• English
  • Login / Register

ఆటో ఎక్స్పో వద్ద అధికారికంగా బహిర్గతం కాకముందు కనపడిన మహింద్రా టివోలి

ఫిబ్రవరి 05, 2016 04:04 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విస్తృత వాహనాలను తీసుకొస్తుంది.

మహింద్రా యొక్క రాబోయే ఎస్యువి అయిన టివోలి వాహనం, అధికారికంగా ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం కాకముందు బయట కనిపించింది. నాలుగు సంవత్సరాల అనేక ప్రయోగాలు తరువాత ఈ ఎస్యువి వాహనం అబివృద్ది చేయబడింది మరియు ఇది, కొరియన్ ఆటో తయారీదారుల ద్వారా మార్కెట్ లో జనవరి 2015 లో ప్రవేశపెట్టబడింది.  

అంతర్జాతీయంగా, టివోలి వాహనం కొత్తగా అబివృద్ది చేయబడిన ఈ ఎక్స్ జి ఐ 160 పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా, 126 పి ఎస్ పవర్ ను అదే విధంగా 157 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు గేర్ బాక్స్ లతో జత చేయబడి ఉంది. భారతదేశం లో ఉండే మోడల్, టియువి 300 వాహనం లో ఉండే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా మంచి పవర్ ను అలాగే అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. టివోలి వాహనం, స్మార్ట్ స్టీర్ ఫంక్షన్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది, మూడు స్టీరింగ్ మోడల్స్ అయినటువంటి నార్మల్, కంఫోర్ట్ మరియు స్పోర్ట్ వంటి వాటి నుండి ఒకదానిని ఎంపిక చేసుకుంటుంది. ఈ వాహనానికి, 423 లీటర్లు గల బారీ బూట్ కంపార్ట్మెంట్ అందించబడుతుంది.  
భద్రతా విభాగం విషయానికి వస్తే, ఈ అర్బన్ ఎస్యువి యొక్క నాలుగు చక్రాలకు బారీ డిస్క్ బ్రేక్ లు అందించబడతాయి. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ వాహనం, సమర్ధవంతమైన బ్రేకింగ్ తో పాటు ఈ ఎస్ పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం) మరియు టి పి ఎం ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటోరింగ్ వ్యవస్థ) వంటి అంశాలతో జత చేయబడి ఉంటుంది. 

కొరియన్ తయారీదారుడిచే అబివృద్ది చేయబడిన టివోలి వాహనం, ఏడు ఎయిర్బాగ్లు, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్ అలాగే హీటెడ్ రెండవ వరుస సీట్లు, ఆరు సెన్సార్లతో కూడిన అబ్స్ట్రాకిల్ డిటక్షన్ వ్యవస్థ, ఆటోమేటిక్ వాషర్ మరియు ఆటోమేటిక్ హజార్డ్ లైట్లు వంటి అంశాలను కలిగి ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు భారతదేశం లో ఉండే ఈ వాహనానికి, ముందు ఎయిర్బాగ్లు మరియు ఏబిఎస్ వంటి అన్ని అంశాలు, ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు ప్రామాణికంగా అందించబడతాయి. ఢిల్లీ ఎన్సీఅర్ రీజియన్ లో జరుగుతున్న ఇటీవల 2000 సిసి ప్లస్ డీజిల్ వాహనాల నిషేదం లో, మహింద్రా వాహనాలు అయినటువంటి సన్యాంగ్ టువోలి, కెయువి 100 తో పాటు టియువి 300 వంటి వాహనాలు ప్రదాన పాత్ర పోషిస్తాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience