• English
  • Login / Register

రెనాల్ట్ ట్రైబర్ AMT టెస్ట్ అవుతూ మా కంటపడింది, త్వరలో ప్రారంభం కానున్నది

రెనాల్ట్ ట్రైబర్ కోసం dhruv ద్వారా జనవరి 07, 2020 03:04 pm ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

AMT ట్రాన్స్‌మిషన్‌ను BS6- కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అందించనున్నారు

Renault Triber AMT Spotted Undergoing Testing, Launch Soon

  •  ట్రైబర్‌ ను BS4 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ తో మాత్రమే లాంచ్ చేశారు.
  •  బూట్‌ లోని ఈజీ-R బ్యాడ్జ్ చేత మాన్యువల్ మరియు AMT ల మధ్య వ్యత్యాసం కనుగొనబడింది.
  •  AMT వేరియంట్ కోసం ప్రస్తుత ట్రైబర్‌ తో పోలిస్తే రూ .50,000 ప్రీమియం ఆశిస్తారు.
  •  AMT వేరియంట్‌ ను బహుళ వేరియంట్లలో అందించవచ్చు. 

రెనాల్ట్ 2019 లో ట్రైబర్‌ ను ప్రారంభించింది, అయితే ఆ సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ లేదు. BS6-కంప్లైంట్ ఇంజిన్‌లతో పాటు 2020 ప్రారంభంలో AMT ఎంపికను ప్రవేశపెడతామని ఫ్రెంచ్ కార్ల తయారీసంస్థ వెల్లడించారు.

పూణే శివార్లలో ట్రైబర్ యొక్క AMT వెర్షన్ పరీక్షించబడిందని మేము గుర్తించాము. ఇది AMT అని బూట్‌లోని “ఈజీ-R” బ్యాడ్జ్ నుండి మనకి తెలుస్తుంది.

Renault Triber AMT Spotted Undergoing Testing, Launch Soon

AMT ట్రాన్స్మిషన్ కలిగిన మరో రెనాల్ట్ అయిన క్విడ్ కూడా ఈజీ-R బ్యాడ్జిని పొందుతుంది. ఇక్కడ ఉన్న ట్రైబర్ చిత్రాలలో బ్యాడ్జ్ స్పష్టంగా కనిపించనప్పటికీ, దానిని మా డేగ కళ్ళ టీమ్ సభ్యుడు తక్షణమే గుర్తించారు.

ఇది కూడా చదవండి: కియా మరియు MG మోటార్ తరువాత, సిట్రోయెన్ లోనికి అడుగుపెట్టనున్నది

రెనాల్ట్ ఈ నెలలో లేదా తరువాతి కాలంలో ట్రైబర్ AMT ని ప్రారంభించాలి. ప్రస్తుతం ట్రైబర్‌లో అందిస్తున్న 1.0-లీటర్ BS 4-కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్ 72Ps  పవర్ మరియు 96Nm టార్క్ ను అందిస్తుంది.

AMT ట్రాన్స్‌మిషన్‌ ను రెనాల్ట్ మల్టిపుల్ వేరియంట్‌ లలో అందిస్తుంది, ఎందుకంటే మేము గుర్తించిన కారు అల్లాయ్ వీల్స్‌తో పేర్కొనబడలేదు.

Renault Triber AMT Spotted Undergoing Testing, Launch Soon

రెనాల్ట్ ట్రైబర్ AMT ని లాంచ్ చేసినప్పుడు, ఇంజిన్ BS 6-కంప్లైంట్‌ గా ఉంటుందని మరియు దీనికి రెండు-పెడల్ సెటప్ ఉంటుందని భావిస్తున్నాము, దీని ధర సుమారు రూ .40,000 నుండి రూ .50,000 వరకు అధనంగా ఉంటుంది. ట్రైబర్ ధర ప్రస్తుతం రూ .4.95 లక్షల నుంచి రూ .6.63 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ ఇండియా).

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ ప్రత్యర్థులని మీరు 2020 లో చూడవచ్చు

మరింత చదవండి: రెనాల్ట్ ట్రైబర్ ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault ట్రైబర్

3 వ్యాఖ్యలు
1
K
kelzang jamtsho
Jan 19, 2020, 11:46:20 AM

If Bs4 1.2 litre petrol. I will opt it.

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    k
    kailash sahu
    Jan 8, 2020, 8:34:38 PM

    BS 6 manual triber car i am waiting

    Read More...
      సమాధానం
      Write a Reply
      1
      S
      surendra vashishth
      Jan 6, 2020, 5:19:33 PM

      I want an AMT variount soon.

      Read More...
        సమాధానం
        Write a Reply
        Read Full News

        explore మరిన్ని on రెనాల్ట్ ట్రైబర్

        సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

        *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

        ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

        • లేటెస్ట్
        • రాబోయేవి
        • పాపులర్
        ×
        We need your సిటీ to customize your experience