రాబోయే తన EVల శ్రేణి కోసం కొత్త బ్రాండ్ గుర్తింపుని ఆవిష్కరించిన Mahindra
మహీంద్రా xev ఇ8 కోసం rohit ద్వారా ఆగష్టు 17, 2023 07:51 pm ప్రచురించబడింది
- 419 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త బ్రాండ్ గుర్తింపుని మహీంద్రా థార్.e కాన్సెప్ట్ పై ఆవిష్కరించనున్నారు, అయితే ఇది భవిష్యత్తులో అన్ని కొత్త EVలపై కనిపించనుంది
-
కొత్త బ్రాండ్ ఐడెంటిటీ రానున్న మహీంద్రా XUV మరియు BE (బార్న్ ఎలక్ట్రిక్) శ్రేణిపై కనిపించనుంది.
-
మహీంద్రా కొత్త లోగో ‘అపరిమిత అవకాశాల’ అనే అర్ధం వచ్చే చిహ్నంలా కనిపిస్తుంది, అలాగే ఈ కారు తయారీదారు దూకుడు వారసత్వానికి కూడా సంకేతంగా నిలుస్తుంది.
-
కొత్త బ్రాండ్ మరియు ‘లే చలాంగ్’ అనే పేరుతో ఎ. ఆర్. రెహ్మాన్ కంపోజ్ చేసిన ఆడియో గీతాన్ని కూడా ఈ కారు తయారీదారు విడుదల చేశారు.
-
కొత్త శ్రేణి EVలు 75 కంటే ఎక్కువ సౌండ్‌లను కలిగి ఉంటాయి, సీట్ؚబెల్ట్ అలర్ట్ؚలు మరియు టర్న్ ఇండికేటర్ؚలు వంటి వివిధ ఫంక్షన్ؚలను ఇవి సూచిస్తాయి.
-
2024లో ప్రారంభంలో విడుదల కానున్న సరికొత్త XUV.e8తో (XUV700 EV వర్షన్) మహీంద్రా EV ఆఫరింగ్‌లు ప్రారంభమవుతాయి, BE శ్రేణి 2025 నుండి విడుదల కానుంది.
2023 స్వాతంత్ర దినోత్సవ ప్రదర్శనలో భాగంగా, మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల (EVల) శ్రేణి కోసం కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది, ఈ వాహనాలను INGLO మాడ్యూలర్ ప్లాట్ؚఫార్మ్‌పై నిర్మించనున్నారు, వీటిలో XUV మరియు BE (బార్న్ ఎలక్ట్రిక్) రెండూ మోడల్‌ల వాహనాలు ఉంటాయి. 2021లో మహీంద్ర XUV700 విడుదలకు ముందు తమ బ్రాండ్ లోగోను నవీకరించిన తరువాత, ఈ కారు తయారీదారు చేసిన రెండవ ఐడెంటిటీ అప్ؚడేట్ ఇది. అంతేకాకుండా, ప్రస్తుత మోడల్‌ల EV వెర్షన్‌లను ‘XUV’ బ్రాండ్ పేరుతో మరియు సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌లను ‘BE’ బ్రాండ్ పేరుతో విడుదల చేయనున్న మహీంద్రా.
కొత్త లోగోపై ఉన్న అంశాలు
కొత్త లోగో, కారు తయారీదారు ‘ట్విన్ పీక్స్’ చిహ్నానికి తాజా దృష్టికోణం, ఈ చిహ్నం ‘అపరిమిత అవకాశాల’ అని అర్ధం వచ్చేలా మరియు కారు తయారీదారు దూకుడు వారసత్వానికి సంకేతంగా నిలుస్తుంది, ఇది రేస్ ట్రాక్ؚను కూడా పోలి ఉంది. ఈ కారు తయారీదారు సుస్థిరత కోసం చేసే కృషిని సూచించడంతో పాటుగా ఆధునిక విధానంలో ఈ బ్రాండ్ సంప్రదాయ ‘M’ను కూడా దీనికి జోడించబడింది.
థార్.e కాన్సెప్ట్‌పై ఆవిష్కరించిన కొత్త ఐడెంటిటీని, మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (MEAL) అనే పేరుగల మహీంద్రా కొత్త EV అనుబంధ సంస్థచే ఆవిష్కరించబడింది. 2024 ప్రారంభంలో మహీంద్రా XUV.e8 విడుదల కానుంది, రాబోయే EV శ్రేణిలో, ఈ కొత్త లోగోని పొందే మొదటి మోడల్‌గా ఇది నిలుస్తుంది.
మహీంద్రా కొత్త ఆడియో ఐడెంటిటీ
కొత్త ఐడెంటిటీని ఆవిష్కరించడంతో పాటు, మహీంద్రా కొత్త బ్రాండ్‌ను మరియు ‘లే చలాంగ్’ అనే కొత్త గీతాన్ని కూడా విడుదల చేసింది, దీనిని బాలీవుడ్ సంగీత దర్శకుడు మరియు గాయకుడు ఎ.ఆర్. రెహమాన్ సహకారంతో కొంపోజ్ చేశారు. వీటిలో 75 కంటే ఎక్కువ శబ్దాలు ఉంటాయి, డ్రైవ్ సౌండ్ؚలు, సీట్ؚబెల్ట్ అలర్ట్‌లు, మరియు టర్న్ ఇండికేటర్‌లతో సహా ఇవి లోపల మరియు బయట వివిధ ఫంక్షన్ؚలను సూచిస్తాయి.
మహీంద్రా EV విభాగంలో పోటీని తీవ్రతరం చేస్తోంది మరియు 360-డిగ్రీల సరౌండ్ సౌండ్ అనుభవాన్ని తన రాబోయే EV లైన్అప్‌లో అందించడానికి హర్మన్ మరియు డోల్బీ అట్మాస్ వంటి బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ శబ్దాలు, యక్టివ్ యంబియెంట్ లైటింగ్ మరియు హై-రెజల్యూషన్ యానిమేషన్‌లు వంటి విజువల్ సహాయకాలతో సంపూర్ణం అవుతాయి.
ఇది కూడా చూడండి: ఈ 15 వివరణాత్మక చిత్రాల ద్వారా మహీంద్రా థార్ EVని పరిశీలించండి
EVల విడుదల టైమ్ؚలైన్
XUV700 EV వర్షన్ అయిన XUV.e8 మోడల్ విడుదలతో మహీంద్రా తన రాబోయే EVల విడుదలను ప్రారంభించనుంది. ఆ తరువాత 2024 చివరిలో XUV.e9ను (XUV.e8 కూపే డిజైన్ ప్రత్యామ్నాయం) అందించనుంది. మీరు BE శ్రేణి మోడల్‌ల కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే, గమనిక, ఇవి 2025 నుండి మాత్రమే అందుబాటులోకి రానున్నాయి, BE.05 అక్టోబర్ 2025 విడుదలకు సిద్ధం అవుతుంది.
ఇది కూడా చదవండి: స్కార్పియో N-ఆధారిత గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ؚను ఆవిష్కరించిన మహీంద్రా
0 out of 0 found this helpful