కామెట్ EV ఇంటీరియర్‌లో అందించే మెరుగైన ఫీచర్‌లను విడుదల చేసిన MG
ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా ఏప్రిల ్ 10, 2023 11:11 am ప్రచురించబడింది
- 44 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ నెల చివరిలో కామెట్ EVలో అందుబాటులో ఉండే అన్నీ ఫీచర్‌లను పూర్తిగా వెల్లడిస్తారని అంచనా
-
కామెట్ EV మొదటి టీజర్ విడుదల అయ్యింది, ఇందులో ఇంటీరియర్‌ను వీక్షించవచ్చు.
-
ఇది స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్‌లు, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ؚలు, ఆటోమ్యాటిక్ AC, బ్రషెడ్ సిల్వర్ ఎలిమెంట్‌లతో వస్తుంది.
-
ఇది రెండు డోర్‌లు మరియు నాలుగు సీట్‌లు కలిగిన 3 మీటర్ కంటే తక్కువ ఎత్తు గల వాహనం.
-
300km వరకు మైలేజ్‌ను అందించగల 17.3kWh మరియు 26.7kWh బ్యాటరీ ప్యాక్ؚలతో వస్తుందని అంచనా.
-
ధర సుమారు రూ.9 లక్షల వరకు ఉండవచ్చు (ఎక్స్-షోరూమ్).
MG కామెట్ EV మొదటి టీజర్ విడుదలైంది! కారు తయారీదారు ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌ను ఇందులో చూపించారు, ఇది ప్రత్యేకమైన మరియు విలక్షణమైన స్టైలింగ్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చిన్న రెండు-డోర్‌ల ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్, ఏప్రిల్ నెలలోనే విడుదల అవుతుందని అంచనా.
టీజర్‌లో ఏమి చూపించారు?
(రిఫరెన్స్ కోసం వూలింగ్ అల్మాజ్ ఇంటీరియర్)
ఆధునిక లుక్ కలిగిన కామెట్ EV క్యాబిన్‌ను టీజర్‌లో చూడవచ్చు. ఇది ఆడియో మరియు వాయిస్ కమాండ్ కంట్రోల్ؚతో రెండు-స్పోక్ల స్టీరింగ్ వీల్ؚతో వస్తుంది. రెండు మార్క్ చెయ్యని బటన్‌లను చూడవచ్చు, ఇవి క్రూజ్ కంట్రోల్ కోసం అని భావిస్తున్నాము. అంతేకాకుండా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలను కలిగి ఉండే డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్ప్లేలను కూడా చూడవచ్చు. ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం రోటరీ డయల్స్ మరియు ప్రత్యేకంగా-కనిపించే AC వెంట్‌ల కోసం బ్రషెడ్ సిల్వర్ సరౌండ్ؚను కూడా గమనించవచ్చు.
ఆశించదగిన ఇతర ఫీచర్‌లు
కామెట్ EVలో కనెక్టెడ్ కార్ సాంకేతికత ఉంటుందని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా పొందవచ్చు.
సీటింగ్ మరియు సైజింగ్
కామెట్ EV సబ్-3 మీటర్ ఆఫరింగ్, దీని పొడవు టాటా నానో కంటే తక్కువగా ఉంటుంది, కానీ ఆల్టో K10 కంటే ఎక్కువ వెడల్పు మరియు ఎత్తు ఉంటుంది. ఇది నాలుగు సీట్‌ల సౌకర్యంతో రెండు-డోర్‌ల వాహనం. దీని కొలతలు మైక్రో-EV కొలతలతో పోలి ఉంటాయి, దీనిలో ప్రత్యకమైన ఎక్స్ؚటీరియర్ స్టైలింగ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: MG కామెట్ EV గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
బ్యాటరీ చర్చ
వూలింగ్ అల్మాజ్ EV పేరుతో దీన్ని ఇండోనేషియా మార్కెట్‌లో అందిస్తున్నారు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 17.3kWh ప్యాక్ 200kms వరకు పరిధిని కలిగి ఉంటుంది మరియు 26.7kWh ఎంపిక 300kms వరకు క్లెయిమ్ చేస్తుంది. 40PS పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది వెనుక చక్రాలకు శక్తిని ఇస్తుంది. కామెట్ EV ఈ రెండు బ్యాటరీ ఎంపికలతో అందించబడుతుందని అంచనా.
ధర అంచనా
ఇది కూడా చదవండి: భారతదేశంలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్‌లు
MG కామెట్ EV ధర సుమారు రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని ఆశిస్తున్నాము, ఇది సిట్రోయెన్ eC3 మరియు టాటా టియాగో EVలతో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful