కంటపడింది: రోడ్ పై పరీక్షించబడుతూ YRA/బలేనో [లోపల వీడియో]
జైపూర్: కొత్త మారుతీ YRA/బలేనో ని ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో బహిర్గతం చేశాక ఈ కారు గుర్గావ్ లో పరీక్షించబడుతూ కంటపడింది. దీనికి సంబందించిన వీడియో ఆన్లైన్ లో కనపడింది. కారుకి నల్లటి పరదా ఒకటి ఉంది మరియూ టెయిల్ ల్యాంప్ క్లస్టర్స్ కనపడీ కనపడకుండా ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం, అక్టోబరులో విడుదల అవ్వొచ్చు అని అంచనా. ఈ వీడియో యూట్యూబ్ లో ఆటో స్పీడ్ అనే యూజర్ పేరున ఎక్కించినట్టు కనపడుతోంది.
ఈ కారు హ్యుండై i20 యాక్టివ్ కి పోటీగా మరియూ స్విఫ్ట్ కంటే ఎగువన నెక్సా డీలర్షిప్ లలో అమ్మకానికి పెట్టడం జరుగుతుంది. బలెనో లేదా మారుతీ YRA పూర్తిగా కొత్త వేదికపై మెరుగైన సామర్ధ్యం కొరకు తయారు చేయబడింది. కొలతల ప్రకారం, దీని పొడవు 3,995mm, వెడల్పు 1,745mm, ఎత్తు 1,470mm (1,460mm కి తగ్గించబడుతుంది ష్వ్స్ వేరియంట్స్ కి). కారుకి 355 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది.
అంతర్భాగాల విషయానికి వస్తే, మారుతి వైఆర్ ఎ/ బాలెనో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నావిగేషన్ ఫంక్షన్ ని కలిగి ఉన్న స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థను అందిస్తుంది. యాక్సెస్ సౌలభ్యం అందించడానికి, కారు ఆడియో మరియు టెలిఫోనీ నియంత్రణలతో ఉన్న బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటుంది. ఒక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి వాటితో కలిపి అనేక సౌకర్య లక్షణాలను కలిగి ఉంటుది. కారు భారతదేశపు వేరియంట్స్ 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డిడిఐఎస్ డీజిల్ ఇంజిన్ ఎస్ హెచ్విఎస్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీకి జతచేయబడి ఉంటుంది.