Harrier, Safariల నుండి ముఖ్యమైన భద్రత ఫీచర్ؚను పొందనున్న Tata Curvv
టాటా కర్వ్ కోసం rohit ద్వారా డిసెంబర్ 05, 2023 06:18 pm ప్రచురించబడింది
- 59 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి కొన్ని ADAS ఫీచర్‌లను కూడా టాటా కర్వ్ కాంపాక్ట్ SUV పొందవచ్చు
-
కర్వ్ ICE కాన్సెప్ట్ؚను టాటా ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది.
-
ఇప్పటికే అనేక మోడల్‌లు ఉన్న SUV విభాగంలోకి 2024లో టాటా దీనితో ప్రవశిస్తుంది.
-
రహస్య చిత్రాలలో కనిపించిన ఎక్స్ؚటీరియర్ వివరాలలో LED లైటింగ్, అలాయ్ వీల్స్ మరియు కూపే రూఫ్ؚలైన్ ఉన్నాయి.
-
2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ؚతో వస్తుంది.
-
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు 6 ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉంటాయని అంచనా.
-
పవర్ؚట్రెయిన్ ఎంపికలలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది; ICE మోడల్ కంటే ముందు EV వర్షన్ విడుదల అవుతుంది.
-
2024 మధ్య కాలంలో విడుదల కావచ్చని అంచనా; ధరలు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
విడుదల కానున్న టాటా కర్వ్ టెస్ట్ వాహనాలు ఇప్పుడు మరింత తరచుగా కనిపిస్తున్నాయి. ఇటీవల, ముఖ్యమైన ఫీచర్‌లలో ఒకదాని వెల్లడిస్తూ దీని మరొక మోడల్ కనిపించింది.
కొత్తగా వస్తున్నవి ఏమిటి?
తాజా రహస్య చిత్రాలలో, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉండవచ్చని సూచించే విండ్ షీల్డ్-మౌంటెడ్ కెమెరాను కర్వ్ టెస్ట్ వాహనం కలిగి ఉన్నట్లు కనిపించింది, దీనిలో లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు. LED లైటింగ్ (ముందు వైపు స్ప్లిట్ హెడ్ؚలైట్ సెట్అప్) మరియు అలాయ్ వీల్స్ సరైన స్థానాలలో ఉన్నందున కర్వ్ టెస్ట్ మోడల్ ప్రొడక్షన్ؚకు సిద్ధంగా ఉందని తెలియచేస్తుంది.
కొత్త టాటా కారులో కూపే రూఫ్‌లైన్ మరియు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉన్నట్లు మునపటి రహస్య చిత్రాలలో చూడవచ్చు. కర్వ్‌తో కాంపాక్ట్ SUV విభాగంలో టాటా అరంగేట్రం చేయనుంది.
ఆశించదగిన క్యాబిన్ నవీకరణలు
ప్రొడక్షన్-స్పెక్ టాటా కర్వ్ ఇంటీరియర్ గురించి ప్రస్తుతానికి వెల్లడించలేదు కానీ, ఇది ప్రకాశించే టాటా లోగో కలిగిన కొత్త 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు ఇటీవల నవీకరించిన టాటా మోడల్‌లలో చూసిన టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ؚతో వస్తుందని ఆశించవచ్చు.
కర్వ్ؚలో ఉన్న ఇతర ఫీచర్‌లలో 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్ؚరూఫ్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటాయని అంచనా. ADASతో పాటు, టాటా దీనిలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ؚలను అందించవచ్చు (ESC).
దీనిని కూడా చూడండి: 2023లో మీరు చూడబోయే చివరి 3 కొత్త కార్ؚలు: ఒక ఎలక్ట్రిఫైడ్ లాంబో మరియు రెండు చిన్న SUVలు
ఇంజన్/బ్యాటరీ ఎంపికలు
టాటా, కర్వ్ؚలో కొత్త టర్బోచార్జెడ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను(125 PS/225Nm) అందిస్తోంది. దీని గేర్ؚబాక్స్ ఎంపికల వివరాలు ప్రస్తుతానికి తెలియదు, అయితే కొత్త టాటా నెక్సాన్ؚలోని అదే 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్ (DCT) ఉంటుందని మేము భావిస్డ్తున్నాము. కర్వ్ؚ అదనపు పెట్రోల్ మరియు ఇంజన్ ఎంపికలను కూడా పొందవచ్చు, దీని వివరాలు ఇంకా వెల్లడించలేదు.
అయితే మొదటగా, ఎలక్ట్రిక్ ఆఫరింగ్ؚల కోసం టాటా జెన్2 ప్లాట్ఫార్మ్ పై నిర్మించిన టాటా కర్వ్ EV ఆవిష్కరణను చూడవచ్చు. ఈ కొత్త టాటా EV బ్రీడ్ؚలు 500 కిమీ వరకు పరిధిని క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ ఏ ఇతర వివరాలు ప్రస్తుతానికి తెలియదు.
ధర మరియు విడుదల
టాటా కర్వ్ EV 2024 మధ్య కాలంలో విడుదల కావచ్చు, దీని ధరలు రూ.20 లక్షల నుండి ప్రారంభం కానున్నాయి మరియు ICE మోడల్ ధర సుమారు రూ.10.5 లక్షలు ఉంటుందని (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) అంచనా. మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, సిట్రోయెన్ C2 ఎయిర్ؚక్రాస్ MG ఆస్టర్, మరియు వోక్స్వ్యాగన్ టైగూన్ వంటి సాధారణ SUVలకు ఇది SUV-కూపే ఎంపిక అవుతుంది. కర్వ్ EV, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటికి ప్రత్యామ్నాయం అవుతుంది.
ఇక్కడ మరింత చదవండి: టాటా సఫారీ డీజిల్
0 out of 0 found this helpful