2016 హ్యుందాయ్ శాంటా ఫే ఆటో ఎక్స్పో లో టక్సన్ మరియు సబ్-4 మీటర్ SUV తో చేతులు కలపనున్నది
జనవరి 18, 2016 06:22 pm saad ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ గత ఏడాది ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో శాంటా ఫే ఫేస్లిఫ్ట్ ని ఆవిష్కరించింది. ఈ ఎస్యువి తాజా పోటీని తట్టుకోవడానికి పూర్తిగా నవీకరించబడింది. ఇది అంతర్జాతీయంగా ప్రారంభించబడిన తర్వాత ఇప్పుడు ఇది ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో కొత్త శాంటా ఫే ని ప్రదర్శించనున్నది. అవును, భారతదేశంలో రాబోయే ఆటో ఎక్స్పో నిస్సందేహంగా ఈ SUV యొక్క తదుపరి గమ్యంగా ఉండబోతోంది మరియు ఇది టక్సన్ మరియు 4 మీటర్ల కింద SUV వంటి ఇతర కార్లతో పాల్గొంటుంది.
మార్పుల గురించి మాట్లాడుకుంటే 2016 హ్యుందాయి శాంటా ఫే క్రోమ్ ఫినిషెడ్ హెగ్సాగొనల్ గ్రిల్ ని కలిగి ఉంది. ఇదే గ్రిల్ దీని ఇతర కార్లలో కూడా చూడవచ్చు. ఈ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఇప్పుడు జినాన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది. అయితే, LED డే టైం రన్నింగ్ లైట్స్ కేవలం ఫాగ్ ల్యాంప్స్ పైన కనిపిస్తుంది మరియు ఇది సిల్వర్ ఔట్ లైన్ ని కలిగి ఉంటుంది. అలాయ్ కొత్త వీల్స్ మరియు రేర్ టెయిల్ ల్యాంప్స్ పైన తాజా LED టెయిల్ ల్యాంప్స్ అనేవి ఇతర ముఖ్యమైన మార్పులు.
శాంటా ఫే యొక్క అంతర్భాగాలు ఇన్ఫినిటీ ప్రీమియం ధ్వని మరియు DABడిజిటల్ రేడియో ద్వారా ఆధారితం టచ్స్క్రీన్ ఎవియన్ వ్యవస్థ చేర్చడంతో ఇప్పుడు మరింత ప్రీమియం గా ఉంది. స్టీరియో వ్యవస్థ కూడా 630 వాట్స్ సామర్థ్యం సృష్టించగల 12 స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి స్లైడింగ్ మరియు వెనుక పాసింజర్ల కొరకు మరింత సౌకర్యం అందించేందుకు సర్దుబాటు చేయగల రెండవ వరుస సీటుని కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ కారు హ్యుందాయ్ యొక్క ప్రపంచ భద్రత ఫిలాసఫీ ని కలిగి ఉంది. ఇంకా దీనిలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలెర్ట్, ఆధునిక క్రూయిస్ కంట్రోల్ మరియు సమీపించే వాహనాలను గుర్తించేందుకు 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మరియు ఆసన్న ప్రమాదం అంచనా వేయగల కొత్త లక్షణాలను కలిగి ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త శాంటా ఫే 2.2 లీటర్ CRDiడీజిల్ మోటార్ ద్వారా ఆధారితం చేయబడి 200bhp శక్తిని మరియు 440Nm టార్క్ ని అందిస్తుంది. పెట్రోలు యూనిట్ తీటా II 2.4 లీటరు ఇంజిన్ తో అమర్చబడి 187bhp శక్తిని మరియు 241Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పవర్ మిల్స్ ప్రామాణిక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటాయి, అలానే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఒక ఎంపికను కూడా కలిగి ఉంటాయి. కొత్త శాంటా ఫే వాహనం ఫోర్డ్ ఎండీవర్ 2016 మరియు టయోటా ఫార్చ్యూనర్ తో పోటీ పడుతుంది.
ఇంకా చదవండి
. భారత హ్యుందాయ్ రాబోయే ఫిబ్రవరి లో సబ్-4 మీటర్ SUV బహిర్గతం చేయబోతోంది