టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ కి ప్రత్యర్థి గా రానున్న MG యొక్క కారు, భారతదేశంలో మొదటిసారిగా మా కంటపడింది
నవంబర్ 22, 2019 11:54 am sonny ద్వారా ప్రచురించబడింది
- 29 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
D90 SUV 2020 రెండవ భాగంలో ఇక్కడకు రావచ్చు
- 2021 ప్రారంభంలో భారతదేశంలో నాలుగు కొత్త SUV లను విడుదల చేయాలని MG యోచిస్తోంది.
- D90 ను చైనాలో ప్రీమియం SUV గా అందిస్తున్నారు; MG యొక్క అసలు ప్రణాళికలో భాగంగా భారతదేశానికి రావచ్చు.
- ఇది మూడు వరుసల సీట్లను అందిస్తుంది మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ కంటే పెద్దది.
- D90 త్రీ -జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లక్షణాలను పొందుతుంది.
- ఫిబ్రవరిలో జరిగే 2020 ఆటో ఎక్స్‌పోలో MG దీన్ని ప్రదర్శిస్తుంది.
హెక్టర్ SUV తో MG మోటార్ ఇండియన్ ఆటోమోటివ్ స్పేస్‌లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు, కార్ల తయారీదారు 2021 ప్రారంభంలో మరో నాలుగు SUV లను విడుదల చేయబోతున్నట్లు ధ్రువీకరించారు. హెక్టర్ మరియు ZS EV యొక్క ఏడు సీట్ల వెర్షన్ ఇందులో ఉందని మాకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు, మాక్సస్ D90 SUV యొక్క కవరింగ్ తో ఉన్న వెర్షన్ భారతదేశంలో మొదటిసారిగా మా కంటపడింది మరియు ఇది ప్రణాళికాబద్ధమైన నాలుగు SUV లలో ఒకటిగా ఉంటుందని మేము నమ్ముతున్నాము.
మాక్సస్ D 90 అనేది చైనాలో SAIC గొడుగు కింద MG సోదరి కంపెనీలలో ఒకరి ద్వారా విక్రయించబడే ప్రీమియం SUV. ఇది ఎనిమిది మంది ప్రయాణీకులకు మూడు వరుసల వరకు సీటింగ్ ఎంపికల శ్రేణిని మరియు ముందు ప్రయాణీకుల సీటును పూర్తిగా తొలగించే ప్రత్యేకమైన అవకాశాన్ని పొందుతుంది. చైనా-స్పెక్ SUV 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది, ఇది 224 Ps పవర్ ని మరియు 360Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందించబడుతుంది. MG డీజిల్ వేరియంట్ పై కూడా పనిచేస్తోందని, ఇది భారత మార్కెట్లో బాగా రాణించగలదని తెలిపింది.
D90 యొక్క ఖచ్చితమైన నిష్పత్తులు ఇక్కడ ఉన్నాయి:
మాక్స్ D90 |
టొయోటా ఫార్చూనర్ |
ఫోర్డ్ ఎండీవర్ |
|
పొడవు |
5005mm |
4975mm |
4903mm |
వెడల్పు |
1932mm |
1855mm |
1869mm |
ఎత్తు |
1875mm |
1835mm |
1837mm |
వీల్బేస్ |
2950mm |
2745mm |
2950mm |
ప్రతి కోణంలో ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్ కంటే D90 పెద్దది. ఇది మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు మరిన్ని వంటి ప్రీమియం లక్షణాలను పొందుతుంది. డిజైన్ పరంగా, D90 దాని రహదారి ఉనికిని పెంచే పెద్ద, నల్లబడిన గ్రిల్‌ను కలిగి ఉంది.
2020 ద్వితీయార్థం నాటికి D 90 ను భారతదేశంలో ప్రవేశపెట్టాలని MG యోచిస్తున్నట్లు మునుపటి నివేదికలు పేర్కొన్నాయి. ఈ కారును వేరే పేరుతో మరియు మార్కెట్‌కు తగిన స్పెసిఫికేషన్ లో ఇక్కడ లాంచ్ చేసే అవకాశం ఉంది. MG మోటార్ ఫార్చ్యూనర్, అల్టురాస్ G 4, ఎండీవర్ మోడళ్లకు ప్రత్యర్థిని 30 లక్షల రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదల చేయనుంది. ఈ SUV భారతదేశంలో MG మోటర్ కు ప్రధాన సమర్పణ అవుతుంది.
మరింత చదవండి: ఫోర్డ్ ఎండీవర్ డీజిల్