• English
  • Login / Register

టాటా మోటర్స్ వారు 1,100 కార్లను గనేశ్ చతుర్తి నాడు డెలివరీ చేశారు

సెప్టెంబర్ 21, 2015 04:13 pm nabeel ద్వారా సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ పండుగ కాలాన్ని టాటా మోటర్స్ వారు 1,100 కార్లను డెలివరీ చేసి జరుపుకున్నారు. ఈ అమ్మకాలు మహరాష్ట్రా, గుజరాత్, చ్చత్తీస్గఢ్ మరియూ మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో గనేష్ చతుర్తి పర్వ దినం సందర్భంగా జరిగాయి. కంపెనీ వారు ముంబై, పూనే, నాగ్పూర్, రాయ్పూర్ మరియూ భోపాల్ నగరాలలో ఈ పండుగ కాలం సందర్భాన డిమాండ్ లో హెచ్చుని గమనించారు. ఒక్క మహరాష్ట్ర రాష్ట్రంలోనే 700 డెలివరీలు అవ్వగా మిగిలిన 400 డెలివరీలు మధ్య ప్రదేశ్, చ్చత్తీస్గఢ్ మరియూ గుజరాత్ లలో జరిగాయి.

టాటా మోటర్స్ వారి ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ విభాగానికి న్యాషనల్ సేల్స్ హెడ్ అయిన మిస్టర్. అషేష్ ధర్ గారు, " ఈ పండుగ కాలం ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఎదురుచూపుని మరియూ నూతన శక్తిని అందించేది. ఈ శుభసందర్భాన, మా కస్టమర్లు అందించిన మద్దతుకి మేము ఎంతగానో గర్వంగా ఉన్నాము. ఎన్నో కుటుంబాలకు వాహనంలో ప్రయాణం చేసే ఆనందాన్ని అందించిన ఈ వేడుకలో ఒక భాగం అయినందుకు మాకు ఆనందంగా ఉంది. జెస్ట్, బోల్ట్ మరియూ జెన్X నానో మార్కెట్ లో పుంజుకుంటున్నందుకు మేము మళ్ళీ మా కస్టమర్ల విశ్వాసాన్ని పొందుతున్నాము," అని అన్నారు.

కస్టమర్ల సెంటిమెంట్స్ ని బలపరిచేందుకు, టాటా మోటర్స్ వారు 'ఎక్సైటింగ్' పండుగ కాలం ప్యాకేజీలను అందిస్తున్నారు మరియూ తగిన డెలివరీలను కస్టమర్ల డిమాండ్లకు తగినట్టుగా చేస్తున్నారు.

టాటా మోటర్స్ వారు నేపాల్, కాట్మండు లోని 11వ నద ఆటో షోలో కూడా పాల్గొన్నారు. జెస్ట్ ని ప్రదర్శించడంతో పాటుగా బోల్ట్ మరియూ ఎక్సీటా లను కూడా ప్రదర్శించారు. సరికొత్త శ్టార్మ్ ని నేపాల్ ధర ప్రకారం NPR 42.25 లక్షలకు LX ని మరియూ NPR 56.85 లక్షలకు VX వేరియంట్ ని అందించనున్నారు. కస్టమర్లు కొనుగోలు చేసే ముందు అవగాహన ఉండాలని టాటా మోటర్స్ వారు ఒక పరస్పర సమాచార బదిలీ జరిగేలా ఆటో షోలో మూడు భాగాలను, మ్యూజిక్ బూత్, గేమింగ్ జోన్ మరియూ కస్టమర్ ఇంటరాక్షన్ సెక్షన్ ని ప్రవేశపెట్టింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience