Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మా కంట పడిన కొత్త మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్-లాంటి శైలిని పొందుతుంది

మారుతి ఆల్టో 800 కోసం dhruv attri ద్వారా ఏప్రిల్ 25, 2019 10:03 am ప్రచురించబడింది

మారుతి యొక్క ఫ్యూచర్-S కాన్సెప్ట్ ఆధారంగా SUV లక్షణాలు ఉన్న కొత్త చిన్న కారుని 2018 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు

  • చూడడానికి దృఢంగా ఉంటుంది మరియు ఎత్తైన ఫ్రంట్ భాగం, పెద్ద వీల్స్ తో SUV డిజైన్ లక్షణాలను కలిగి ఉంది.
  • పరీక్ష చేసిన కారు పూర్తిగా డిజిటల్ గా ఉండే ఇన్స్టృమెంటల్ క్లస్టర్ ని మధ్య భాగంలో కలిగి ఉంటుంది.
  • దీని ప్రారంభం 2019 ఉత్సవ సీజన్ లో ఉంటుందని భావిస్తున్నారు.

మారుతీ యొక్క అత్యధికంగా అమ్ముడుపోతున్న హ్యాచ్బ్యాక్ మరియు ఎక్కువ మంది భారతీయులకు మొట్టమొదటి కారు అయిన ఆల్టో, ఒక నవీకరణకు ఉంది. తరువాత తరం ఆల్టో కి కొన్ని SUV లక్షణాలు అందించబడుతున్నాయి, ఎందుకంటే అది ఫ్యూచర్-S కాన్సెప్ట్ మీద ఆధారితమయ్యి మారుతి సుజుకి దానిని 2018 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించింది. మేము ఇటీవల టెస్ట్ మ్యూల్ ని చూడడం జరిగింది, ఇది ఫ్యూచర్- S ద్వారా ప్రేరణ పొందింది, ఇటీవల NCR లో పరీక్షలో చూసాము మరియు ఇది తరువాతి తరం ఆల్టో కావచ్చు అని భావిస్తున్నాము.

పరీక్షలో ఉన్న కారు ఇది పొడవు మరియు ఒక ఎత్తైన ఫ్రంట్ ఎండ్ తో SUV- ప్రేరిత బాహ్య నమూనాను కలిగి ఉంది. అటువంటి రూపకల్పన మేము ఇప్పటికే ఆల్టో ప్రత్యర్థి, రెనాల్ట్ క్విడ్ లో చూసినట్లు ఉంది. టెస్ట్ మ్యూల్ మొత్తం ప్లాస్టిక్ క్లాడింగ్ ని కలిగి ఉంటుంది అని చెప్పలేము కానీ, ఇప్పుడు దృఢంగా ఉంటూ SUV లుక్ ని అందిస్తుందని మేము భావిస్తున్నాము.

(చిత్రపటం: మారుతి సుజుకి ఫ్యూచర్- S)

తరువాతి తరం ఆల్టో అనేది హార్టెక్ట్ -A ప్లాట్‌ఫార్మ్ ద్వారా తయారు చేయబడింది, కొత్తగా విడుదల చేసిన వాగన్ R మరియు ఇగ్నిస్ లాంటి మంచిగా నిర్మించబడిన కార్లు కూడా ఇదే ప్లాట్‌ఫార్మ్ మీద ఆధారపడి ఉన్నాయి. పరీక్ష మూల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నిటారుగా ఉండే A-పిల్లర్, పెరిగిన సస్పెన్షన్ సెటప్, పెద్ద విండోస్ మరియు 14-ఇంచ్ స్టీల్ వీల్స్ ని కలిగి ఉన్నాయి. వెనుకవైపు, విండ్‌స్క్రీన్ చాలా పెద్దదిగా అయితే కనిపించదు మరియు అది పెద్ద బూట్‌లిడ్ మరియు బంపర్ కోసం స్పేస్ అనేది ఉంచడం జరిగింది.

(చిత్రపటం: మారుతి సుజుకి ఫ్యూచర్- S)

ఇంటీరియర్స్ ఇమేజ్ లో స్పష్టంగా లేవు, కానీ హాచ్బ్యాక్ ఒక గుండ్రటి ఆకారంలో మధ్య భాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఆరెంజ్ కలర్ లో సాధ్యమైన డిజిటల్ రీడౌట్లతో క్విడ్ లాగా భావిస్తున్నాము. ఇది డాష్బోర్డుపై మనం మారుతీలో ఇప్పటిదాకా చూడనట్టు HVAC వెంట్స్ ఉంటాయి. క్విడ్ లాగానే, నూతన-తరం ఆల్టో ఒక 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ని, EBD తో ABS మరియు దాని టాప్ వేరియంట్ లో డ్యుయల్ ఎయిర్బ్యాగ్ ని కలిగి ఉంది.

ప్రస్తుత-తరం ఆల్టో 0.8-లీటర్ (48Ps శక్తిని/ 69Nm టార్క్) మరియు 1.0-లీటర్ (68Ps శక్తిని / 90Nm టార్క్) పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇక్కడ మనం వేచి చూడాల్సిన అంశం ఏమిటంటే మారుతి రెండు ఇంజన్లను కొత్త మోడల్ లో ఉంచుతుందా లేదా ఆ చిన్న ఇంజన్ ని తీసేస్తుందా అనేది చూడాల్సింది. ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ చేత నిర్వహించబడుతున్నాయి మరియు మనం AMT ని దీనిలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము కానీ ఉండొచ్చు అని భావిస్తున్నాము.

ఎంట్రీ లెవెల్ కొత్త తరహా మారుతి సుజుకి పాత హ్యాచ్బ్యాక్ కంటే అధిక ధరని డిమాండ్ చేయొచ్చు అని మేము భావిస్తున్నాము, ఎందుకంటే దాని లుక్స్ చాలా బాగుంటాయి. ప్రస్తుతం ఆల్టో 800 ధర రూ.2.62 లక్షల నుంచి రూ. 3.93 లక్షల వరకూ ఉంటుంది, అలాగే ఆల్టో K10 రూ. 3.38 లక్షల నుంచి రూ. 4.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రిటైల్ అవుతోంది. ఈ కొత్త ఆల్టో ధర రూ .3 లక్షల నుంచి ప్రారంభించబడుతుందని మేము భావిస్తున్నాము. ఇది రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడి-GO తో పోటీని పునరుద్ధరిస్తుందని చెప్పవచ్చు.

d
ద్వారా ప్రచురించబడినది

dhruv attri

  • 21 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి Alto 800

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర