స్కూప్: వైఆర్ ఎ హాచ్బాక్ ను అక్టోబర్ 2015లో మరియు వైబి ఎ కాంపాక్ట్ ఎస్యువి ని జనవరి 2016లో ప్రారంభించనున్న మారుతి సంస్థ
ఆగష్టు 10, 2015 02:26 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- 7 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ రెండు వాహనాలు, నెక్సా డీలర్షిప్ల ద్వారా రాబోతున్నది. అయితే, జనవరి 2016నాటికి మారుతి 2 కొత్త ఉత్పత్తులను నెక్సా ద్వారా తీసుకురాబోతున్నది.
చెన్నై : మారుతీ సుజికీ వైఆర్ ఎ హాచ్బాక్ ను అక్టోబర్ లో మరియు వైబిఎ కాంపాక్ట్ ఎస్యువి ని జనవరి 2016 లో ప్రారంభించనున్నట్టుగా సమాచారం. నిన్న, జపనీస్ వాహనతయారీదారుడు వైఆర్ ఎ హాచ్బాక్ పేరు బలేనో గా ప్రపంచ మార్కెట్ లో రాబోతుందని ప్రకటించారు. అయితే, బలేనో అనే పేరు ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చు. ఇదివరుకే, మారుతీ సంస్థ ఎస్ ఎక్స్4 ని తొలగించింది. దీని బట్టి మారుతీ విఫలమైన ఉత్పత్తుల పేర్లు ఎక్కువ రోజులు కొనసాగించదు అని తెలుస్తుంది. వైబి ఎ కాంపాక్ట్ ఎస్యువి కి విటారా బ్రెజ్జా అని నామకరణం జరిగింది. ఈ రెండు ఉత్పత్తులు కూడా నెక్సా డీలర్షిప్ల నుండి రాబోతున్నాయి.
యాంత్రికంగా, రెండు వాహనాలు ఇప్పటికే ఉన్న కె-సిరీస్ మరియు మల్టీజెట్ / డిడి ఐఎస్ డీజిల్ ఇంజిన్లతో రాబోతుందని భావన. అయితే, అంతర్జాతీయ మార్కెట్ లో, వైఆర్ ఎ అకా బలేనో కూడా కంపెనీ కొత్త 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ 'బూస్టర్ జెట్ ' పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. సంస్థ, రెండు వాహనాల ప్రారంభ సమయంలో భారతదేశం లో ఈ ఇంజన్ అందించలేకపోవచ్చు. లక్షణాలు పరంగా, రెండు వాహనాలు 7 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, క్రూయిజ్ కంట్రోల్, వంటి లక్షణాలను ఇటీవల విడుదలైన ఎస్-క్రాస్ నుండి సేకరించవచ్చని భావిస్తున్నాము.