Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2 నెలల కంటే తక్కువ సమయంలో 650 యూనిట్‌ల బుకింగ్ؚలు అందుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5 EV

హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం tarun ద్వారా ఫిబ్రవరి 09, 2023 12:52 pm ప్రచురించబడింది

స్థానికంగా అసెంబుల్ చేసిన ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ రూ.44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో వస్తుంది

  • ఐయానిక్ 5 - 72.6kWh బ్యాటరీ ప్యాక్ؚతో సుమారుగా 631 కిలో మీటర్ పరిధితో వస్తుంది.

  • 350kWh ఫాస్ట్ ఛార్జర్‌తో, 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 18 నిమిషాలు పడుతుంది; 50kW ఛార్జర్ؚతో ఒక గంట సమయం పడుతుంది.

  • ఇది పిక్సెల్-స్టైల్ వివరాలతో విలక్షణమైన ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚతో హ్యుందాయ్ నుండి వస్తున్న మొదటి పూర్తి EV వాహనం.

  • రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు, ఒక బోస్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, రాడార్-ఆధారిత ADAS ఇందులో ఉంటాయి.

  • అనేక ఫీచర్‌లతో ఒకే ఒక వేరియెంట్ؚ అందుబాటులో ఉంది; ఒకటి లేదా రెండు నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా.

హ్యుందాయ్, ఐయానిక్-5ను ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది, ఇది దేశంలోని కారు తయారీదారుల నుండి వస్తున్న అత్యంత ఖరీదైన కారు. అయితే, ఇది లాంగ్-రేంజ్ ప్రీమియం MPVలలో అత్యంత చవకైన కారు, దీన్ని స్థానికంగా అసెంబుల్ చేసినందున ఇది రూ. 44.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు వస్తుంది. దీని బుకింగ్ؚలు డిసెంబర్ 2022 చివరినాటికి రూ. ఒక లక్ష వద్ద ప్రారంభమయ్యాయి, ఇప్పటికే 650 ఆర్డర్‌లు అందుకుంది కానీ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు.

ఐయానిక్-5 72.6kWh బ్యాటరీ ప్యాక్‌తో, వెనుక వీల్స్ؚను నడిపే ఒక సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ؚతో అందిస్తున్నారు. ఇది 217PS పవర్, 350Nm టార్క్‌తో ఉత్తమ పనితీరును, 631 కిలోమీటర్‌ల పరిధిని అందిస్తుంది అని అంచనా. దీని తోటి వాహనం అయిన కియా EV6లో ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ ఎంపిక ఉంటుంది, ఇది CBU ఆఫరింగ్ؚగా అధిక ధరతో వస్తుంది.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఐయానిక్ 5 Vs EV6ల పోలిక

ఈ క్రాస్ఓవర్ 350kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ؚను సపోర్ట్ చేస్తుంది, ఇది కేవలం 18 నిమిషాలో 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. అదే 150kWh ఫాస్ట్ ఛార్జర్ؚతో 80 శాతం చార్జ్ అవ్వడానికి 21 నిమిషాలు పడుతుంది, వీటిలో కొన్ని హ్యుందాయ్ స్వయంగా ఏర్పాటు చేసింది. పబ్లిక్ చార్జర్‌లు 50kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ؚను సపోర్ట్ చేస్తాయి, ఇది 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి సుమారుగా ఒక గంట సమయం పడుతుంది. ఇంట్లో ఉండే 11kW AC ఛార్జర్ؚతో, EV పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సుమారు ఏడు గంటల సమయం పడుతుంది. ఇది వెహికిల్-టు-లోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది, ఇందులో ఈ కారు బ్యాటరీని ఉపయోగించి ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.

ఇది హ్యుందాయ్ వాహనాలలో ముఖ్యమైన వాహనం కనుక, దీని ఒకే ఒక వేరియంట్ పూర్తిగా ఫీచర్‌లతో నిండి ఉంది. ఐయానిక్-5లో ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పవర్ ఫ్రంట్ మరియు వెనుక సీట్‌లు, పనోరమిక్ సన్ؚరూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు డ్రైవర్ డిస్ప్లే కోసం 12.3-అంగుళాల డిస్ప్లేలు, ఎనిమిది-స్పీకర్‌ల బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే దీనిలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, TPMS, రాడార్-ఆధారిత ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉంటాయి, అంతేకాకుండా, ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. లేన్ కీప్ అసిస్ట్, ఆటోమ్యాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 360-డిగ్రీ కెమెరా, హై-బీమ్ అసిస్ట్ కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్‌లు

హ్యుందాయ్ ఐయానిక్-5 రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వస్తుంది, ఈ ధర పూర్తిగా-దిగుమతి చేసుకునే కియా EV6 కంటే రూ. 15-19 లక్షలు తక్కువ. ఇతర ప్రత్యామ్నాయాలలో వోల్వో XC40 రీఛార్జ్, రానున్న స్కోడా ఎన్యాక్ iV ఉన్నాయి.

ఇక్కడ మరింత చదవండి: ఐయానిక్ 5 ఆటోమ్యాటిక్

Share via

Write your Comment on Hyundai ఐయోనిక్ 5

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర