టాటా జైకా 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.
టాటా సంస్థ కొనసాగుతున్న 2016 ఆటో ఎక్స్పోలో కొత్త ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్ ని ప్రదర్శించింది. ఈ హ్యాచ్బ్యాక్ ఇప్పుడు నుండి కొన్ని వారాలలో ప్రారంభించబడుతుందని ఆశిస్తున్నారు. ఇది టాటా వార్ శ్రేణిలో ని కొత్త ఉత్పాదకం మరియు ఈ వాహనంలో రెండు కొత్త ఇంజిన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం ద్వారా టాటా వారు తమ యొక్క ఇంపాక్ట్ డిజైన ఫిలాసఫీ ని ప్రదర్శిస్తున్నారు. ఈ టాటా జైకా షెవ్రొలే బీట్, హ్యుందాయి ఐ10 మరియు మారుతి సుజికి సెలేరియో లకు పోటీ గా రానున్నది.
ఈ టాటా జైకా లో కొత్త సమాచార వినోద వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వాహనం బ్లూటూత్ కనెక్టివిటీ, ట్యూనర్, యుఎస్బి, ఆక్స్-ఇన్ మరియు పెద్ద స్క్రీన్ డిస్ప్లే ని కలిగి ఉండబోతుంది. టాటా వారి కనెక్ట్ నెక్స్ట్ వ్యవస్థ స్మార్ట్ ఫోన్ అనుసంధానం, నావిగేషన్ యాప్ మరియు జూక్ యాప్ కలిగి ఉండబోతుంది. ఈ వాహనం విభాగంలో ని 8 స్పీకర్ల వ్యవస్థ మరియు నాలుగు ట్విటర్లతో కలిగిన స్పీకర్ వ్యవ్బస్థను కలిగి ఉంటుంది.భద్రతపరంగా ఎయిర్బ్యగులతో కూడిన ABS, EBD మరియు CSC ( కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్స్) ని కలిగి ఉంటుంది.
జైకా వారు ఈ వాహనలో కొత్త పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను తమ టాటా మోటార్స్ ద్వారా అందిస్తున్నారు. జైకా లో కొత్తగా రెవొటార్క్ కుటుంబానికి చెందిన డీజిల్ ఇంజిన్లను వాడుతున్నారు. దీనిద్వారా కొత్త 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మోటార్లను ఈపెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండబోతుంది. కొత్త 1.05 లీటర్ రెవోటార్క్ 3 సిలెండర్ డీజిల్ సామర్ధ్యాన్ని 70PS అందిస్తూ 4000RPM తో 140NM గరిష్ట టార్క్ ను 1800-3000Rpm వద్ద అందిస్తుంది. ఈ 1.2 లీటర్ రెవొట్రాన్ 3 సిలెండర్ 85Ps ను 6000Rpm వద్ద అందితూ 114Nm గరిష్ట టార్క్ ని 3500Rpm వద్ద అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్ల ఎంపికను 5 స్పీడ్ మాన్యువల ట్రాన్స్మిషన్ తో చేకూర్చడం జరిగింది.