రోజుకు 250 మారుతి ఫ్రాంక్స్ؚ బుకింగ్‌లను అందుకుంటున్నాము అని వెల్లడించిన శశాంక్ శ్రీవాస్తవ
మారుతి ఫ్రాంక్స్ కోసం ansh ద్వారా ఫిబ్రవరి 17, 2023 01:04 pm ప్రచురించబడింది
- 59 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ సబ్ؚకాంపాక్ట్ క్రాస్ؚఓవర్ ఐదు వేరియెంట్‌లలో, రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో వస్తుంది
- జనవరిలో జరిగిన ఆటో ఎక్స్ؚపో 2023 తరువాత ఫ్రాంక్స్ బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి
-
రోజూకు 250 నుండి 350 బుకింగ్ؚలను అందుకుంటుంది, ఇప్పటికే 6,500 ముందస్తు ఆర్డర్‌లను పొందింది.
-
రూ.11,000 ముందస్తు చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చు.
-
1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి.
-
కొత్త బాలెనోలో ఉన్న ఫీచర్‌లను ఇందులో కూడా కొనసాగించారు కానీ ఇంటీరియర్ భిన్నంగా ఉంటుంది.
-
ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా.
మారుతి ఆటో ఎక్స్ؚపో 2023లో ఫ్రాంక్స్ؚను ఆవిష్కరించింది, అదే రోజు నుండి బుకింగ్ؚలను కూడా ప్రారంభించింది. ఫ్రాంక్స్ 6,500 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకున్నదని, సగటున రోజుకు 250 నుండి 350 బుకింగ్ؚలు అందుకుంటున్నాము అని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఇటీవల వెల్లడించారు.
బోనెట్ؚ క్రింద ఏముంది
ఐదు వేరియెంట్‌లలో లభించే ఫ్రాంక్స్ؚ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో పొందవచ్చు. వీటిలో మొదటిది సుపరిచితమైన 1.2-లీటర్ యూనిట్, ఇది 90PS, 113Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది, ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఐదు-స్పీడ్‌ల AMTతో జత చేయబడింది. రెండవది మళ్ళీ తిరిగి వచ్చిన 1.0-లీటర్ టర్బో ఛార్జెడ్ బూస్టర్ؚజెట్ ఇంజన్, ఇప్పుడు 100PS, 149Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది, ఇది ఐదు-స్పీడ్‌ల మాన్యువల్, ఆరు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌తో వస్తుంది.
ఫీచర్‌ల జాబితా
ఫ్రాంక్స్ ఫీచర్‌లలో వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో తొమ్మిది-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమెట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), 360 డిగ్రీల కెమెరాతో సహా చాలా వరకు బాలెనోలో ఉన్న ఫీచర్‌లనే ఇందులో చూడవచ్చు, కొత్త ఫీచర్‌లలో వైర్ؚలెస్ ఫోన్ చార్జర్, పాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి. గ్రాండ్ విటారా SUV ప్రేరణతో అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ముందు మరియు వెనుక భాగంలో ప్రీమియం డిజైన్ అలాగే ఇదే హ్యాచ్‌బ్యాక్ నుండి ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్టైలింగ్‌ను కూడా కలిగి ఉంది.
అంచనా ధర మరియు పోటీదారులు
కారు తయారీదారులు ఫ్రాంక్స్ؚను రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్చిలో విడుదల చేయవచ్చు. మారుతి నుండి వస్తున్న ఈ తాజా సబ్ؚకాంపాక్ట్ కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ؚలకు పోటీ ఇస్తుంది, ఇది మారుతి బ్రెజ్జాకు ప్రత్యామ్నాయం కానుంది.
ఇది కూడా చదవండి: మరింత సురక్షితంగా, 3 డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలతో రానున్న మారుతి సియాజ్
0 out of 0 found this helpful