తదుపరి తరం బిఎండబ్లు 7-సిరీస్ ఆటో ఎక్స్పో 2016 వద్ద ఆవిష్కరించబడనున్నది
published on జనవరి 08, 2016 12:31 pm by saad కోసం బిఎండబ్ల్యూ 7 సిరీస్ 2015-2019
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త బిఎండబ్లు తేలికగా, మరింత విలాసవంతమైన, అత్యాధునిక టెక్నాలజీ మరియు తదుపరి తరం పవర్ ట్రైన్లను కలిగి ఉంది
రాబోయే ఆటో ఎక్స్పో 2016 కొత్త కారు ప్రారంభాలకు వేధికగా ఉండనున్నది. బిఎండబ్లు అంచనాలకు మించి మరింత లగ్జరీ, మంచి పనితీరు అలానే ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం గల వాహనాలను విజయవంతంగా అందిస్తుంది. ఈ విజయ పరంపర కొనసాగడానికి ఈ బిఎండబ్లు తన యొక్క ఉన్నత వినియోగదారుల కోసం గత సంవత్సరం కొత్త 7-సిరీస్ ని వెల్లడించింది. ఈ తాజా లగ్జరీ, విభాగంలో ఒక బెంచ్మార్క్ గా ఉండనుంది మరియు ఇండియన్ ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శితం కానున్నది.
ఈ ఆరవతరం మోడల్ చాలా ఆకర్షణీయంగా ఉంది దీనికి గానూ ఆధునిక రూపకల్పన మరియు వినూత్న సాంకేతిక విలీనం చేసిన వారికి ధన్యవాదాలు. 2016 BMW 7-సిరీస్ ఒక కొత్త వేదిక మీద అల్యూమినియం, స్టీల్ మరియు ప్లాస్టిక్ కలిపియున్న కార్బన్ ఫైబర్ శరీర నిర్మాణంతో ఉండి 130 కిలోలు బరుని తక్కువగా కలిగి ఉంది.
ఒక BMW కార్ లో మొదటిసారి
- హస్త సంకేతం కంట్రోల్ తో 5.0 iDrive
- డ్రైవర్ జోక్యం లేకుండా అటానమస్ పార్కింగ్
- కార్బన్ ఫైబర్ శరీర నిర్మాణం కలిగిన మొదటి కారు
- RWD CLAR (క్లస్టర్ ఆర్కిటెక్చర్) ఆధారంగా ఉన్నమొట్టమొదటి BMW
- నాలుగు చక్రాల స్టీరింగ్
ముఖ్యమైన అంశాలు
- ఎయిర్ ఫ్లాప్ కంట్రోల్ తో ఉన్న కిడ్నీ ఆకరపు గ్రిల్. ఆప్షనల్ లేజర్ లైట్లు తో వస్తుంది.
- LED యూనిట్లు తో అమర్చబడియున్న హెడ్ల్యాంప్స్ మరియు టైల్లాంప్స్
- 18-21 అంగుళాల పరిమాణాలతో నుండి మొదలుకొని అలాయ్ వీల్స్
- డ్రైవింగ్ రీతులు ప్రకారం రంగులు మార్చే 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.
- ప్రామాణిక నాలుగు-జోన్ వాతావరణ నియంత్రణ, హీటెడ్ ముందు సీట్లు మరియు వైర్లెస్ ఛార్జింగ్.
- లగ్జరీ వెనుక సీట్ ప్యాకేజిని ఎంచుకున్నట్లయితే మీరు 7 అంగుళాల comand టాబ్లెట్ పొందుతారు, హీటెడ్ ఫ్రంట్ మరియు రేర్ ఆర్మ్ రెస్ట్, మసాజ్ ఫంక్షన్..మొదలుగొనవి.
- వెనుక ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీటింగ్ ఎంచుకున్నట్లయితే మరింత సౌకర్యం మరియు స్థలం పొందవచ్చు. స్కై లాంజ్ పనోరమా గ్లాస్ పైకప్పు, మసాజ్ ఫంక్షన్, స్మార్ట్ఫోన్ హోల్డర్, హెడ్ అప్ డిస్ప్లే, సర్దుబాటు వెనుక ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, ఫోల్డ్ అవుట్ టాబ్లెట్, 7-అంగుళాల టచ్స్క్రీన్ టాబ్లెట్ వంటి ఇతర కొన్ని లగ్జరీ లక్షణాలు.
- ABS మరియు ఎయిర్ బాగ్స్ వంటి ప్రముఖ భద్రతా లక్షణాలతో పాటు, క్రాస్ ట్రాఫిక్ హెచ్చరికతో అమర్చబడియున్న కొత్త BMW 7-సిరీస్, చురుకుగా ఉన్న వైపు కొలిజన్ వ్యవస్థ, లేన్ నిష్క్రమణ హెచ్చరిక, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్ మొదలైన అంశాలను కలిగి ఉంది.
ఇంజిన్లు:
- డీజిల్: BMW 730d, B57 6-సిలిండర్ మోటార్ ద్వారా ఆధారితం చేయబడి 265PS పవర్ అందిస్తుంది.
- BMW 740i ఇంజిన్ 3.5 లీటర్ 6-సిలిండర్ ఇంజన్ తో ఆధారితం చేయబడి 326hp శక్తిని అందిస్తుంది మరియు BMW 750i 4.4 లీటరు V8 ట్విన్ టర్బో ఇంజన్ సాయంతో 444hp శక్తిని అందిస్తుంది.
కొత్త BMW 7-సిరీస్ స్థానికంగా కంపెని యొక్క చెన్నై ఉత్పాదక కేంద్రములో తయారు చేయబడుతుంది. సంస్థ 50 శాతం వరకూ భాగాల్ను తయారుచేసింది కనుక అది ఖచ్చితంగా ధరని ప్రభావితం చేస్తుంది.
ఇంకా చదవండి
BMW 7- సిరీస్ 'M' ట్రీట్మెంట్ అందుకుంది! 600 +hp ని అందించవచ్చు!
- Renew BMW 7 Series 2015-2019 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful