• English
  • Login / Register

Magnite Kuro ప్రత్యేక ఎడిషన్ؚను ఆవిష్కరించిన Nissan, బహిర్గతమైన మాగ్నైట్ AMT

నిస్సాన్ మాగ్నైట్ 2020-2024 కోసం anonymous ద్వారా అక్టోబర్ 05, 2023 04:10 pm సవరించబడింది

  • 128 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కోసం నిస్సాన్, ICCల మధ్య సహకారంలో భాగంగా మాగ్నైట్ కురో ఎడిషన్ రూపొందించబడింది

Nissan Unveils Magnite Kuro Special Edition, Magnite AMT Also Showcased

  • మాగ్నైట్ కురో లోపల మరియు వెలుపల పూర్తి నలుపు రంగు థీమ్ؚతో వస్తుంది. 

  • నలుపు రంగు గ్రిల్, అలాయ్ؚలు మరియు డోర్ హ్యాండిల్ؚలు, ఎరుపు రంగు కురో బ్యాడ్జింగ్ మరియు బ్రేక్ క్యాలిపర్స్ؚలను పొందుతుంది. 

  • నిస్సాన్ ఈ SUVని 1-లీటర్ N/A పెట్రోల్ ఇంజన్‌తో AMT గేర్‌బాక్స్‌తో అందిస్తుంది.

  • నిస్సాన్ ఇప్పటికే మాగ్నైట్ 1-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ తో CVT ఎంపికను అందిస్తున్నది.

  • AMT వేరియెంట్ؚల ధర వాటి తోటి మాన్యువల్ వేరియెంట్ؚలతో పోలిస్తే సుమారు రూ.55,000 ఎక్కువ ఉండవచ్చు. 

 భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్‌ను కురో ఎడిషన్‌లో ప్రదర్శించారు. ప్రత్యేక ఎడిషన్ؚతో పాటుగా దీని కొత్త AMT వర్షన్ కూడా ఆవిష్కరించారు. ప్రారంభంకానున్న మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 కోసం నిస్సాన్ మరియు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మధ్య సహకారం కారణంగా కురో ఎడిషన్ రూపొందింది. ఈ రెండు మోడల్‌ల విక్రయాలు అక్టోబర్ؚలో నెలలో ప్రారంభం కావచ్చని అంచనా. 

ఈ SUV ప్రత్యేక ఎడిషన్ స్టెల్తీ బ్లాక్ రంగులో నలుపు రంగు గ్రిల్, అలాయ్ؚలు, మరియు ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్ؚలతో వస్తుంది. ముందు ఫెండర్ؚలపై కురో బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.

Nissan Unveils Magnite Kuro Special Edition, Magnite AMT Also Showcased

లోపలి వైపు కూడా పూర్తి నలుపు రంగు డిజైన్‌ను కలిగి ఉంటుంది. నలుపు రంగు ట్రీట్మెంట్ సీట్ కవర్‌లు, డోర్ హ్యాండిల్ؚలు, స్టీరింగ్ వీల్ మరియు AC వెంట్ؚలపై కూడా కొనసాగించారు.

కురో ఎడిషన్ మాగ్నైట్ హయ్యర్-ఎండ్ వేరియెంట్‌పై ఆధారపడింది కాబట్టి ఇది 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, 360-డిగ్రీల కెమెరా మరియు రేర్ AC వెంట్ؚలతో వస్తుంది. 

ఇది కూడా చూడండి: ఇప్పుడు తమ లైన్ؚఅప్ అంతటా 6 ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా అందిస్తున్న హ్యుందాయ్

మాగ్నైట్ కురో ఎడిషన్ పవర్‌ట్రెయిన్ ఎంపికలను నిస్సాన్ వెల్లడించలేదు, అయితే కంపెనీ అందుబాటులో ఉన్న అన్నీ ఎంపికలను అందించవచ్చు. మాగ్నైట్ SUVలో AMT గేర్‌బాక్స్ ఎంపికను కూడా నిస్సాన్ వెల్లడించింది. ఇది 1-లీటర్ N.A పెట్రోల్ ఇంజన్ؚతో జోడించబడింది. ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ؚను రెండు ఇంజన్ ఎంపికలలో అందిస్తుంది: 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMTతో జోడించిన 1-లీటర్ N/A (72PS/96Nm) మరియు మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్సుల ఎంపికతో వచ్చే 1-లీటర్ టర్బో-పెట్రోల్ (100PS/160Nm).

AMT ధర ప్రస్తుతానికి వెల్లడించలేదు, అయితే మాన్యువల్ వేరియెంట్ తో పోలిస్తే సుమారు రూ. 55,000 ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్ర XUV300, కియా సోనెట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటితో మాగ్నైట్ పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఆన్ؚరోడ్ ధర 

was this article helpful ?

Write your Comment on Nissan మాగ్నైట్ 2020-2024

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience