సిట్రోయెన్ eC3 ఎలక్టిక్ హ్యాచ్ؚబ్యాక్ వాస్తవ ఛార్జింగ్ టెస్ట్
సిట్రోయెన్ ఈసి3 కోసం shreyash ద్వారా మే 18, 2023 07:15 pm ప్రచురించబడింది
- 72 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ కావడానికి 58 నిమిషాలు పడుతుందని eC3 క్లెయిమ్ చేస్తుంది. వాస్తవంగా ఇలా జరుగుతుందా?
ఫిబ్రవరి 2023 చివరి వారంలో, సిట్రోయెన్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ eC3ని భారతదేశంలో విడుదల చేసింది, ఇది C3 హ్యాచ్ؚబ్యాక్‌పై ఆధారపడింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ 29.2kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, ఇది ARAI క్లెయిమ్ చేసిన 320కిమీ పరిధిని అందిస్తుంది. సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కార్ AC మరియు DC ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలు రెండిటితో వస్తుంది. కానీ eC3 ఏ స్థాయిలో ఫాస్ట్ ఛార్జింగ్ؚ అవుతుంది అనే విషయాన్ని ఈ బ్రాండ్ పేర్కొనలేదు. ఇటీవల ఈ EVపై వాస్తవ-ప్రపంచ ఛార్జింగ్ టెస్ట్ నిర్వహించాము మరియు క్రింది విషయాలను కనుగొన్నాము.
DC ఫాస్ట్ ఛార్జింగ్
మా పరీక్ష కోసం, eC3ని 120kW ఫాస్ట్ ఛార్జర్ؚతో ఛార్జ్ చేశాము, ఆ సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ 65 శాతంగా ఉంది. ఛార్జింగ్ రేటు మరియు 65 నుండి 95 శాతం వరకు ఛార్జింగ్ టైమ్ క్రింద పట్టికలో వివరించబడ్డాయి:
ఛార్జింగ్ శాతం |
ఛార్జింగ్ రేటు |
సమయం |
65 నుండి 70 శాతం |
25kW |
4 నిమిషాలు |
70 నుండి 75 శాతం |
22kW |
4 నిమిషాలు |
75 నుండి 80 శాతం |
22kW |
4 నిమిషాలు |
80 నుండి 85 శాతం |
16kW |
7 నిమిషాలు |
85 నుండి 90 శాతం |
16kW |
6 నిమిషాలు |
90 నుండి 95 శాతం |
6kW |
20 నిమిషాలు |
ముఖ్యాంశాలు
-
కారు MID 65 శాతం ఛార్జింగ్ వద్ద 135 కిమీ డ్రైవింగ్ పరిధిని చూపించింది. ఈ బ్యాటరీ స్థాయిలో, eC3 25kW రేటు వద్ద ఛార్జింగ్ అయ్యింది, మేము పరిశీలించలిన వాటిలో అత్యధికమైనది ఇదే. 65 నుండి 70 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 4 నిమిషాలు పట్టింది.
-
70 శాతం ఛార్జింగ్ వద్ద, ఛార్జింగ్ రేటు 22kWకు తగ్గింది, బ్యాటరీకి మరొక 5 శాతం పవర్ జోడించడానికి సుమారుగా 4 నిమిషాలు పట్టింది. 80 శాతం వరకు ఛార్జింగ్ అదే రేటుతో కొనసాగింది.
-
80 శాతానికి చేరుకున్న తరువాత, ఛార్జింగ్ రేటు 16kWకు తగ్గింది, మరొక 10 శాతం ఛార్జింగ్ؚను జోడించడానికి 11 నిమిషాలు పట్టింది.
-
90 నుండి 95 శాతానికి, ఛార్జింగ్ రేటు 6kWకు తగ్గింది, బ్యాటరీకి మరొక 5 శాతం జోడించడానికి 20 నిమిషాలు పట్టింది.
-
బ్యాటరీ ఛార్జింగ్ 95 శాతం ఉన్నప్పుడు ఛార్జింగ్ కేబుల్ؚను తొలగించాము, అప్పుడు కారు 218కిమీ పరిధిని చూపించింది, ఇది పూర్తి ఛార్జింగ్ వద్ద క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ పరిధి కంటే 100కిమీ పైగా తక్కువ.
ఇది కూడా చదవండి: సరికొత్త, అనేక ఫీచర్‌లతో షైన్ వేరియెంట్ؚతో పాటు BS6 ఫేస్ 2 నవీకరణను పొందిన సిట్రోయెన్ C3 టర్బో వేరియెంట్ؚలు
ఛార్జింగ్ స్పీడ్ ఎందుకు తగ్గింది?
పరీక్ష ఫలితాల ప్రకారం, బ్యాటరీ శాతం 80 శాతానికి తగ్గినప్పుడు ఛార్జింగ్ పవర్ తగ్గుతుంది. ఇది ఎందుకంటే, DC ఫాస్ట్ ఛార్జర్ؚతో ఛార్జ్ చేసినప్పుడు బ్యాటరీ వేడెక్కడం మొదలవుతుంది. నిరంతర అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ ఆరోగ్యానికి మంచివి కాదు కాబట్టి, ఛార్జింగ్ నెమ్మదిగా కావడం, బ్యాటరీ అధికంగా వేడెక్కడాన్ని మరియు దాని జీవితకాలాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా, అనేక సెల్స్ؚను కలిపి ఈ బ్యాటరీ ప్యాక్ తయారుచేయబడింది. నెమ్మదిగా ఛార్జింగ్ కావడం కూడా, అన్ని సెల్స్ؚకు ఛార్జింగ్ సమానంగా పంపిణీ జరగడంలో సహాయపడుతుంది.
15A సాకెట్ؚతో ఛార్జింగ్
eC3 బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 15A సాకెట్ؚను ఉపయోగించాము. నిర్దిష్ట బ్యాటరీ స్థాయి వద్ద MIDలో చూపిన ఛార్జింగ్ టైమ్ క్రింద పేర్కొనబడింది:
బ్యాటరీ శాతం |
అంచనా ఛార్జింగ్ సమయం (80% వరకు) |
1 శాతం (ప్లగ్ ఇన్) |
8 గంటలు మరియు 20 నిమిషాలు |
10 శాతం |
8 గంటలు |
15A హోమ్ ఛార్జర్ؚతో ఛార్జ్ చేసినప్పుడు, బ్యాటరీ 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి పట్టే అంచనా సమయం, కార్ MIDలో చూపినట్లు ఖచ్చితంగా ఎనిమిది గంటలు. ఈ గణాంకాల ప్రకారం, దీని ఛార్జింగ్ రేటు సుమారుగా గంటకు 8.5 నుండి 9 శాతం ఉంటుంది.
పవర్ؚట్రెయిన్ వివరాలు
సిట్రోయెన్ 29.2kWh బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడుతుంది, ఇది 57PS పవర్ మరియు 143Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని పోటీదారులు విధంగా కాకుండా, ఈ సిస్టమ్ లిక్విడ్ కూల్డ్ కాకుండా ఎయిర్ కూల్డ్, బహుశా అందుకే ఇది ఫాస్టర్ ఛార్జింగ్ؚకు మద్దతు ఇవ్వలేదు.
ధర & పోటీదారులు
eC3, టాటా టియాగో EV మరియు టాటా టిగోర్ EVలతో పోటీ పడుతుంది. దీన్ని MG కామెట్ EVకి అతి పెద్ద ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. దీన్ని ప్రస్తుతం రెండు వేరియెంట్ లలో అందిస్తున్నారు, ధర రూ.11.50 లక్షల నుండి రూ.12.76 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. eC3 పోటీదారుల ధరలను కూడా పోల్చి, ఈ కథనంలో వివరంగా అందించాము.
ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ eC3 ఆటోమ్యాటిక్