స్కోడా మే 2020 లో భారతదేశంలో సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించనుంది

published on డిసెంబర్ 26, 2019 11:47 am by rohit కోసం స్కోడా సూపర్బ్

  • 23 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రీమియం సెడాన్ త్వరలో పెట్రోల్ తో మాత్రమే అందించే ఆఫర్ అవుతుంది

Skoda To Launch Superb Facelift In India In May 2020

  •  స్కోడా ఫేస్‌లిఫ్టెడ్ సూపర్బ్‌ను BS6-కంప్లైంట్ 2.0-లీటర్ TSI ఇంజన్ (192Ps పవర్/ 320Nm టార్క్) తో అందించనుంది.
  •  సూపర్బ్ ఫేస్ లిఫ్ట్ బాహ్య భాగంలో కొన్ని సౌందర్య మార్పులతో వస్తుందని ఆశిస్తారు.
  •  ఫేస్‌లిఫ్టెడ్ సూపర్బ్‌లో యాంబియంట్ లైటింగ్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో సహా కొన్ని కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.
  •  BS6 కంప్లైయన్స్ కారణంగా దీనికి ధరల పెరుగుదల లభిస్తుంది.

కేవలం ఒక నెల క్రితం, 2020 స్కోడా సూపర్బ్ ఫేస్ లిఫ్ట్ భారతదేశంలో మొదటిసారిగా టెస్టింగ్ కి గురవుతూ గుర్తించబడింది. ఇప్పుడు, స్కోడా 2020 మే లో  ఫేస్‌లిఫ్టెడ్ సూపర్బ్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది.

Skoda To Launch Superb Facelift In India In May 2020

ప్రీమియం సెడాన్ BS6-కంప్లైంట్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో అందించబడుతుంది. ఈ యూనిట్ 192 Ps పవర్ మరియు 320 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు మరియు 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో జత అవుతుంది.  స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా స్వల్పకాలి కంగా డీజిల్ ఇంజిన్లను తీసేయాలి అని అనుకుంటున్నందున సూపర్బ్ డీజిల్ (కనీసం 2020 లో) ఆఫర్ లో ఉండదు. స్కోడా ప్రస్తుతం రెండు BS 4 ఇంజన్లతో సూపర్బ్‌ను అందిస్తోంది: 1.8-లీటర్ TSI ఇంజన్ (180Ps / 250Nm) మరియు 2.0-లీటర్ TDI  యూనిట్ (177Ps / 350Nm) మరియు 6-స్పీడ్ DSG లేదా 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌ ఎంపికతో అందించబడుతుంది.

Skoda To Launch Superb Facelift In India In May 2020

మార్పుల విషయానికొస్తే, ఫేస్‌లిఫ్టెడ్ సూపర్బ్ టాప్-స్పెక్ వేరియంట్‌ లో LED ఫాగ్ లాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు సన్‌రూఫ్‌ తో కూడిన 9.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. ఇంకా ఏమిటంటే, స్కోడా 360 డిగ్రీల కెమెరా, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ మరియు సూపర్బ్ ఫేస్ లిఫ్ట్ పై యాంబియంట్ లైటింగ్ ను కూడా అందించగలదు.

సంబంధిత వార్త: స్కోడా రాపిడ్, సూపర్బ్ మరియు కోడియాక్ నోరూరించే ధరల వద్ద అందించబడుతున్నాయి

Skoda To Launch Superb Facelift In India In May 2020

ప్రస్తుత-జెన్ సూపర్బ్ ధర రూ .25.99 లక్షలు, రూ .33.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, దాని BS6 వెర్షన్ ప్రవేశపెట్టిన తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. సూపర్బ్ ఫేస్ లిఫ్ట్ హోండా అకార్డ్, టయోటా కేమ్రీ మరియు వోక్స్వ్యాగన్ పాసాట్ లతో తన పోటీని కొనసాగిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన స్కోడా సూపర్బ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience