నిస్సాన్ వారు X-ట్రెయిల్ హైబ్రిడ్ ను 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు
నిస్సాన్ ఎక్స్ కోసం manish ద్వారా ఫిబ్రవరి 04, 2016 05:18 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.
గ్రేటర్ నొయిడాలో కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పో లో జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ తమ X-ట్రెయిల్ హైబ్రిడ్ ఎస్యువి ని ప్రదర్శించారు. ఈ వాహనం తన ముందుతరం నాటి X-ట్రెయిల్ కి కొనసాగింపుగా ప్రవేశపెడుతున్నారు. 2004 నుండి 2014 మధ్యలో విజయవంతంగా 10 సంవత్సరాలలో నడిచిన ఈ వాహనం అమ్మకాల తగ్గుదల దృష్ట్యా నిలిపివేయబడింది.
ఒక 40.8PS ఎలక్ట్రిక్ మోటార్ ని కలిగిన 2.0 లీటర్ MR20 DD పెట్రోల్ వాహనం ఈ ఎస్యువి. ఇది 184.8Ps సామర్ధ్యాన్ని 360Nm గరిష్ట టార్క్ తో అందిస్తుంది. పవర్ప్లాంట్ వ్యవస్థ CVT గేర్బాక్స్ తో లభిస్తుంది.
కళాత్మకంగా ఈ కొత్త X-ట్రెయిల్ ఎంతో మార్పు చేయబడింది. ఎవరైనా సులభంగా ఈ వాహనం 'Vమోషన్' గ్రిల్ ను మరియు పలుచగా ఉన్న కొత్త హెడ్ల్యాంప్ క్లస్టర్ ను గమనించి ఇది తెలుసుకోవచ్చు. హెడ్ల్యాంప్స్ వ్యవస్థ LED DRLs ను కలిగి మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో పూర్తి LED హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉండబోతుంది.
విశేషాలకు వస్తే 2016 X-ట్రెయిల్ ఆక్టివ్ రైడ్ కంట్రోల్ ని కలిగి ఆటో హెడ్లైట్స్ ను కలిగి ఉండబోతుంది. అయితే కేవలం టాప్ రేంజ్ మోడల్స్ లో మాత్రం హీటెడ్ డోర్ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ లెథర్ సీట్స్,ఆటోమెటిక్ వైపర్స్, క్రూజ్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి 18 అంగుళాల అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది, తద్వారా ఈ వాహనం ఖరీదు కి తగిన విలువను వినియోగదారులకు అందించగలుగుతుంది.