2024 లో భారతదేశంలో విడుదలకానున్న New-gen Skoda Superb
స్కోడా సూపర్బ్ కోసం ansh ద్వారా న వంబర్ 06, 2023 11:40 am ప్రచురించబడింది
- 225 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫ్లాగ్షిప్ స్కోడా సెడాన్ యొక్క ఎక్ట్సీరియర్ డిజైన్లో కొన్ని నవీకరణలే చేసినప్పటికీ, ఇంటీరియర్ డిజైన్ ను మాత్రం పూర్తిగా మార్చారు.
-
కొత్త స్కోడా సూపర్బ్ ను కొత్త ఆధునిక సాలిడ్ డిజైన్ థీమ్ పై నిర్మించారు.
-
ఎన్నో కొత్త ఫీచర్లు, కొత్త కలర్ థీమ్స్ తో పాటు మినిమలిస్టిక్ మరియు టెక్ రిచ్ క్యాబిన్ తో వస్తుంది.
-
10 ఎయిర్ బ్యాగులు, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి పలు ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
-
అంతర్జాతీయ మార్కెట్లో టర్బో పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఎంపికలతో లాభిస్తుంది.
-
వచ్చే ఏడాది భారతదేశంలో రూ .40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలకానుంది.
కొత్త స్కోడా కొడియాక్ విడుదలైన దాదాపు నెల తర్వాత, 2024 స్కోడా సూపర్బ్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అయింది. నాల్గవ తరం సెడాన్ కొత్త డిజైన్, కొత్త ఫీచర్లు మరియు అనేక పవర్ట్రెయిన్ ఎంపికలతో రాబోతోంది. ఈ మార్పులను మరింత వివరంగా తెలుసుకుందాం.
కొత్త డిజైన్
కొత్త సూపర్బ్ స్కోడా యొక్క కొత్త ఆధునిక సాలిడ్ డిజైన్ థీమ్ పై నిర్మించబడింది. యూరోపియన్ మార్కెట్లో, ఇది రెండు షేప్స్ లో ప్రవేశపెట్టబడింది: సెడాన్ మరియు కాంబి (ఎస్టేట్). సెడాన్ వెర్షన్ మాత్రమే భారతదేశంలో విడుదల అవుతుంది, కాబట్టి మేము దాని డిజైన్ నవీకరణల గురించి మాత్రమే మాట్లాడతాము. ముందు భాగంలో కొత్త గ్రిల్, కొత్త LED హెడ్ లైట్లు, కొత్త DRLలు, పదునైన వివరాలతో కొత్త బంపర్ ఉన్నాయి. కంపెనీ ఫాగ్ ల్యాంప్స్ ను తొలగించింది.
దీని సైడ్ ప్రొఫైల్ మునుపటిలాగే ఉంటుంది, అయినప్పటికీ దీని షోల్డర్-లైన్ లో మరియు దిగువ అంచులో క్రీజులలో కొన్ని మార్పులు చేశారు. ఇందులో 16 అంగుళాల నుండి 19 అంగుళాల వరకు పరిమాణం కలిగిన కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు భాగం మాదిరిగానే, స్కోడా తన వెనుక భాగంలో కూడా అనేక మార్పులు చేసింది. వెనుక భాగంలో, C-ఆకారంలో ఉన్న LED టెయిల్ ల్యాంప్స్, వ్యక్తిగత లైట్ ఎలిమెంట్లతో కొత్త బంపర్ మరియు ఫాక్స్ ఎగ్జాస్ట్ వెంట్లు ఉన్నాయి.
సరికొత్త క్యాబిన్
కొత్త స్కోడా సూపర్బ్ యొక్క క్యాబిన్ పూర్తిగా కొత్తది. కంపెనీ తన క్యాబిన్ లో వివిధ థీమ్ ఎంపికలను కూడా అందించారు. కొత్త డ్యాష్ బోర్డుపై వర్టికల్ స్లేట్లను అందించారు, ఇందులో కార్నర్ AC వెంట్ లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, ఇందులో 13 అంగుళాల పెద్ద సెంట్రల్ టచ్స్క్రీన్, స్మార్ట్ డిస్ప్లేతో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం ఫిజికల్ డయల్స్ కూడా ఉన్నాయి.
దీని సెంటర్ కన్సోల్ ఇప్పుడు స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న స్టాక్ నుండి పనిచేస్తుంది, దీని ఆటోమేటిక్ వేరియంట్లు ఇకపై డ్రైవ్ సెలెక్టర్ ఫీచర్ను పొందవు. దీని స్థానంలో ఒక ట్రే ఉంటుంది, దీనిలో మీరు మీ ఫోన్ ను ఉంచవచ్చు, ఈ ట్రేను స్లైడ్ చేసిన తర్వాత, దిగువన ఒక కప్పు హోల్డర్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: స్కోడా స్లావియా, స్కోడా కుషాక్ స్టైల్ వేరియంట్లలో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్
దీని సెంటర్ కన్సోల్ సెంట్రల్ ట్యూన్ లో మర్జ్ చేయబడింది, దీనిని ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ మరియు స్టోరేజ్ గా కూడా ఉపయోగించవచ్చు. దీని ఉపరితలం 100 శాతం రీసైకిల్ చేసిన మెటీరియల్స్ తో తయారు చేయబడింది.
ఫీచర్లు & భద్రత
కొత్త స్కోడా సూపర్బ్ కారులో 13 అంగుళాల ఫ్రీ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు స్మార్ట్ డయల్స్తో పాటు, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూలింగ్ ఫంక్షన్తో ఫాస్ట్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 45 వాట్ USB టైప్ A ఛార్జర్, మసాజ్ ఫంక్షన్తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్, యాంబియంట్ లైటింగ్, సన్రూఫ్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రూ.15.52 లక్షలకు స్కోడా స్లావియా మ్యాట్ ఎడిషన్
ఇందులో 10 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టర్న్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, క్రాస్ రోడ్ అసిస్ట్ వంటి ADAS (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ ఎంపికలు
ఇంజను |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ |
2-లీటర్ టర్బో-పెట్రోల్ |
2-లీటర్ డీజిల్ |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ |
పవర్ |
150PS |
204PS/265PS |
150PS/193PS |
204PS |
ట్రాన్స్మిషన్ |
7-స్పీడ్ DSG |
7-స్పీడ్ DSG |
7-స్పీడ్ DSG |
6-స్పీడ్ DSG |
డ్రైవ్ ట్రైన్ |
FWD |
FWD/AWD |
FWD/AWD |
FWD |
అంతర్జాతీయ మార్కెట్లో, ఇది పైన పేర్కొన్న అన్ని ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. వినియోగదారుల కోసం ఫ్రంట్-వీల్-డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలతో పాటు టర్బో-పెట్రోల్ ఇంజిన్తో మైల్డ్-హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వంటి ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్తో, సూపర్బ్ ఎలక్ట్రిక్ మోడ్లో 100 కిలోమీటర్లు ప్రయాణించగలదు, ఇది 25.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో పని చేస్తుంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్బ్ 50 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా పని చేస్తుంది. భారతదేశంలో, 2024 సూపర్బ్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేకుండా టర్బో-పెట్రోల్ ఇంజన్లలో మాత్రమే అందించబడుతుంది.
విడుదల తేదీ?
కొత్త స్కోడా సూపర్బ్ వచ్చే ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయబడుతుంది, 2024 చివరి నాటికి భారతదేశంలో విడుదల చేయబడుతుంది. ఇక్కడ దీని ప్రారంభ ధర సుమారు రూ. 40 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది టయోటా క్యామ్రీతో పోటీపడుతుంది.