుండి భారత కార్ల తయారీదారుడు అయినటు వంటి ఈ టాటా మోటార్స్ ఎటువంటి అత్యద్భుతమైన వాహనాలను పరిగణలోకి తీసుకొని రాలేదు. గతంలో, ఈ టాటా సంస్థ పాత టాటా నానో వాహనాన్ని నిలిపివేసింది మరియు ఇప్పుడు దాని తర్వాత, మాంజా, విస్టా అలాగే సుమో గ్రాండే (మోవస్) ల ఉత్పత్తి కూడా నిలిపి వేసింది.

ఈ మాంజా మరియు విస్టా లు అనేవి, టాటా ఇండికా మరియు టాటా ఇండిగో యొక్క మర్పు చేయబడిన వెర్షన్లు. మొదట, ఇండిగో మాంజా మరియు ఇండికా విస్టా అను పేర్లతో గుర్తింపును సాదించాయి. మరో విషయం ఏమిటంటే, టాటా ఇండికా మరియు టాటా ఇండిగో వాహనాలు రెండూ కూడా, టాక్సీ వాహనాలుగా ఉండేవి. ప్రజలు, ఈ వాహనాలను వ్యక్తిగత వాహనాలుగా అంగీకరించలేదు కాబట్టి, ఈ వాహనాలు అంచనాలను అందుకోలేకపోవడంతో విజయాన్ని పొందలేక విఫలమయ్యాయి. అయితే తరువాత, సంస్థ వారు ఈ సంబందిత వాహనాల పేర్ల నుండి ఇండికా మరియు ఇండిగో వంటి పేర్లను తొలగించి, వాటి ఫేస్లిఫ్ట్ లు అయిన మాంజా అలాగే విస్టా అను వాహనాలను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ విజయాన్ని సాధించలేక విఫలమయ్యాయి. తద్వారా ఈ సంస్థ, కొనుగోలుదారులకు ఉత్పత్తి నాణ్యత గురించి భరోసా ఇవ్వలేక వాటిని నిలిపి వేయాలని నిర్ణయించుకుంది.

కంపెనీ, భారత ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సియామ్) యొక్క సొసైటీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూలై లో ఈ కార్ల ఉత్పత్తి ని నిలిపివేసింది. ఇప్పుడు టాటా సంస్థ, హ్యాచ్బ్యాక్ విభాగం మరియు కాంపాక్ట్ సెడాన్ ల అమ్మకాలైన ఇండికా, ఇండిగో ల మీదనే ఆధారపడి ఉంది. ఈ కార్లు, కమర్షియల్ / టాక్సీ ప్రయోజనం కోసం మాత్రమే అందుబాటులో ఉండబోతున్నాయి. టాటా సంస్థ ఇప్పటికే, రాబోయే హాచ్బాక్ తో అధ్బుతంగా, కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ అందమైన లుక్స్ ను కలిగిన ఈ జైకా వాహనం, అనేక కీలకమైన అంశాలతో రాబోతుంది. మరోవైపు ఈ వాహనం, శక్తివంతమైన ఇంజిన్లు మరియు లక్షణాల సమగ్ర సమితి తో హాచ్బాక్ విభాగంలో అడుగు పెట్టబోతుంది.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience