రూ. 72 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన ఆడీ Q7 ఫేస్‌లిఫ్ట్
ఆడి క్యూ7 2006-2020 కోసం nabeel ద్వారా డిసెంబర్ 14, 2015 03:07 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఆడి భారతదేశం లో దాని Q7 ఫేస్ లిఫ్ట్ ని నేడు ప్రారంభించనున్నది. మొదట్లో, వాహనం CBU మార్గం ద్వారా దిగుమతి అవుతుంది, స్థానిక ఉత్పత్తి 2016 మధ్య భాగంలో ఎక్కడో ప్రారంభమవుతుంది. కొత్త SUV తేలికది, వేగవంతమైనది మరియు మునుపటి వెర్షన్ కంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ కొత్త కారు ముందు దాని కంటే 37mm చిన్నది మరియు 15mm తక్కువ వెడల్పు కలిగి ఉంటుంది. ఈ కారు ఇప్పటికి కూడా మెర్సిడీస్ బెంజ్ జిఎల్-క్లాస్ , BMW X5 మరియు వోల్వో ఎక్స్ సి 90 కి పోటీగా ఉంటుంది. కానీ ప్రస్తుత నమూనా కంటే కొద్దిగా ఎక్కువగా ధర కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ కారు 333bhp శక్తిని, 3.0 TFSI సూపర్‌చార్జెడ్ V6 బ్లాక్ తో 440Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలానే ఇది 8-స్పీడ్ టిప్ట్రోనిక్ ట్రాన్సిమిషన్ తో 0-100 కిలోమీటర్లు కేవలం 6.3 సెకన్లలో చేరుకోగలుగుతుంది మరియు పాత Q7 కంటే 1.6 సెకన్ల వేగంతో వెళుతుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 250kmph అత్యధిక వేగాన్ని చేరుకుంటుంది మరియు ముందు దాని కంటే 300 కిలోలు తేలికైనదిగా ఉంటుంది.
కొత్త ఆడీ Q7 పునః రూపకల్పన చేయబడిన హెడ్‌ల్యాంప్స్ మధ్య ఒక పెద్ద గ్రిల్ ని కలిగి ఉంటుంది. కొత్త దీర్ఘచతురస్రాకార ఎల్ఇడి టెయిల్ లైట్ క్లస్టర్ కూడా పాత దానికంటే విభిన్నంగా మరియు కారు యొక్క వెనుక భాగాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కారు ముందు,వెనుక బంపర్స్ తో రీఫ్రెష్ లుక్ ని కలిగి ఉంది. చివరకి అంతర్భాగాలు కూడా వదలకుండా మార్పులు చేయబడి కొత్త మీడియా సెంటర్ నాబ్ మరియు గేర్ లెవర్ తో అందించబడుతుంది. ఇది కాకుండా ఈ ఫేస్‌లిఫ్ట్ Q7 బోస్ ఆడియో సిస్టమ్ తో కనెక్ట్ చేయబడిన సమాచార వినోద వ్యవస్థ, విద్యుత్ సర్దుబాటు తో లెథర్ సీట్లు, విస్తృత సన్రూఫ్, నాలుగు జోన్ క్లైమేట్ నియంత్రణ, టచ్‌ప్యాడ్, 360 డిగ్రీ కెమెరా, మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఆడీ యొక్క 'విర్టువల్ కాక్పిట్' డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
ఇంకా చదవండి