కొత్త హ్యుందాయ్ ఎలంట్రా 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడవచ్చు
జనవరి 22, 2016 03:53 pm manish ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ తరువాతి తరం బహుశా 2016 భారత ఆటో ఎక్స్పోలో రాబోతుంది. కారు 'Avante' అనే మారుపేరు కింద, కొరియా లో ప్రారంభించడింది మరియు ఇటీవల 2015 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ప్రదర్శించబడింది. ఈ సెడాన్ యొక్క సౌందర్యపరమైన అంశాలు ప్రస్తుత నమూనా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుత ఎలంట్రా యొక్క వెర్నా డిజైన్ మరింత ఉత్తేజకరంగా మరియు పదునైన లుక్ ద్వారా భర్తీ చేయబడుతుంది. రాబోయే ఆటో ఎక్స్పో వద్ద హ్యుందాయ్ ప్రదర్శన మునుపెన్నడూ చూడనటువంటి అతిపెద్ద మోటార్ షో లో ఒకటిగా భావించబడుతుంది. అంతేకాకుండా ఇటువంటి అనేక సౌందర్య లక్షణాలను కలిగి ఉండి ముందు చెప్పిన మాటను నిజం చేసింది.
సౌందర్య అంశాల గురించి మాట్లాడితే, ఈ కారు కోణీయ DRLS, క్రోం తో ఉన్న పునఃరూపకల్పన ఫ్రంట్ గ్రిల్, సొగసైన టెయిల్ ల్యాంప్స్ మరియు సి-అకారపు ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ తో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. అంతర్భాగాలలో ఈ నవీకరించబడిన సెడాన్ 8.0-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ/ నావిగేషన్ సిస్టమ్ ను బహుశా కలిగి ఉండవచ్చు. ఈ వ్యవస్థ సబ్ వూఫర్ మరియు సెంట్రల్ స్పీకర్ కలిగియున్న 8 స్పీకర్ ఇన్ఫినిటీ ప్రీమియం ఆడియో వ్యవస్థతో జత చేయబడి ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, ఎలంట్రా వాహనం వెర్నా-ఉత్పన్న డీజిల్ మిల్ 1.6 లీటర్ తో కొనసాగవచ్చు. పెట్రోల్ పవర్ ప్లాంట్స్ గనుక పరిగణలోనికి తీసుకుంటే హ్యుందాయి కొత్త 1.4 లీటర్ టర్బో చార్జెడ్ కప్పా GDI నాలుగు సిలిండర్ల ఇంజన్ ని ఎకో వేరియంట్లో అందించే అవకాశం ఉండవచ్చు. ఈ ఇంజిన్ 5500rpm వద్ద 128bhp శక్తిని మరియు 1,400 నుండి 3700rpm వద్ద 211.5Nm టార్క్ ని అందిస్తుంది. ఎకోషిఫ్ట్ సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఈ పవర్ప్లాంట్ 14 km/l ఇంధన సామర్ధ్యం అందిస్తుంది, దీనివలన ఇది టయోటా కరొల్లా ఆల్టిస్ మరియు చేవ్రొలెట్ క్రుజ్ వంటి వాటితో పోటీ పడవచ్చు.
ఇంకా చదవండి
2016 హ్యుందాయ్ శాంటా ఫే ఆటో ఎక్స్పో లో టక్సన్ మరియు సబ్-4 మీటర్ SUV తో చేతులు కలపనున్నది