జనవరి 2023లో డీజిల్ పవర్‌ట్రెయిన్ؚకు ప్రాధాన్యతనిచ్చిన మహీంద్రా వాహన కొనుగోలుదారులు
మహీంద్రా థార్ కోసం ansh ద్వారా ఫిబ్రవరి 16, 2023 07:33 pm ప్రచురించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
XUV300 డీజిల్ పవర్‌ట్రెయిన్ అమ్మకాలు పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే అధికంగా ఉన్నాయి, అయినప్పటికీ సంఖ్య పరంగా ఈ వ్యత్యాసం చిన్నదే
మహీంద్రా SUV విభాగంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ వాహనాలు ఆన్, ఆఫ్ రోడ్‌పై ఉండే ధృఢత్వం కారణంగా చాలా ప్రజాదరణ పొందాయి, ఈ ప్రజాదరణే అమ్మకాలను నిలుపుకోవడంలో ఈ కారు తయారీదారుకు సహాయపడుతుంది. మహీంద్రా తన SUVలను పెట్రోల్, డీజిల్ పవర్ؚట్రెయిన్ ఎంపికలతో అందిస్తుంది, జనవరి 2023లో ప్రజాదరణ పొందిన కొన్ని మహీంద్రా SUVల పెట్రోల్, డీజిల్ అమ్మకాల విభజనని చూద్దాం:
థార్
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
1,177 |
334 |
డీజిల్ |
3,471 |
4,076 |
థార్ పెట్రోల్ వేరియెంట్ అమ్మకాలు కొద్ది కాలంగా తగ్గుతూ వస్తున్నాయి. కొనుగోలుదారులు, డీజిల్-ఆధారిత థార్ؚను కొనుగోలుచేయడానికి మొగ్గు చూపుతున్నారు. జనవరి 2023లో, లైఫ్‌స్టైల్ SUV డీజిల్ వేరియెంట్ 4,000 యూనిట్‌ల అమ్మకాల మార్క్‌ను దాటింది. పెట్రోల్ వేరియెంట్ మాత్రం 300 కంటే తక్కువ అంకెలో ఉంది.
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
24.4% |
7.6% |
డీజిల్ |
74.6% |
92.4% |
ఇది కూడా చూడండి: కొత్త డిజైన్ మార్పులతో మళ్ళీ కనిపించిన 5 డోర్‌ల మహీంద్రా థార్
ఒక సంవత్సర కాలంలో, పెట్రోల్ వేరియెంట్ అమ్మకాలు 24 శాతం నుండి ఎనిమిది శాతం కంటే తక్కువకు పడిపోయాయి, డీజిల్ వేరియెంట్ అమ్మకాలు 92 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
XUV700
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
1,956 |
1,375 |
డీజిల్ |
2,163 |
4,412 |
XUV700 మోడల్‌తో డీజిల్ వెర్షన్ కూడా కొంత కాలం ప్రాచుర్యాన్ని పొందింది. దీని పెట్రోల్ వేరియెంట్ అమ్మకాలు సుమారుగా 600 యూనిట్‌ల వరకు తగ్గాయి, డీజిల్ వేరియింట్ అమ్మకాలు మాత్రం రెట్టింపు అయ్యి 4,000 యూనిట్‌ల మార్క్ؚను దాటింది.
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
47.5% |
23.8% |
డీజిల్ |
52.5% |
76.2% |
ఇది కూడా చదవండి: మహీంద్రా స్కార్పియో క్లాసిక్, XUV700పై రూ.65,000 ఎక్కువ వెచ్చించడానికి సిద్ధంగా ఉండండి
జనవరి 2022లో, అమ్మకాల పరంగా XUV700 పెట్రోల్, డీజిల్ వేరియెంట్‌ల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. కానీ జనవరి 2023లో, డీజిల్ వేరియెంట్ అమ్మకాలు పెట్రోల్ వేరియెంట్‌తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంటూ 76 శాతం వాటాగా ఉంది.
XUV300
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
2,415 |
2,533 |
డీజిల్ |
2,135 |
2,549 |
XUV300 అమ్మకాలు పెట్రోల్, డీజిల్ విభజన పరంగా దాదాపుగా సమతుల్యంగా ఉన్నాయి, SUV పెట్రోల్ వేరియెంట్ అమ్మకాలు జనవరి 2022లో ఎక్కువగా ఉంది, కానీ జనవరి 2023లో, డీజిల్ వేరియెంట్ స్వల్ప వ్యత్యాసంؚతో ముందు ఉంది.
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
53% |
49.9% |
డీజిల్ |
47% |
50.1% |
ఇది కూడా చూడండి: ఫార్ములా E ప్రేమికుల కోసం మహీంద్రా XUV400 EV
పై పట్టికలో చూసినట్లు, XUV300 పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ అమ్మకాల గణాంకాలు జనవరి 2022లో చాలా దగ్గరగా ఉన్నాయి, ఇప్పుడు అవి మరింత దగ్గరగా ఉన్నాయి. రెండు పవర్‌ట్రెయిన్ؚలు జనవరి 2023లో దాదాపుగా సమానమైన అమ్మకాల విభజనను కలిగి ఉన్నాయి.
స్కార్పియో N & స్కార్పియో క్లాసిక్
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
0 |
654 |
డీజిల్ |
3,026 |
8,061 |
ఇక్కడ ఎలాంటి పోలికా లేదు, స్కార్పియో శ్రేణి డీజిల్ వేరియెంట్ అమ్మకాలు (వీటిలో స్కార్పియో N, స్కార్పియో క్లాసిక్ రెండు ఉన్నాయి) పెట్రోల్ వేరియెంట్ కంటే చాలా ముందు ఉన్నాయి. జనవరి 2022లో, స్కార్పియో క్లాసిక్ మాత్రమే ఉండేది, ఇది కేవలం డీజిల్ ఎంపికతో ఉండేది. దీని అమ్మకాలు 3,000 యూనిట్‌ల కంటే కొంత ఎక్కువగా ఉంది. జనవరి 2023లో, స్కార్పియో N అందబాటులోకి వచ్చిన తరువాత కూడా, పెట్రోల్ వేరియెంట్ కేవలం 650 యూనిట్‌ల అమ్మకాలను మాత్రమే చేయగలిగింది, డీజిల్ వేరియెంట్‌లు మాత్రం 8,000 యూనిట్‌ల అమ్మకాల మార్కును దాటాయి.
పవర్ؚట్రెయిన్ |
జనవరి 2022 |
జనవరి 2023 |
పెట్రోల్ |
0 |
7.5% |
డీజిల్ |
100% |
92.5% |
ఇది కూడా చదవండి: కేవలం డీజిల్-ఆటోమ్యాటిక్ కలయికతో సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టిన మహీంద్రా స్కార్పియో N
జనవరి 2023లో, స్కార్పియో డీజిల్ వేరియెంట్ శ్రేణిలో, రెండు మోడల్‌ల మొత్తం అమ్మకాలు 92 శాతం కంటే ఎక్కువ ఉన్నాయి
ఇది కూడా చదవండి: థార్ؚకు తీవ్రమైన ఆఫ్-రోడ్ పోటీని ఇవ్వగల ఎలక్ట్రిక్ మహీంద్రా SUV
ఇవి ప్రజాదరణ పొందిన మహీంద్రా మోడల్‌ల అమ్మకాల గణాంకాలు. మహీంద్రా వాహన కొనుగోలుదారులు ఈ కారు సంస్థ యొక్క పెట్రోల్ వర్షన్ؚల కంటే డీజిల్ పవర్‌ట్రెయిన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని స్పష్టంగా తెలుస్తోంది. మీ ప్రాధాన్యత ఏమిటో క్రింద కామెంట్‌లలో తెలియజేయండి.
ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా థార్ డీజిల్
0 out of 0 found this helpful