రెనాల్ట్ క్విడ్ 25,000 బుకింగ్స్ ని పొందింది
అక్టోబర్ 07, 2015 02:13 pm అభిజీత్ ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
క్విడ్ విడుదల అయిన రెండు వారాల తరువాతనే ఈ రెనాల్ట్ వారు 25,000 బుకింగ్స్ ని అందుకోవడం విశేషం. సెప్టెంబరు 24న విడుదల అయ్యి ఈ ఫ్రెంచి తయారీదారి ఇటువంటి రికార్డు సృష్టించడంతో ఇది ఇతర కార్లకు ఒక కొత్త లక్ష్యంగా మారనుంది.
తయారీదారి అభిప్రాయం ప్రకారం డీలర్షిప్ లకి దేశ వ్యాప్తంగా సందర్శించేందుకు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. క్విడ్ ఆప్ లో కూడా డౌన్లోడ్ ల రూపంలో స్పందన బాగా వచ్చింది.
రెనాల్ట్ వారు రూ. 2.57 లక్షల ధరతో అందరిని విస్మయానికి గురి చేయడమే కాకుండా ఇది మరో 3.53 లక్షల (ఎక్స్-షోరూం న్యూ డిల్లీ) ధరకు పెరిగింది. ఇది 98% స్థానికంగా తయారు చేయడం వలన సంభవించింది.
క్విడ్ అన్ని విభాగాల్లో ఈ సెగ్మెంట్ లోని అతి పెద్ద కారు, అది కొలతలు అయినా, లోపల స్థలం లేదా డిక్కీ స్థలం వంటివి అన్నీ పోటీదారుల కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంతే కాకుండా దీని పై సెగ్మెంట్ అయిన ఆల్టో కే10 వంటి కార్లతో కూడా ఇది పోటీ పడుతుంది.
సాంకేతికంగా, దీనికి ఇన్‌లైన్ 3-సిలిండర్ల 800cc ఇంజిను కలిగి ఉంటుంది ఇంకా 54ps శక్తి మరియూ 72Nm టార్క్ ని విడుదల చేస్తుంది. దాదాపుగా 25.17Kmpl మైలేజీని అందిస్తుంది. ఈ శక్తి అంతా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గుండా ముందు వీల్స్ కి సరఫరా చేయబడుతుంది.
ఇవి కాకుండా, ప్రతీ క్విడ్ విభిన్నంగా కనపడాలి అనీ కస్టమర్లకు రకరకాల ఉపకరణాలు ఎంచుకుని కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ ధర లో మరి కొన్ని ఉపకరణాలు జత చేసినా కానీ పెద్దగా ధరపై ఎక్కువ ప్రభావం చూపదు.