Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ప్రధాన వాటా కొనుగోలుపై దృష్టి సారించడంతో త్వరలో భారతీయ కంపెనీ గా మారనున్న MG మోటార్

జూన్ 16, 2023 04:32 pm tarun ద్వారా ప్రచురించబడింది

ప్రస్తుతం, హెక్టర్ మరియు కామెట్ EV తయారీదారు షాంఘైకి చెందిన SAIC మోటార్స్ యాజమాన్యంలో ఉంది.

  • MG కంపెనీని స్థానికీకరించడానికి తన భారతీయ పెట్టుబడిదారులకు తన మెజారిటీ వాటాలను విక్రయించే ప్రణాళికలను ముందుగా ప్రకటించింది.

  • మహీంద్రా, హిందూజా, రిలయన్స్ మరియు జిందాల్ స్టీల్ వంటి కంపెనీలు MG మోటార్ ఇండియాపై ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది.

  • MGని పూర్తిగా భారతదేశానికి చెందిన కంపెనీగా మార్చడానికి ఈ కంపెనీలలో ఏదైనా ఒక కంపెనీ MG యొక్క మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే చాలు.

  • MG కంపెనీ నిధుల సేకరణకు సంబందించిన ఆంక్షలు భారతదేశం - చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఉన్నాయి.

  • MG వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 4-5 కొత్త కార్లను ప్రవేశపెట్టే ప్రణాళికలను కూడా ప్రకటించింది.

రాబోయే రెండు నుండి నాలుగు సంవత్సరాలలో MG యాజమాన్యాన్ని పూర్తిగా భారతీయులకు ఇచ్చే ప్రణాళికలను ప్రకటించింది. అనేక భారతీయ కంపెనీలు MG పై ఆసక్తి చూపడం ప్రారంభించాయి, MGరాబోయే ఐదేళ్లలో 4-5 కార్లను విడుతలచేయవొచ్చని యోచిస్తున్నాము. ప్రస్తుతం MG యొక్క భారతీయ శాఖ పూర్తిగా షాంఘైకి చెందిన SAIC మోటార్ యాజమాన్యంలో ఉంది.

MG మోటార్ ఇండియా యొక్క కొత్త మెజారిటీ యజమాని ఎవరు కావొచ్చో చూద్దాం?

MG మోటార్ ఇండియాలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూజా (అశోక్ లేలాండ్ ప్రమోటర్), రిలయన్స్ మరియు JSW గ్రూప్ వంటి కార్ల తయారీదారులు ఆసక్తిని కనబరిచారు. 45-48 శాతం వాటాను ఈ కంపెనీలలో ఏదైనా ఒక కంపెనీ కొనుగోలు చేయవచ్చని, దానిలో కొంత అదనపు శాతం డీలర్లు మరియు భారతీయ ఉద్యోగులకు చేరుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇది MG దిశను ఎలా మారుస్తుందో చూద్దాం?

రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతీయ ఈక్విటీ కలయికతో, SAIC మైనారిటీ వాటాదారుగా మారుతుంది, దాదాపు 49 శాతం లేదా అంతకంటే తక్కువ వాటా మాత్రమే పొందుతుంది. ఇది MG మోటార్ ఇండియాను భారతీయ కంపెనీగా మర్చి, దాని 'చైనీస్ బ్రాండ్' ఇమేజ్‌ను తొలగిస్తుంది.

ఇది కూడా చదవండి: కామెట్ EVకి బదులుగా EV MG భారతదేశానికి తీసుకురావాలా?

చైనా భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా, MG మోటార్ ఇండియా తన మాతృ సంస్థ SAIC నుండి ఫండ్స్ సేకరించలేకపోయింది. ఈ కలాపం కార్ తయారీదారుల నిధుల సేకరణ లావాదేవీలపై ఆపరేషన్స్ విస్తరించే ప్రణాళికపై అడ్డుగా నిలిచింది. ఇది బ్రాండ్‌ను పెంచుకోవడమే కాకుండా డిమాండ్‌ను కూడా పెంచుతుంది. భారతీయ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షిచే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది.

ప్రస్తుతం, MG దాని లైనప్‌లో ఐదు మోడళ్లను కలిగి ఉంది - కామెట్ EV, ఆస్టర్, హెక్టర్, ZS EV మరియు గ్లోస్టర్. ఇది నిర్దారించేసరికి, వచ్చే ఐదేళ్లలో ప్రస్తుతం ప్రణాళిక చేయబడిన 4-5 కంటే ఎక్కువ మోడల్‌లు ప్రవేశించబడతాయని ఆశించవచ్చు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.6.54 - 9.11 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర