టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో అద్భుతంగా స్కోరు చేసింది
జనవరి 23, 2020 11:00 am dhruv attri ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నెక్సాన్ తరువాత ఆల్ట్రాజ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెండవ టాటా కారుగా నిలిచింది
- టాటా ఆల్ట్రోజ్ పెద్దల భద్రతలో 5-స్టార్ రేటింగ్ ని మరియు పిల్లల నివాస రక్షణ కోసం 3-స్టార్ రేటింగ్ ని స్కోర్ చేస్తుంది.
- గ్లోబల్ NCAP ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ ను పరీక్షించింది.
- ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ISOFIX వంటి లక్షణాలను ప్రామాణికంగా పొందుతుంది.
- టాటా ఆల్ట్రోజ్ ను జనవరి 22 న విడుదల చేయనుంది.
టాటా మోటార్స్ తన భద్రతా అంశాలలో మరో అంశాన్ని జోడించింది, దాని రాబోయే హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP పరీక్షల తాజా ఎడిషన్ లో 5- స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ను అందుకుంది. 2019 లో ఖచ్చితమైన స్కోరు పొందిన మొదటి భారతీయ కారు టాటా నెక్సాన్.
గ్లోబల్ NCAP ఆల్ట్రోజ్ బేస్ వేరియంట్ ను ఎంచుకుంది, ఇది పెద్దల భద్రత కోసం 5-స్టార్ రేటింగ్ మరియు పిల్లల నివాస రక్షణ కోసం 3-స్టార్ రేటింగ్ ని సాధించింది. బేస్ వేరియంట్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX ఎంకరేజెస్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు వంటి అంశాలు ఉన్నాయి.
ఆల్ట్రోజ్ నిర్మాణం మరియు ఫుట్‌వెల్ ప్రాంతాన్ని CRS స్థిరంగా రేట్ చేసింది. ఛాతీ రక్షణ తగినంతగా ఉండగా పెద్దలకు తల మరియు మెడ రక్షణ చాలా బాగుంది. ISOFIX మౌంట్‌లను ఉపయోగించి వెనుకాతల ఎదురుగా CRS(పిల్లల నియంత్రణ వ్యవస్థ) ని స్థాపించిన తరువాత ఇది 18 నెలల డమ్మీకి మంచి రక్షణను అందిస్తుంది.
ఛృశ్ సీటు ముందుకు ఎదురుగా ఇన్‌స్టాల్ చేసినందువలన స్కోరు స్వల్పంగా తగ్గింది, ఎందుకంటే సీటు బెల్ట్ యొక్క టాప్ టెథర్ లోడ్ కారణంగా క్రాష్ సమయంలో బ్యాక్‌రెస్ట్ నొక్కుకుపోయినట్టు ఉండడం వలన స్కోర్ తగ్గింది. కారు లోపలి భాగంలో 3 సంవత్సరాల డమ్మీ యొక్క తల తగులుతూ ఉండడం, అందరు ప్రయాణికులకి మూడు-పాయింట్ల సీట్ బెల్టులు లేకపోవడం మరియు ప్రయాణీకుల సీట్ లో CRS వ్యవస్థాపించబడినప్పుడు ప్రయాణీకుల ఎయిర్ బ్యాగ్ డీ-యాక్టివేషన్ అవ్వడం వలన పిల్లల భద్రతా స్కోరు మూడుకి తగ్గింది.
ఆల్ట్రాజ్ కు మద్దతు ఇచ్చే ఆల్ఫా-ARC ప్లాట్‌ఫాం 5 - స్టార్ భద్రతా రేటింగ్ ను సాధించగలదని టాటా తన మాటని నిలబెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. టాటా ఆల్ట్రోజ్ జనవరి 22 న ప్రారంభించాల్సి ఉంది మరియు టోకెన్ మొత్తానికి 21,000 రూపాయల బుకింగ్ లు జరుగుతున్నాయి. దీని ధరలు రూ .5.5 లక్షల నుంచి రూ .8.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.