ప్రీమియం ఎస్యువి లకు పునర్జన్మ: ఎండీవర్, ఫార్చ్యూనర్ మరియు పజెరో స్పోర్ట్
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం raunak ద్వారా ఆగష్టు 04, 2015 11:11 am సవరించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వచ్చే ఏడాది మధ్యలో నాటికి మేము , కొత్త మిత్సుబిషి పజెరో స్పోర్ట్, టయోటా ఫార్చ్యూనర్ మరియు పురాతన పోటీదారు - ఫోర్డ్ ఎండీవర్ ని పొందుతామా!
జైపూర్ :
ఫోర్డ్ ఎండీవర్ భారతదేశంలో ప్రీమియం ఎస్యూవీ స్పేస్ లో 2003 లో ప్రవేశించింది. ప్రస్తుతం అది ప్రవేశించి 12 సంవత్సరాలు అయ్యింది. టయోటా ఫార్చ్యూనర్ 2009లో ప్రవేశించగా, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ దేశంలో 2010 లో ప్రవేశించింది. వచ్చే సంవత్సరం మధ్యలో లేదా అంత కంటే ముందే, వీటి తరువాత తరాలు రోడ్ పై ప్రవేశించవచ్చు. మొట్టమొదటి గా ఈ మూడిటిలో ముందుగా ఫోర్డ్ ఎండీవర్ కొన్ని నెలలలో వచ్చే అవకాశం ఉంది. ఈ మిగిలిన రెండు ఫార్చ్యూనర్ మరియు పజెరో స్పోర్ట్ వచ్చే ఏడాది ప్రారంభించటానికి అవకాశం ఉంది.
ఫోర్డ్ ఎండీవర్
ఈ మూడిటిలో ఎండీవర్ ప్రస్తుతం దాని విభాగంలో పాతది మరియు ఇది మిగిలిన రెండిటి కంటే, ముందుగా వచ్చే అవకాశం ఉంది. మేము ఇటీవల థాయిలాండ్ లో కొత్త ఎండీ ని నడిపాము. ఇది త్వరలోనే పండగ సీజన్లో రాబోతుందని ఊహిస్తున్నాము.
ఈ కొత్త ఎండీ ఈ విభాగంలో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్పత్తి , బ్రాండ్ కొత్త డీజిల్ ఇంజిన్లు మరియు మొదటి టెర్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో నవీకరించిన 4 వీల్ డ్రైవ్ వ్యవస్థ తో రాబోతున్నది. దీనిలో కొత్త డీజిల్ ఇంజిన్లు 2.2 లీటర్ 4-సిలిండర్ యూనిట్ మరియు ఒక మొదటి విభాగంలో 3.2 లీటర్ ఐదు సిలిండర్ ఇంజన్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ ఎంపికలు ఆటోమేటిక్ 6-స్పీడ్ పాటు ప్రామాణిక 6-స్పీడ్ మాన్యువల్ కలిగి ఉంటుంది.
మిత్సుబిషి పజెరో స్పోర్ట్
మిత్సుబిషి దాని తదుపరి తరం పజెరో స్పోర్ట్ ని కొద్ది రోజుల క్రితం బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఇది లోపల మరియు బయట అనేక మార్పులతో రాబోతున్నది. దీని ముఖ భాగంతో మొదలు పెడితే, కంపెనీ కొత్త "డైనమిక్ షీల్డ్ " డిజైన్ తో రాబోతున్నది. ఊహించినట్టుగానే, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ ప్రథమంగా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో ఒక కొత్త 2.4ఎల్ ఎం ఐవి ఇ సి టర్బో డీజిల్ ఇంజన్ చేత శక్తినివ్వబడినదని వెల్లడించింది. శక్తి విషయాలు ఇంకా బయట పడలేదు కానీ ట్రిటోన్ ఇంజిన్ పికప్ 180hp మరియు 430Nm టార్క్ ని అందిస్తుందని అంచనా. అంతేకాక, మిత్సుబిషి కూడా మొదటిసారి పజెరో స్పోర్ట్ ని ఒక 'ఆఫ్ రోడ్ మోడ్' కోసం అందించింది.
టయోటా ఫార్చ్యూనర్
టయోటా ఇటీవల ఆస్ట్రేలియా మరియు థాయిలాండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో రెండవ తరం ఫార్చ్యూనర్ ని పరిచయం చేసింది. టయోటా ఫార్చ్యూనర్ పాత కాలపు వాహనంలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫార్చ్యూనర్ కొత్త లుక్ తో ఆకర్షణీయంగా రాబోతున్నది. పైన చెప్పుకున్న రెండిటిలానే ఫార్చ్యూనర్ 6-స్పీడ్ ఆటో తో పాటు ప్రామాణిక 6-స్పీడ్ మాన్యువల్ సిస్టమ్ తో అమర్చబడిన 2.8 లీటర్ మరియు 2.4 లీటర్ ఆయిల్ బర్నర్స్ తో రాబోతున్నది.