2016 ఆటో ఎక్స్పో లో నిస్సాన్ జిటి-ఋ బహిర్గతం అయ్యింది
నిస్సాన్ జిటిఆర్ కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 04, 2016 02:41 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిస్సాన్ వారు తమ యొక్క జిటి-ఆర్ వాహనాన్ని జరుగుతున్న డిల్లీ ఆటో ఎక్స్పో లో ప్రవేశపెట్టారు. ఈ వాహనం యొక్క అధికారిక ప్రదర్శన సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. నిస్సాన్ యొక్క ఈ వాహనం వారి యొక్క కల ఉత్పత్తిగా పేర్కొనడం వలన ఆటో ఎక్స్పోలో ఇది అనదరి ఆకర్షణను చూరగుంది. జిటి-ఆర్ అధికా యాక్సిలరేషన్ పేరొంద్ఫిన వాహనం. జరుగుతున్న ఎక్స్పోలో ఈ వాహనం ఆడీ యొక్క ఋ8 కి ప్రత్యర్ద్ధిగా నిలుస్తుంది. భారతదేశంలో ప్రవేశించినట్లయితే ఈ వాహనం రూ.21 కోట్ల ధరతో ఆడీ ఋ8 మరియు పోర్చే 911 వాహనాలకు పోటీగా ఉండబోతుంది.
ఈ వాహనం 36.8 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్ ని కలిగి 554bhp సామర్ధ్యంతో 6400rpm ని కలిగి మరియు 632Nm టార్క్ ని 3200 నుంచి 5800rpm మధ్య అందిస్తుంది. ఈ వాహనం యొక్క శక్తి ఒక 6 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఇండిపెండెంట్ ట్రాన్స్ ఆక్సిల్ 4WD సామర్ధ్యంతో అందుతుంది. జిటి-ఆర్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2 సెకెన్లలో చేరుకోగలదు. అంతేకాకుండా 315.4Kmph అధిక వేగన్ని ఈ వాహనం అందుకోగలదు. ఈ వాహనం అత్యధిక డ్రాగ్ కోయిఫిషియెంట్ 0.26గా కలిగి అత్యుత్తమ ఏరోడైనమిక్ కారు గా తయారుచేయబడింది. పెద్ద ముందరి భాగంతో బ్లాక్ గ్రిల్స్ ని కలిగి ఈ జిటి-ఆర్ వాహనం ప్రత్యేఖమైన జపనీస్ కారుగా మనకి కనిపిస్తుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగం మరింత స్పోర్టీరియర్ రూపు రేఖలతో ఉండి అధిక వేగంలో కూడా మంచి ట్రాక్షన్ ని అందించగలుగుతుంది. వెనుకభాగంలో రౌండ్ టెయిల్ లైట్స్ ని కలిగి నాలుగు ఎగ్జాస్ట్ టిప్స్ ని కలిగి ఉండబోతుంది.
కారు అంతర్భాగం ఎన్నో నవీకరణలతో తయారుచేయబడింది. గేర్ లివర్ వెనకాతల పుష్ బటన్ కూడా అమర్చారు. కారు డాష్బోర్డ్ మీద A.C మరియు మ్యూజిక్ వ్యవస్థలకు మరియు అన్ని మెకానికల్ విశేషాలను అందించడానికి ఒక పెద్ద డిస్ప్లే ను కూడా అమర్చడం జరిగింది. ఇన్స్టృమెంటల్ క్లస్టర్ ఎనలాగ్ మరియు డిజిటల్ విశేషాలను కలిగి ఉంటుంది. ఎనలాగ్ వ్యవస్థ కార్నరింగ్, యాక్సిలరేషన్ మరియు జి-ఫోర్స్ సమాచారాన్ని అందించగలుగుతుంది.