• English
  • Login / Register

పోలో జీటీఐ భారతీయ రోడ్లపై కంటపడింది, కాని ప్రకటించబడలేదు

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం nabeel ద్వారా ఆగష్టు 13, 2015 10:45 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫోల్క్స్వాగెన్ వారు భారతీయ రోడ్లపై పోలో జీటీ ని నడిపిస్తూ భారతీయులని ఉవ్విళ్ళూరే లా చేస్తున్నారు. ఈ కారు దేశం లోని ఎన్నో ప్రదేశాలలో పరీక్షించబడుతూ కనపడింది. కాని ఇప్పటి వరకు అయితే ఈ జర్మన్ ఆటో బ్రాండ్ వారి దగ్గర నుండి ఎటువంటి అధికారిక ప్రకటణ రాలేదు. పోలో జీటీఐ వారి మునుపటి పోలో కంటే కూడా వేగవంతమైనది మరియూ ఇది విడుదల అయితే కనుకా, ఇది అబార్త్ పుంటో ఈవో ని కూడా వెనక్కు నెట్టేస్తుంది. దీనికి ప్రస్తుతం స్కోడా ఆక్టేవియా లో మరియూ భారతీయ ఆడీ ఏ3 లో ఉన్న భారీ 1.8-లీటరు 'ఈఏ888' టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిను ఉంది. ఇది 190బీహెచ్పీ శక్తి ని మరియూ 6-స్పీడ్ టృఆన్స్మిషను తో కూడితే కనుక 320ఎనెం యొక్క టార్క్ ని, అదే 7-స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ తో కూడితే 250ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా, ఇది గంటకి 0 నుండి 100 కీ.మీ ఒక సెకను లో చేరుకోవడమే కాకుండా గంటకి 230 కీ.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

దీనికి పెద్ద ఆలోయ్ వీల్స్, కొద్దిగా ముందు మరియూ వెనక వైపు బంపర్లకు విశిష్ట పక్క దిమ్మెలు మరియూ తేనె పట్టు డిజైన్ గల ముందు గ్రిల్లు ఉన్నాయి. జీటీఐ బ్యాడ్జ్ ని ముందు గ్రిల్లుపై మరియూ బూట్ లిడ్ పై పెట్టబడింది. లోపల వైపుకి వెలితే గనుక కొత్త స్టీరింగ్ వీల్ మరియూ స్పోర్టీ బకెట్ సీట్లు మరియూ అల్లూమినియం పెడల్స్ ని కలిగి ఉంది.

విడుదల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి, ఈ వాహనం ఈ దీపావళి పండుగ సమయానికి రావచ్చు అని అనుకోవచ్చు. కారు ఔత్సాహికులకు తప్ప ఇది మిగతా వారిని అంతగా ఆకర్షిణ్చక పోవచ్చును ఎందుకంటే, దీని ధర భారీగా ఉండవచ్చు. పోలో జీటీఐ భారతీయ సీబీయూ కాటిగరీ లోకి వస్తుంది మరియూ దాదాపుగా రూ.18 నుండి రూ.20 లక్షల వరకు పలకవచ్చును.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volkswagen పోలో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience