• English
  • Login / Register

2024 చివరిలో విడుదల కానున్న Tata Harrier EV, పేటెంట్ చిత్రం విడుదల

టాటా హారియర్ ఈవి కోసం rohit ద్వారా జనవరి 24, 2024 01:08 pm ప్రచురించబడింది

  • 349 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన హారియర్ EVలో కనిపించిన దాదాపు అదే అంశాలు పేటెంట్ చిత్రంలో కూడా కనిపిస్తాయి.

Tata Harrier EV

  • హారియర్ EVని 2023 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు.

  • 2024 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం, దీని ధర రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

  • ఈ SUV ఫేస్ లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఇందులో కనెక్టెడ్ LED టెయిల్ లైట్లను అందించి, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ఇవ్వనున్నారు.

  • ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలతో వివిధ రకాల బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి.

ఆటో ఎక్స్‌పో 2023 లో, టాటా హారియర్ EV కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది, ఇప్పుడు దీని ప్రొడక్షన్ మోడల్ కోసం సిద్ధం చేయబడుతోంది. 2024 ప్రారంభంలో దీని డిజైన్కు పేటెంట్ లభించింది, దీనికి సంబంధించిన ఒక చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల అయ్యింది, ఇది దాని ఉత్పత్తి మోడల్ కు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది.

పేటెంట్ దరఖాస్తులో ఏముంది?

Tata Harrier EV design patented

ట్రేడ్ మార్క్ చిత్రం హారియర్ EV యొక్క వెనుక భాగాన్ని చూపిస్తుంది, ఇది SUV యొక్క ఫేస్ లిఫ్ట్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో, హారియర్ ఎలక్ట్రిక్ లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. 'హారియర్ EV' బ్యాడ్జింగ్ దాని వెనుక భాగంలో కనిపించనప్పటికీ, ఫ్రంట్ డోర్ యొక్క దిగువ భాగంలో ‘.ev’ బ్యాడ్జింగ్ అవసరం, ఇది ఇప్పుడు ప్రతి ఆధునిక టాటా ఎలక్ట్రిక్ కార్లలో కనిపిస్తుంది.

Tata Harrier EV concept at Auto Expo 2023

వెనుక భాగం 2023 లో మార్కెట్లోకి ప్రవేశించిన హారియర్ యొక్క ఫేస్లిఫ్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్ ను పోలి ఉంటుంది, దీని నవీకరించబడిన మోడల్ 2023 లో విడుదల చేయబడింది. కొత్త హారియర్ EVలో పనోరమిక్ సన్ రూఫ్ తో సహా సాధారణ మోడల్ మాదిరిగానే ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే, హారియర్ EV యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ దాని డీజిల్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది.

దీని ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ వివరాలు

కొత్త హారియర్ EVలో అందించే ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ వివరాలు వెల్లడించబడలేదు, కానీ దీనికి వివిధ రకాల బ్యాటరీ ప్యాక్లు మరియు ఎలక్ట్రిక్ మోటార్లను ఇవ్వవచ్చని మేము భావిస్తున్నాము. ఇది 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని మరియు ఆల్-వీల్ డ్రైవ్ట్రెయిన్తో (AWD) అందించబడుతుందని అంచనా. ఇటీవల విడుదల అయిన పంచ్ EV మాదిరిగానే హారియర్ EV టాటా యొక్క కొత్త యాక్టి.EV ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుందని కూడా ధృవీకరించబడింది.

ఇది కూడా చదవండి: 2025 చివరి నాటికి విడుదల కానున్న టాటా EVలు ఇవే

ఆశించిన విడుదల మరియు ధర

Tata Harrier EV

టాటా హారియర్ EV ప్రారంభ ధర రూ.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో 2024 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది మహీంద్రా XUV.e8 తో నేరుగా పోటీపడుతుంది. అలాగే ఇది హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు MG ZS EV కంటే పెద్ద మరియు ప్రీమియం ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

మరింత చదవండి: టాటా హారియర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata హారియర్ EV

Read Full News

explore మరిన్ని on టాటా హారియర్ ఈవి

space Image

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience