టాటా మ్యాజిక్ ఐరిస్ ఇప్పుడు బజాజ్ RE60 తో తలపడటానికి సిద్దంగా ఉంది
సెప్టెంబర్ 23, 2015 04:51 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: టాటా మోటర్స్ వారు వేర్వేరు ప్రభుత్వాలతో మ్యాజిక్ ఐరిస్ ని మీటరు ట్యాక్సీ గా చేసేందుకై చర్చలు జరుపుతున్నారు. అస్సాం, బీహార్, ఢిల్లీ, గుజరాత్ మరియూ రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే వారి అంగీకారం తెలిపాయి. RE60 విడుదల ఉండగా ఈ వార్త బజాజ్ వారిని ఖచ్చితంగా చిరాకు పెట్టవచ్చు.
ఈ మ్యాజిక్ ఐరిస్ యొక్క అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది ఎక్కువ సురక్షణ ఇవ్వగలదు. ఇది పెద్దగా కనపడటంతో పాటుగా డీజిల్ ఇంజినుతో అధిక సీటింగ్ కెపాసిటీ ని కలిగి ఉండి కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.
టాటా మోటర్స్ ( కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్) కి ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ అయిన మిస్టర్. రవి పిషోర్డీ, బిజినెస్ స్టాండర్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మ్యాజిక్ M1 భద్రత నిబంధనలను చరుకుంటుంది అని తెలిపారు.
మామూలు ఆటో రిక్షా కంటే కూడా ఈ క్వాడ్రిసైకిల్ ఎక్కువ కాలుష్యానికి దారి తీస్తుంది అని అని ఎన్నో NGO ల నుండి చట్టపరమైన అడ్డంకులను దాటి వచ్చిన తరువాత టాటా వారు కూడా ఈ అడ్డంకులను విజయవంతంగా అధిగమించవచ్చును.
బజాజ్ RE60 రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూం) కి విడుదల కావస్తుండటం టాటా వారిని ఇబ్బంది పెట్టవచ్చును ఎందుకంటే మ్యాజిక్ ఐరిస్ రూ.2. 35 లక్షలకు (ఎక్స్-షోరూం) కి అందిస్తున్నారు.