• English
  • Login / Register

2016 ఫోర్డ్ మస్టాంగ్ జీటీ350 మరియూ జీటీ 350ఆర్ యొక్క ధరలు

ఫోర్డ్ ముస్తాంగ్ 2016-2020 కోసం manish ద్వారా ఆగష్టు 12, 2015 01:29 pm ప్రచురించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 2016 ఫోర్డ్  మస్టాంగ్ యొక్క సమాచారం మరియూ ధరలు ఇప్పుడు లైవ్ లో లభ్యమవుతున్నాయి. జీటీ350 49,995 డాలర్లకు మరియూ రేసింగ్ కారు అయిన జీటీ350ఆర్ 63,495 డాలర్లకు ధరను నియమించారు. జీటీ350 కి రెండు ఆప్షన్లు ఉన్నాయి: టెక్నాలజీ ప్యాకేజ్ మరియూ ట్రాక్ ప్యాకేజ్. టెక్నాలజీ ప్యాకేజ్ ధర 7500 డాలర్లు-ఇందులో సింక్ 3, ఒక గ్యారేజ్ డోర్ ఓపెనర్, నావిగేషన్, నాలుగు వే ల హెడ్ రెస్ట్స్ తొ కూడిన డ్యువల్ పవర్ సీట్లు మరియూ క్లైమేట్ కంట్రోల్,  ఏడు స్పీకర్ల ఆడియో సిస్టము శాటిలైట్ రేడియో తో, మాగ్నె రైడ్, హేవీ-డ్యూటీ ముందు వైపు స్ప్రింగులు, ఫోర్డ్ వారి అనుసంధాన డ్రైవర్ కంటృఓల్ సిస్టము, టర్న్-సిగ్నల్ అద్దాలు మరియూ డ్యువల్ జోన్ ఆ ఆటోమాటిక్ టెంపరేచర్ కంట్రోల్ కలిగి ఉంది. ట్రాక్ ప్యాకేజ్ లో, హెవీ డ్యూటీ ముందు వైపు స్ప్రింగులు, మాగ్నే రైడ్, అనుసంధానమైన డ్రైవర్ కంట్రోల్ సిస్టము, ఒక రేర్ డెక్లిడ్ స్పొఇలర్, ఇంజిను ఆయిల్ కూలర్ మరియూ స్ట్రట్-టవర్ బ్రేస్ ని కలిగి ఉంటుంది. 

జీటీ350 ని పసుపు రంగులో కావాలంటే, 495 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అదే వేరే ఏదైన రందు, అంటే, ఎరుపు, లేత లేదా ముదురు బూడిద రంగు, నలుపు, నారింజ రంగు, నీలం మరియూ తెలుపు రంగులకై ఎటువంటి ఖర్చూ ఉండబోదు. ఒక ఆప్షనల్ బ్లాక్ రూఫ్ కి 695 డాలర్లు మరియూ రేసింగ్ స్ట్రిప్స్ కి 475 డాలర్లను వెచ్చించాలి. ఈ స్టైప్స్ ని తెలుపు,నలుపు (తెలుపు అంచులతో) లేదా నీలం (నలుపు అంచులతో) పొందవచ్చు. 

ఆర్ వేరియంట్ కి కొన్ని ఆప్షన్లనే ఇవ్వడం జరిగింది. ఈ స్టాండర్డ్ ఆర్ మోడల్ ఉ స్టాండర్డ్ జీటీ350 మోడలు ఆధారితమైంది, కాబట్టి 3000 డాలర్ల గల ఎలక్ట్రానిక్ ప్యాకేజీ తో కస్టమర్ కి ఆడియో సిస్టము, సింక్ 3, డ్యూవల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్, టర్న్-సిగ్నల్ అద్దాలు, రేర్ వ్యూ క్యామెరా, ఆగ్జిలారీ గాజ్ లు, టైర్ సీలెంట్ మరియూ ఇంఫ్లేటర్ కలిగిన మొబిలిటీ కిట్, ఫ్లోర్ మ్యాట్స్ మరియూ ఒక గ్యారేజ్-డోర్ ఓపెనర్ వంటి కొత్త కొత్త సౌకర్యాలు కలిగి ఉంది.   

జీటీ350 కి వచ్చిన రంగులే జీటీ350ఆర్ కి కూడా ఇవ్వబడతాయి. "టృఇప్పుల్ యెల్లో" అనగా పసుపు రంగు మాత్రమే అధిక ధర వెచ్చించి పొందే రంగు. రేసింగ్ స్ట్రిప్స్ ధర 475 డాలర్లు మరియూ తెలుపు, నలుపు లేదా నీలం కి ఎరుపు అంచులను కూడా పొందవచ్చు. అత్యంత ఖరీదు గల జీటీఆర్ ని పసుపులో ఒక నలుపు రూఫ్ తో, టెక్నాలజీ ప్యాకేజీ మరియూ రేసింగ్ స్టృఇప్స్ కలిపి 66,860 డాలర్ల ధర కి లభ్యమవుతుంది. పైన తెలుపబడిన ధరలన్ని డీలర్ ధరను కలపకుండా ఉన్నవి. 

was this article helpful ?

Write your Comment on Ford ముస్తాంగ్ 2016-2020

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience