• English
    • Login / Register

    కొత్త డిజైన్ మార్పులతో మళ్ళీ కనిపించిన 5 డోర్‌ల మహీంద్ర థార్

    మహీంద్రా థార్ రోక్స్ కోసం rohit ద్వారా ఫిబ్రవరి 02, 2023 12:24 pm ప్రచురించబడింది

    • 49 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    దీని టెస్ట్ డిజైన్ రహస్య పరిశీలన ప్రకారం, ఈ SUV వెనుక భాగంలో మారుతి స్విఫ్ట్ వంటి డోర్ పిల్లర్-మౌంటెడ్ హ్యాండిల్స్ؚను కలిగి ఉంది.

    5 door Mahindra Thar

    • రహస్య పరిశీలన ప్రకారం, ఈ మోడల్ వాహనం దాదాపుగా దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. 

    • మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ ఎంపికలతో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటితో వస్తుంది. 

    • రేర్-వీల్-డ్రైవ్ (RWD), ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) ؚలతో వస్తుంది. 

    • మూడు-డోర్‌ల మోడల్ కంటే అధిక ధరతో 2024లో మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

    రహస్యంగా తీసిన ఐదు-డోర్‌ల మహీంద్ర థార్ తాజా ఫోటోలు ఆన్‌లైన్ؚలో కనిపించాయి. SUV దాదాపుగా దాచిపెట్టి ఉన్నట్లు కనిపించినప్పటికి, గమనించదగిన వివరాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం: 

    కొత్తవి ఏమిటి?

    5 door Mahindra Thar

    తాజా చిత్రాలలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, 5 డోర్‌ల థార్ C-పిల్లర్ మౌంటెడ్ వెనుక డోర్ హ్యాండిల్స్ (మారుతి స్విఫ్ట్ؚ‌లో ఉన్నట్లుగా)తో వస్తుంది. ఇది కాకుండా, అవే అలాయ్ వీల్స్, అదనపు డోర్‌ల సెట్, ఇది వరకు కనిపించిన టెస్ట్ డిజైన్‌లో చూసినట్లు ‘థార్’ పేరును కలిగిన LED వెనుక లైట్‌లు ఉన్నాయి.

    ఇవి కూడా చదవండి: మహీంద్ర స్కార్పియో క్లాసిక్, XUV700 కోసం రూ.65,000 ఎక్కువ చెల్లించెందుకు సిద్ధపడండి

    పవర్ ట్రెయిన్ వివరాలు

    ప్రస్తుత మూడు-డోర్‌ల థార్ؚలో ఉన్నట్లుగా మరింత మెరుగైన పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను ఐదు-డోర్‌ల థార్ؚ కలిగి ఉంది. 2-లీటర్ టర్బో-పెట్రోల్ 160PSను, డీజిల్ ఇంజన్ 139PS విడుదల చేస్తుంది. ఐదు-డోర్‌ల థార్ؚను మహీంద్రా, ఇటీవలి ప్రస్తుత మోడల్ؚలో చూసినట్లు 2WD వేరియెంట్ؚల ఎంపికతో అందిస్తుందని ఆశిస్తున్నాo. కారు తయారీ సంస్థ ఈ SUVని ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ ఎంపికలు రెండిటితో సిద్ధం చేస్తుంది.

    ఇది కూడా చూడండి: పదునైన రూఫ్ؚతో వింటేజ్-ఎరా జీప్ؚలా భారతదేశంలో మొదటిసారిగా కనిపించిన మహీంద్రా థార్

    ఇది ఎప్పుడు విడుదల కానుంది?

    5 door Mahindra Thar rear

    మహీంద్రా, ఐదు డోర్‌ల థార్ؚను 2024 ప్రారంభంలో విడుదల అవుతుందని ఆశిస్తున్నాం, దీని ధర మూడు-డోర్‌ల మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. సూచనగా, మూడు-డోర్‌ల SUV రూ. 9.99 లక్షల నుండి రూ. 16.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో విక్రయించారు. ఇది మారుతి జీమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి వాటితో పోటీ పడుతుంది, వీటిలో రెండవ వాహనం ఐదు-డోర్‌ల వర్షన్ త్వరలోనే విడుదల అవుతుందని భావిస్తున్నాం. 

    ఇమేజ్ క్రెడిట్ؚ – Shivay21

    ఇక్కడ మరింత చదవండి: థార్ డీజిల్ 

    was this article helpful ?

    Write your Comment on Mahindra థార్ ROXX

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience