నవంబర్ 20 నుండి 26 వరకు మెగా సర్వీసు క్యాంప్ నిర్వహించబడుతుంది అని టాటా మోటర్స్ వారు ప్రకటించారు
నవంబర్ 17, 2015 03:42 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టాటా మోటర్స్ వారు దేశవ్యాప్తంగా వారం పొడవున నడిచే ఒక సర్వీసు క్యాంపు గా 'మెగా సర్వీసు క్యాంప్' ని నిర్వహించనున్నాము అని ప్రకటించారు. ఉచిత వాహన చెక్-అప్ క్యాంప్ అన్ని టాటా మోటర్స్ డీలర్‌షిప్‌ల వద్ద మరియూ ఆథొరైసడ్ సర్వీసు సెంటర్ల వద్ద దాదాపుగా 287 నగరాలలో అందిస్తాము అని తెలిపారు. ఇది నవంబరు 20 నుండి 26 వరకు జరుగుతుంది. పైగా, ఈ కంపెనీ వారు 1000 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కలగలిపి ఈ సదుపాయాలు అందిస్తున్నారు. ఈ ఏడాదిలో ఈ కంపెనీ వారు విజయవంతంగ నిర్వహించిన మూడవ క్యాంప్.
ఈ మెగా సర్వీసు క్యాంప్ లో, టాటా మోటర్స్ వారు ఉచిత టాప్ వాష్ ఇంకా సమగ్ర వాహన హెల్త్ చెక్-అప్ నిర్వహిస్తారు. దాదాపు 10 శాతం డిస్కౌంట్ ని అందించే 16 పైగా సప్లయర్స్ తో అనుసంధానం అయ్యారు. ఈ డిస్కౌంట్ పరికరాలు, ఇతర వాల్యూ ఆడెడ్ సర్వీసులు మరియూ ఆయిల్ వంటి వాటిపై వర్తిస్తుంది.
పైగా, దాదాపుగా 20 శాతం డిస్కౌంటు ని టాటా మోటర్స్ వారి ఒరిజినల్ పార్ట్స్ పై ఇంకా లేబర్ చార్జీలపై మరియూ ఇతర స్పెషల్ ఆఫర్లపై అందిస్తారు. ఇందులో ఒకటి, రూ.699 విలువ గల వాల్యూ కేర్ (గోల్డ్ ఏఎంసీ), రూ.1000 ఎక్స్టెండెడ్ వారెంటీ రీటెయిల్ పాలసీ పై డిస్కౌంట్, రూ.1000 వరకు కొత్త బ్యాటరీలపై డిస్కౌంట్, టాటా కార్ల ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంస్పై ప్రత్యేక ఆఫర్లు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ రీటెయిల్ పాలసీ ఇంకా ఆకర్షణీయమైన ఇన్షురెన్స్ రెన్యూవల్ ఆఫర్లు వంటివి అందిస్తున్నారు.
టాటా మోటర్స్ లో ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ కి ప్రెసిడెంట్ అయిన మాయంక్ పరీక్ గారు," మా కస్టమర్ల సర్వీసుకై మరిన్ని అవకాశాలకై మేము ఈ మూడవ విభాగం అయిన మెగా సర్వీసు క్యాంప్ ని ఆరంభించనున్నాము. క్రితం రెండు క్యాంప్ లు విజయవంతం అవడం కారణంగా ఈ సారి మరింత ఉత్సాహంతో ముందుకు వస్తున్నాము. మేము ఇప్పుడు ఒక పరివర్తన దశలో ఉన్నాము. కస్టమర్లు మామ్మల్ని ఆదరించిన కారణంగా మేము జేడీ పవర్ సీఎస్ఐ 2015 లో మేము మూడవ స్థానానికి ఎగబాకగలిగాము. " అని అన్నారు.