• English
  • Login / Register

అక్టోబర్ 17న విడుదల కానున్న Tata Harrier, Safari Facelifts

టాటా హారియర్ కోసం rohit ద్వారా అక్టోబర్ 13, 2023 12:15 pm ప్రచురించబడింది

  • 201 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వీటి బుకింగ్ؚలు ఇప్పటికే ఆన్ؚలైన్‌లో మరియు టాటా పాన్-ఇండియా డీలర్ నెట్ؚవర్క్ؚల వద్ద రూ.25,000కు ప్రారంభం అయ్యాయి.

Tata Harrier facelift and Tata Safari facelift

  • టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీలు తమ మొదటి భారీ నవీకరణను అందుకున్నాయి. 

  • ఇవి రెండూ ప్రస్తుతం ముందు వెనుక కనెక్టెడ్ LED DRLలు, 19-అంగుళాల అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ టెయిల్‌లైట్ؚలతో వస్తాయి. 

  • లోపలి వైపు, ఈ రెండిటిలో బ్యాక్ؚలిట్ ‘టాటా’ లోగో ఉన్న 4-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు సవరించిన డ్యాష్ؚబోర్డ్ ఉన్నాయి. 

  • అందిస్తున్న ఫీచర్‌లలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మరియు డ్యూయల్-జోన్ AC కూడా ఉన్నాయి. 

  • భద్రతా ఫీచర్‌లలో ఏడు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా మరియు ADAS ఉన్నాయి. 

  • రెండిటి ధర, వాటి ప్రస్తుత ధరల కంటే లక్ష రూపాయలు ఎక్కువ ఉండవచ్చు.

టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ మరియు టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ؚలను ఆవిష్కరించినప్పుడు, ఈ కారు తయారీదారు వీటి ధరల వివరాలు మినహహించి, నవీకరించిన SUV జంట గురించి దాదాపు అన్ని వివరాలను వెల్లడించారు. కొత్త టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీల విక్రయాలు అక్టోబర్ 17న ప్రారంభం అవుతాయని ధృవీకరించారు. ఆన్ؚలైన్ మరియు పాన్-ఇండియా డీలర్ షిప్ؚల వద్ద టాటా రూ. 25,000లకు వీటి బుకింగ్ؚలను అంగీకరిస్తోంది. నవీకరించిన SUVల శీఘ్ర పునశ్చరణ ఇక్కడ అందించబడింది: 

సరికొత్త ఎక్స్ؚటీరియర్ؚలు

Tata Harrier and Safari facelifts

రెండు SUVలు ఒకే విధమైన డిజైన్ మెరుగుదలను పొందాయి. ఈ సవరణలలో మార్చిన గ్రిల్, ఆకర్షణీయమైన ఇండికేటర్‌లు మరియు పొడవుగా అమర్చిన స్ప్లిట్-LED హెడ్ؚలైట్లు ఉన్నాయి. ఈ ఫ్లాగ్ؚషిప్ SUV జంట ముందు వైపు పొడిగించిన LED DRL స్ట్రిప్ؚను కూడా పంచుకున్నాయి.

సైడ్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం, వీటి సంబంధిత ‘హ్యారియర్’ మరియు ‘సఫారీ’ పేరు కలిగిన స్టిక్కర్‌లు ముందు డోర్ క్రింది భాగంలో ఉన్నాయి, 17-అంగుళాల నుండి 19-అంగుళాల వరకు అలాయ్ వీల్స్ ఈ రెండిటిలో ఉన్నాయి. రెండు SUVల వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ؚలైట్ సెట్అప్ؚను చూడవచ్చు మరియు వీటి సంబంధిత నేమ్ బ్యాడ్జ్ؚలపై నవీకరించిన ఫాంట్ ఉంది. ముందు మరియు వెనుక వైపు రెండు SUVలకు దృఢమైన స్కిడ్ ప్లేట్ؚలు ఉన్నాయి.

A post shared by CarDekho India (@cardekhoindia)

ఎక్స్ؚటీరియర్ؚకు ఖచ్చితంగా సరిపోయే ఇంటీరియర్

Tata Harrier facelift cabin
Tata Safari facelift cabin

ఈ SUVల క్యాబిన్‌లను కూడా టాటా పూర్తిగా సవరించింది. ప్రస్తుతం ఈ రెండు సవరించిన సెంట్రల్ AC వెంట్ؚలు మరియు టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కలిగిన లేయర్డ్ డ్యాష్ؚబోర్డ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. కొత్త హ్యారియర్ మరియు సఫారీలు బ్యాక్‌లిట్ ‘టాటా’ లోగో కలిగిన 4-స్పోక్‌ల స్టీరింగ్ వీల్ؚను కూడా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వీటి క్యాబిన్ؚలో మీరు ఎంచుకునే ‘పర్సోనా’ పై ఆధారపడి రంగును ఎంచుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: 2023 టాటా హ్యారియర్ వేరియెంట్-వారీ ఫీచర్‌ల వివరాలు

భారీ ఫీచర్‌ల జాబితా

Tata Harrier and Safari facelifts 12.3-inch touchscreen

భారీ 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-కలర్ ఆంబియెంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ؚతో సహా మరిన్ని ఫీచర్‌ల సెట్ؚతో ఈ రెండు టాటా కార్లు వస్తున్నాయి. ఇవి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (సఫారీ 6-సీట్ల వర్షన్‌లో మధ్య వరుసతో), క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚను కూడా కలిగి ఉంటాయి. 

ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు (డ్రైవర్-వైపు మోకాలి ఎయిర్ బ్యాగ్ؚతో సహా), 360-డిగ్రీల కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP) మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ؚలు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి. అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ؚలతో వస్తాయి. 

ఇది కూడా చదవండి: 2023 టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ ఫీచర్‌లను వెల్లడించిన టాటా

ఇప్పటికీ కేవలం డీజిల్ ఆఫరింగ్ మాత్రమే 

హ్యారియర్ మరియు సఫారీ ఫేస్ؚలిఫ్ట్ؚలను టాటా కేవలం ప్రసిద్ధ 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో (170Ps/350Nm) మాత్రమే అందిస్తుంది, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో పొందవచ్చు.

అంచనా ధర మరియు పోటీదారులు

Tata Harrier and Safari facelifts rear

రెండు SUVలను సవరించిన వేరియెంట్ లైన్అప్ؚలో విక్రయించనున్నారు, ఇవి: హ్యారియర్-స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు ఫియర్ؚలెస్ మరియు సఫారీ-స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్. కొత్త హ్యారియర్ మరియు సఫారీల ధర ప్రస్తుత ధరలతో పోలిస్తే ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది అని అంచనా. ప్రస్తుత హ్యారీయర్ ధర రూ.15.20 లక్షల నుండి రూ.24.27 లక్షల వరకు ఉంది, ప్రస్తుత సఫారీ ధర రూ.15.85 లక్షల నుండి రూ.25.21 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. 

ఈ 5-సీట్ల SUV MG హెక్టార్ మరియు మహీంద్రా XUV700, అలాగే హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ల హయ్యర్-స్పెక్ వేరియెంట్ లతో పోటీ పడుతుంది. సఫారీ ఫేస్ؚలిఫ్ట్, హ్యుందాయ్ ఆల్కజార్, మహీంద్రా XUV700 మరియు MG హెక్టార్ ప్లస్ؚలకు పోటీని ఇస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: హ్యారియర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హారియర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience